Oil & Gas
-
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఎంతంటే..
భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100కు పెంచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా ధరల సవరణతో దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,833గా ఉంది. కోల్‌కతాలో రూ.1,943, ముంబైలో రూ.1,785, బెంగళూరులో రూ.1,914.50, చెన్నైలో రూ.1,999.50గా ఉంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. అక్టోబర్‌లో వీటి ధరను రూ.209కి పెంచారు. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచాయి. వీటి ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, బెంగళూరులో రూ.905, చెన్నైలో రూ.918.50 ఉంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ వాతావరణాన్ని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందున యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు గ్లోబల్ చమురు ధరలు బుధవారం పెరిగాయి. -
ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలం.. ఓన్జీసీ,రిలయన్స్ పోటీ
న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్షియం, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్‌లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్‌లైన్‌ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్ ముగిసింది. డీజీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్ చేసింది. రిలయన్స్–బీపీ బిడ్ చేసిన కేజీ బేసిన్ బ్లాకు కోసం పోటీపడలేదు. మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్ పెట్రోకెమికల్స్ తలో బ్లాక్ కోసం బిడ్ చేసి ఓఎన్జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్‌లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. -
చమురు రంగంలోకి 58 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి ఈ ఏడాది ఆఖరు నాటికి 58 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అంతర్జాతీయ ఇంధన దిగ్గజాలు షెవ్రాన్ కార్ప్, ఎక్సాన్‌మొబిల్, టోటల్ఎనర్జీస్ మొదలైన సంస్థలు పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి భౌగోళిక విస్తీర్ణాన్ని ప్రస్తుత 0.25 మిలియన్ చ.కి.మీ.ల నుంచి 2025 నాటికల్లా 0.5 మిలియన్ చ.కి.మీ.లకు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం -
రూ.11వేల పెట్టుబడులకు వేదాంతా సై, ఎందులో అంటే?
న్యూఢిల్లీ: వివిధ విభాగాలపై 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఆయిల్ అండ్ గ్యాస్, జింక్, స్టీల్ బిజినెస్‌లపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. శుక్రవారం(25న) జరిగిన బోర్డు సమావేశంలో ఇంధన విభాగం కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్‌పై 68.7 కోట్ల డాలర్లను వ్యయపరచనున్నట్లు తెలియజేసింది. వీటిలో 36 కోట్ల డాలర్లను మంగళ, భాగ్యమ్, ఐశ్వర్య బార్మెర్ హిల్, రవ్వ క్షేత్రాలపై వెచ్చించనున్నట్లు పేర్కొంది. కొత్త బావులలో తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. దక్షిణాఫ్రికాలోని గ్యామ్స్‌బర్గ్ జింక్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ కోసం 46.6 కోట్ల డాలర్లు వినియోగించనున్నట్లు వెల్లడించింది. వార్షిక సామర్థ్యాన్ని రెట్టింపునకు అంటే 8 మిలియన్ టన్నులకు చేర్చనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఏడాదికి 2 లక్షల మిక్ జింక్‌ను అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు వివరించింది. ఈ బాటలో 34.8 కోట్ల డాలర్లను స్టీల్ బిజినెస్ విస్తరణకు కేటాయించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కోక్ ఒవెన్స్‌కు దన్నుగా అదనపు బ్లాస్ట్‌ఫర్నేస్ ఏర్పాటు, పెల్లెట్, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. -
అటు బాంబుల మోత.. ఇటు ధరల వాత
-
చమురు షేర్లకు ధరల రెక్కలు
