జాజెన్ను కొనుగోలు చేసిన ఓ2 స్పా
రూ.102 కోట్ల పెట్టుబడులతో విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద డే స్పా చెరుున్ కంపెనీ ఓ2 స్పా విస్తరణ ప్రణాళికలతో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ముంబై కేంద్రంగా స్పా సేవలందిస్తున్న జాజెన్ను కొనుగోలు చేసినట్లు ఓ2 స్పా ఫౌండర్ అండ్ ఎండీ రితేష్ మస్తిపురం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రూ.102 కోట్ల (15 మిలియన్ డాలర్లు) పెట్టుబడులతో 30 నగరాల్లో 150 ఓ2 స్పా ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 30 ఔట్లెట్లు ద్వితీయ శ్రేణి, 60 ఔట్లెట్లు తృత్రియ శ్రేణి పట్టణాల్లో మిగిలిన విదేశాల్లో రానున్నట్లు తెలిపారు. జాజెన్ స్పా కొనుగోలుతో ప్రస్తుతం జాజెన్కున్న 18 ఔట్లెట్లతో పాటూ థెరపిస్ట్లు కూడా ఓ2 స్పా గూటిలోకి చేరిపోతారని చెప్పారు.