
హాస్టల్ గదిలో ఉరివేసుకున్న భాగ్యలక్ష్మి, (ఇన్‌సెట్)లో భాగ్యలక్ష్మి ఫైల్
ఆదివారం తన బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ చేస్తూ హాస్టల్ రూములో...
సాక్షి, కృష్ణా : బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ మాట్లాడుతూ ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్. భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్ చేస్తూ హాస్టల్ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భాగ్యలక్ష్మి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియాల్సి ఉంది.