NYSE
-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్‌లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్‌లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందంటూ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై అమెరికాలో దావాకు రంగం సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ల హక్కుల సాధనకు సంబంధించి న్యాయ సేవలు అందించే రోజెన్ లా ఫర్మ్ ఈ అంశం వెల్లడించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యాపారపరమైన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ తాము దావా వేయనున్నట్లు రోజెన్ తమ వెబ్సైట్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాల అంచనాలను అందుకోలేకపోవడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. మదుపుదారుల తరఫున వేసే ఈ కేసుకు సంబంధించి ‘హెచ్డీఎఫ్సీ షేర్లు కొన్నవారు మా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ దావాలో భాగం కావచ్చు‘ అని పేర్కొంది. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్) రూపంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలోని ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీలో ట్రేడవుతుంటాయి. మరోవైపు, దావా విషయం తమ దాకా రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. వివరాల వెల్లడిలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. దావాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత పరిశీలించి, తగు విధంగా స్పందిస్తామని బ్యాంకు తెలిపింది. వాహన రుణాల విభాగంలో ఒక కీలక అధికారి తీరుపై ఆరోపణలు రావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూలైలో అంతర్గతంగా విచారణ ప్రారంభించడం దావా వార్తలకు ఊతమిచ్చింది. రోజెన్ లా సంస్థ గతేడాది కూడా ఇదే తరహాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై క్లాస్ యాక్షన్ దావా వేస్తున్నామంటూ హడావుడి చేసింది. కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఓ ప్రజావేగు చేసిన ఆరోపణల ఆధారంగా దీన్ని సిద్ధం చేసింది. -
కోలుకొని మళ్లీ కూలిన మార్కెట్లు!
హాంకాంగ్: సోమవారం నాటి భారీ పతనం నుంచి మంగళవారం ప్రపంచ మార్కెట్లు కోలుకొని ఆ తర్వాత మళ్లీ కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోగా, అమెరికా స్టాక్ సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు పుంజుకోవడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. అయితే చైనాలో అదుపులోకి వచ్చినా, ఇతర దేశాల్లో కోవిడ్–19 (కరోనా)వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. . కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటం, ముడిచమురు ధరల పోరు మొదలుకావడంతో సోమవారం ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లన్నీ 2–8 శాతం రేంజ్లో పతనమయ్యాయి. నష్టాల్లోంచి లాభాల్లోకి..... మంగళవారం ముడిచమురు ధరలు 8% మేర ఎగియడంతో ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా సూచీలు పుంజుకున్నాయి. కరోనా వైరస్ మూల కేంద్రమైన వూహాన్ నగరాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించడం, గత వారమే రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి రేట్లను తగ్గిస్తుందన్న వార్తలు, వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు... సానుకూల ప్రభావం చూపించాయి. సోమవారం అమెరికా మార్కెట్లు 8 శాతం మేర నష్టపోయిన నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. అయితే మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం రేంజ్లో లాభాల్లో ముగిశాయి. లాభాల్లోంచి నష్టాల్లోకి... ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి రాగా, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమై 1–2.5% రేంజ్ లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇటలీలో కోవిడ్–19 వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడం, ఆ దేశంలో ప్రయాణాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి మరికొంత సమయం పడుతుందనే వార్తలతో యూరప్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. డ్యాక్స్ (జర్మనీ), క్యాక్(ఫ్రాన్స్) సూచీలు 0.7 శాతం నుంచి 1.5 శాతం రేంజ్లో నష్టాల్లో ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యలో నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మొత్తం మీద తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి గం.11.30ని.)కు 0.7–1.2% రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ప్రతిరూపం... ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 1% (115 పాయింట్లు)నష్టంతో ట్రేడవుతోంది. దీంతో నేడు(బుధవారం) మన మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే అవకాశాలే అధికం గా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. -
ఎన్వైఎస్ఈ ఎఫెక్ట్... రిస్క్ మేనేజ్మెంట్పై సెబీ సమీక్ష
