'అదితి' ఘటనలోముగ్గురు అధికారులపై వేటు
పెద్ద వాల్తేరు: విశాఖ నగరంలోని మద్దిలపాలెం ప్రాంతంలో రెండు రోజుల క్రితం డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలిక అదితి గల్లంతైన ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బాధ్యులైన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, ఏఈలను సస్పెండ్ చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదితి గురువారం సాయంత్రం వర్షపు నీటి ఉధృతికి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని గంటా శ్రీనివాసరావు శుక్రవారం సందర్శించగా, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. మరో వైపు మద్దిలపాలెం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో బీచ్‌లో కలిసే మార్గం వరకు చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.