అంతర్జాతీయ మార్కెట్లలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిలో రష్యా, ఒపెక్ కోతలు విధించడం సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థల రికవరీకి దోహదపడగలవన్న అంచనాలు సైతం దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.సోమవారం లండన్ మార్కెట్లో 7 శాతం జంప్‌చేసిన బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా మరికొంత పుంజుకుని 35 డాలర్లకు చేరింది. ఇక న్యూయార్క్ మార్కెట్లోనూ ముందురోజు 8 శాతం ఎగసిన నైమెక్స్ బ్యారల్ 32.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక, తదితర కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.చమురు ఉత్పాదక కౌంటర్లపై సబ్సిడీ భారం తగ్గనుండగా..పెట్రో మార్కెటింగ్ షేర్లు సైతం కళకళలాడుతున్నాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలపడే వీలుండటం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 78కు చేరింది. ఈ బాటలో ఆయిల్ ఇండియా 6.5 శాతం ఎగసి రూ. 84ను తాకగా.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5.2 శాతం లాభంతో రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇంద్రప్రస్థ గ్యాస్ 2.3 శాతం పుంజుకుని రూ. 456 వద్ద కదులుతోంది. తొలుత ఈ షేరు 460 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 1.5 శాతం బలపడి రూ. 183 వద్ద, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.5 శాతం పెరిగి రూ. 73 వద్ద, హెచ్‌పీసీఎల్ 1 శాతం పుంజుకుని రూ. 175 వద్ద, బీపీసీఎల్ 1 శాతం లాభంతో రూ. 297 వద్ద ట్రేడవుతున్నాయి.ఇంట్రాడేలో బీపీసీఎల్ 304ను, హెచ్‌పీసీఎల్ రూ. 180నూ అధిగమించాయి. -
వైట్‌హౌస్ టైట్ ఫైట్ -మార్కెట్లు కుదేలు
వైట్ హౌస్ పగ్గాలకోసం అమెరికాలో హోరా హోరీ పోరు నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో క్షణానికోసారి అంచనాలు తారుమారవుతున్నాయి. ఇప్పటివరకూ డొమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, తాజా సర్వేలో అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందుకు దూసుకు వచ్చారు. దాదాపు 1-2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో అమెరికా సహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. వాల్ స్ట్రీట్ 4 నెలల కనిష్టం వద్దముగిసింది. చైనా షాంఘై o.6శాతం ఆసియా పసిఫిక్ 0. 4 శాతం, జపాన్ నిక్కి 1.1 శాతం నష్టపోయింది. అలాగే ఆరంభంలోనే భారీ నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్‌మార్కెట్లలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లు పైగా పతనమయ్యాయి. ముఖ్యంగా పీఎస్ యూ, ఆయిల్ అండ్ గ్యాస్,రియల్టీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రభుత్వ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఓన్ జీసీ, ఎస్ బీఐ, సన్ ఫార్మా, ఎం అడ్ ఎం లాంటి దిగ్గజాలు నేల చూపులు చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ లో పీఎన్బీ, ఓబీసీ, బీవోఐ, కెనరా, ఐడీబీఐ, బీవోబీ, సిండికేట్, స్టేట్‌బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యూనియన్, అలహాబాద్ బ్యాంక్ 4-3 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ప్రయివేట్ బ్యాంకు షేర్లలోనూ ఫెడరల్, యస్ బ్యాంక్, కరూర్ వైశ్యా, ఐసీఐసీఐ, ఐడిఎఫ్సీ, యాక్సిస్ తదితర షేర్లలోనూ ఇదే ధోరణి నెలకొంది. అటు ఫెడ్ అంచనాలతోడాలర్ బలహీనత కొనసాగుతుండగా, ఇటు దేశీయ కరెన్సీ 7 పైస లనష్టంతో 66.79 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు మాత్రం ఒక నెల గరిష్టాన్నినమోదు చేశాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 200 రూపాయల లాభంతో రూ. 30485 వద్ద బలంగా ఉంది. -
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
ముంబై: సోమవారం నాటి దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దాదాపు వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే నాటికి 89.84 పాయింట్ల నష్టంతో, 27,746 వద్ద, నిఫ్టీ 32.70 పాయింట్ల నష్టంతో 8,508గా నమోదైంది. పార్లమెంటు సమావేశాలు, మాన్ సూన్ అంచనాల నేపథ్యంలో పాజిటివ్ నోట్ తో మొదలైన మార్కెట్లు.. ఆయిల్, గ్యాస్ స్టాక్స్ లో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. మెటల్, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ లు 0.6-1.3 శాతం మేర పతనమయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బలహీనమైన క్యూ1 వాల్యుమ్ వృద్ధితో హెచ్ యుఎల్ షేర్లు 3శాతం పడిపోయాయి. అయితే హిందూస్తాన్ యునిలివర్ క్యూ1 లాభాలను రూ.1,174 కోట్లగా నమోదుచేసింది. పసిడి పతనం మరోవైపు పసిడి క్షీణత కొనసాగుతూ రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.30,550గా నమోదైంది. అదేవిధంగా సిల్వర్ ధర కూడా రూ.240 నష్టపోయి, కేజీ వెండి ధర రూ.46,260గా నమోదైంది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ మార్కెట్ల నుంచి వెండికి డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.16గా ఉంది.