న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి ఈ ఏడాది ఆఖరు నాటికి 58 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. అంతర్జాతీయ ఇంధన దిగ్గజాలు షెవ్రాన్ కార్ప్, ఎక్సాన్‌మొబిల్, టోటల్‌ఎనర్జీస్ మొదలైన సంస్థలు పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.
వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి భౌగోళిక విస్తీర్ణాన్ని ప్రస్తుత 0.25 మిలియన్ చ.కి.మీ.ల నుంచి 2025 నాటికల్లా 0.5 మిలియన్ చ.కి.మీ.లకు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment