offer discounts
-
ఆన్లైన్లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..
పండుగ సీజన్లో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఆఫర్ సీజన్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్ఫోన్లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్‌టాప్‌లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్లను విక్రయించారు. ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది. -
మరిన్ని డిస్కౌంట్ ఆఫర్ల బాటలో ఫ్లిప్‌కార్ట్...
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లకు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వడానికి వ్యూహాలు రచిస్తోంది. అమెరికా ప్రముఖ ఈ-కామర్స్ స్టార్టప్ జెట్.కామ్స్ స్మార్ట్ కార్ట్ ఆఫర్ చేసే సర్వీసుల ఆధారితంగా డిస్కౌంట్ ప్రైసింగ్ మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ మోడల్‌తో తమ ఫ్లాట్ఫామైపై వినియోగదారులు బహుళ ఉత్పత్తులను(మల్టిపుల్ ఐటమ్స్‌ను) కొనుకునేలా ప్రోత్సహిస్తూ, డెలివరీ చార్జీలు పొదుపుచేసేందుకు వాటిని వన్ బాక్స్‌లోనే రవాణా చేయనుంది. ఈ నెల చివరి నుంచి ఈ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జెట్.కామ్ అందిస్తున్న ఈ స్మార్ట్కార్ట్ సర్వీసులు పట్టణ ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్ల డీల్స్‌లో వివిధ రకాలైన ఆఫర్లను ఆ కంపెనీ అందిస్తోంది. ఒకేసారి మల్టిపుల్ ఉత్పత్తులను వినియోగదారులు ఆర్డర్ చేసినప్పుడు వాటిని ఒకే షిప్మెంట్లో వినియోగదారులకు అందించి, ఉత్పత్తులకు ప్రతీసారి వేసే షిప్పింగ్ చార్జీలను జెట్.కామ్ పొదుపుచేస్తోంది. ఈ రకంగా ఇటు కంపెనీకి, అటు వినియోగదారులకు లబ్దిచేకూరుతుంది. ఇప్పటికే ఆ కంపెనీకి కనీసం రోజుకు 25వేల ఆర్డర్ల వరకు నమోదవుతాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ అందించే ఈ సర్వీసుల కొరియర్ ధరలు స్లాబ్ చార్జీల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఎటువంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. జెట్.కామ్ ప్రస్తుతం వాల్‌మార్ట్ ఆధీనంలో ఉంది. ఈ సంస్థను వాల్‌మార్ట్ 3.3 బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసింది. జెట్.కామ్‌ను కొనుగోలుచేసిన వాల్‌మార్టే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మైనార్టీ స్టాక్ కోసం కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.. వారి ఉమ్మడి ప్రత్యర్థి అమెజాన్‌కు పోటీగా సేవలందించడానికి ఈ ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్ ఆధీన సంస్థ జెట్.కామ్ అందిస్తున్న ఆఫర్ల ఆధారితంగా ఫ్లిప్‌కార్ట్ కూడా వినియోగదారులకు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ.. ఈ పరిమిత కాల ఆఫర్లో భాగంగా చదువు పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులకు దేశీ విమాన టికెట్‌ను రూ.3,500 నుంచి అందిస్తోంది. తాజా ఆఫర్ ప్రయాణికులకు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.