ముంబై : అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్వైఎస్ఈ)లో సాంకేతిక సమస్య కారణంగా బుధవారం 4 గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోవడంతో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు దృష్టిసారించాయి. దేశీ మార్కెట్లలో మొత్తం రిస్క్ మేనేజ్మెంట్, విపత్తుల రికవరీ వ్యవస్థలపై గురువారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సిస్టమ్స్ అన్నింటినీ క్రమంగా ఇప్పటికే అప్‌గ్రేడ్ చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు. సమీక్షలో అన్ని సిస్టమ్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైందని, ఎలాంటి సమస్యలూ గుర్తించలేదన్నారు. ఎన్వైఎస్ఈలో సాంకేతిక సమస్యను నాలుగు గంటల తర్వాత పరిష్కరించడంతో ఆ ఎక్స్ఛేంజ్లో ముగింపు సమయంలో ట్రేడింగ్ జరిగింది. కాగా ఈ సాంకేతిక సమస్యకు అంతర్గత సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్స్ కొంతవరకూ కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ దాడులు వంటివి ఈ సమస్యకు కారణం కాదని కూడా అమెరికా నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలు స్పష్టం చేశాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎస్ఈసీ) పేర్కొంది. మరోపక్క, బుధవారం కంప్యూటర్ సంబంధ సమస్యల కారణంగానే యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు రెండు గంటలపాటు నిలిచిపోవడం, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెబ్సైట్ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో అక్కడి నియంత్రణ సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది. -
నిలిచిపోయిన ఎన్వైఎస్ఈ
♦ సాంకేతిక సమస్యలతో న్యూయార్క్ ఎక్స్ఛేంజీ నిలిపివేత ♦ షేర్లలో లావాదేవీల్లేవు; ముందస్తు ఆర్డర్లు కూడా రద్దు ♦ బుధవారం రాత్రి 9కి హాల్టు; అర్ధరాత్రికీ చక్కబడని తీరు ♦ సైబర్ దాడి కాదని... సాంకేతిక సమస్యలేనని చెబుతున్న అధికారులు ♦ యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌కూ సాంకేతిక బెడద; విమానాలన్నీ నిలిపివేత ♦ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ డౌన్ న్యూయార్క్ : అమెరికాలో అనూహ్య సంఘటనలు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా పేరొందిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ తీవ్రమైన సాంకేతిక సమస్యలతో అల్లాడిపోయింది. ఫలితంగా ఈ ఎక్స్ఛేంజీలో లిస్టయిన షేర్లన్నిట్లోనూ లావాదేవీలు నిలిపేశారు. అప్పటికే పెట్టిన ఓపెన్ ఆర్డర్లన్నిటినీ రద్దు చేస్తున్నట్లు కూడా ఎక్స్ఛేంజీ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ విమానయాన సంస్థ యునెటైడ్ ఎయిర్లైన్స్నూ సాంకేతిక సమస్యలు అట్టుడికించాయి. దీంతో అమెరికాలోని తమ విమానాలన్నిటినీ ఈ సంస్థ అత్యవసరంగా కిందికి దింపేసింది. బయలుదేరాల్సిన విమానాలనూ కొంతసేపు నిలిపివేసింది. అదే సమయంలో ప్రముఖ ఫైనాన్షియల్ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్ కూడా పనిచేయకుండా డౌనయిపోయింది. దీనికి కారణాలు తెలియరాకపోగా... యునెటైడ్ ఎయిర్‌లైన్స్ మాత్రం రౌటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని, దీన్ని సరిచేసి మళ్లీ అన్నిటినీ పునరుద్ధరించామని తెలియజేసింది. ఈ 3 ఘటనలకూ సంబంధం లేకపోయినా, దాదాపు ఒకే సమయంలో జరగటంతో ప్రాధాన్యమేర్పడింది. రాత్రి 9 గంటల నుంచీ నిలిపివేత... భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గ ంటల సమయంలో ట్రేడింగ్‌ను నిలిపేస్తున్నట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. దాదాపు రాత్రి 12 గంటల సమయానికి కూడా పరిస్థితి చక్కబడలేదు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) అధికారులు అధ్యక్షుడు ఒబామాకు కూడా పరిస్థితిని తెలియజేశారు. ‘‘ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. కాకపోతే ఇది సాంకేతిక సమస్యే తప్ప సైబర్ దాడి కాదని మేం నమ్ముతున్నాం’’ అని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ట్రేడింగ్‌ను ఎప్పుడు పునరుద్ధరించేదీ మాత్రం ఈ వర్గాలు చెప్పలేకపోయాయి. రోజుకు 180 బిలియన్ డాలర్ల లావాదేవీలు... న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ పరిధిలో దాదాపు నాలుగు ఇండెక్స్లున్నాయి. ఎన్వైఎస్ఈ కాంపోజిట్ ప్రధాన ఇండెక్స్ కాగా, ఎన్వైఎస్ఈ 100 కూడా దీన్లో భాగమే. ఇంకా డౌజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు కూడా ఒప్పందం మేరకు దీని పరిధిలోనే పనిచేస్తాయి. ఎన్వైఎస్ఈలో ప్రతిరోజూ నమోదయ్యే లావాదేవీల పరిమాణ సగటు 180 బిలియన్ డాలర్లు. మార్కె ట్ క్యాపిటల్ దృష్ట్యా ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్ఛేంజీ. ఎందుకంటే దీన్లో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ దాదాపు 16.6 ట్రిలియన్ డాలర్లు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజీ (ఐసీ ఈ) అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా.. ట్రేడింగ్ నిలి చిపోయే సమయానికి ఆ సంస్థ షేరు విలువ దాదాపు 4% నష్టపోయింది.