Oil Import
-
ఆయిల్ ఫెడ్లో అక్రమ దందా?
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో నూనె దందా నడుస్తోందని, కేంద్రం నూనెపై దిగుమతి సుంకం పెంచిన తర్వాత, కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా నెలన్నర కాలంలోనే ఏకంగా 12 సార్లు ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై పెద్దయెత్తున భారం మోపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం దిగుమతి సుంకం పెంచడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు అధికారులు అక్రమార్జనకు తెరలేపారని, కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిన తర్వాత అప్పటికే నిల్వ ఉన్న వంట నూనెలను పాత ధరకే ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి.. వారు పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులకు అమ్ముకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వంటనూనెల ధరలన్నీ భారీగా పెంపు కేంద్రం సెప్టెంబర్ 14వ తేదీన వంట నూనెల దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెపై 12.5 శాతం నుంచి 32.5 శాతం వరకు పెంచింది. ఇది దేశవ్యాప్తంగా నూనెల ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. అయితే పాత నిల్వలను పాత ధరకే అమ్మాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాత నిల్వలు నెలన్నర రోజులకు పైగా సరిపోతాయని, ఆ తర్వాత కొత్త నిల్వలకు కొత్త ధరలు అమలు చేయాలని పేర్కొంది. కానీ ఆయిల్ ఫెడ్ కేంద్రం నిర్ణయాన్ని పెడచెవిన పెట్టి, దిగుమతి సుంకం పెంచిన రోజునే సంస్థ పరిధిలోని నూనె ధరలను పెంచేసింది. అలా పలుమార్లు ధరలు పెంచుకుంటూ పోయింది. అలా ఈనెల ఐదో తేదీలోగా పామాయిల్ లీటర్ ధరను రూ.96 నుంచి ఏకంగా రూ.131కు పెంచింది. అంటే ధర రూ.35 పెరిగిపోయిందన్న మాట. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.104 నుంచి రూ.138కి, రైస్ బ్రాన్ ధరను రూ.105 నుంచి రూ.136కు పెంచింది. దీపం ఆయిల్ ధరను కూడా రూ. 31 పెంచేసింది. కేంద్రం చెప్పినట్టు కాకుండా దిగుమతి సుంకం పెంచిన రోజు నుంచే ఆయిల్‌ఫెడ్ ఇలా ధరలు పెంచుతూ పోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంటున్నారు. ధరలు స్థిరీకరించాల్సింది పోయి బహిరంగ మార్కెట్లో నూనెల ధరలు పెరిగే సమయంలో వాటిని స్థిరీకరించాల్సిన బాధ్యత ఆయిల్‌ఫెడ్‌పై ఉండగా, అందుకు భిన్నంగా, కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి నూనె ధరలను పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన రోజున ఆయిల్‌ఫెడ్ వద్ద, దాని డీలర్ల వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ నూనె ఉన్నట్లు అంచనా. కాగా తన వద్ద ఉన్న నిల్వ నూనెను పాత ధరకు ఇచ్చి, కొత్త ధరకు అమ్ముకోవాలని కొందరు డీలర్లకు కొందరు ఆయిల్‌ఫెడ్ అధికారులు సూచించారు. అంతేకాకుండా డీలర్ల వద్ద అప్పటికే ఉన్న నిల్వ నూనెను కూడా కొత్త ధరకే అమ్ముకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 12 సార్లు ధరలను పెంచిన నేపథ్యంలో పెంచిన ప్రతిసారీ పాత నిల్వ నూనెలను కొత్త ధరకే అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. ఇలా నిల్వ నూనెలు కొత్త ధరకు విక్రయించడం వల్ల ప్రైవేట్ డీలర్లు అక్రమంగా దాదాపు రూ.10 కోట్ల అదనపు లాభం పొందినట్లు అంచనా. కాగా అందులో సగం అంటే సుమారు రూ.5 కోట్ల మేరకు ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు కీలకమైన అధికారులకు డీలర్లు కమీషన్లుగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ధరల పెంపుపై వినియోగదారుల నుంచి విమర్శలు వచ్చినా ఆయిల్‌ఫెడ్ అధికారులు కమీషన్ల మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీపావళికి ముందు రోజు ధర పెంపుపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆయిల్‌ఫెడ్ ఖాతరు చేయలేదని అంటున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై వివరణ కోసం ఫోన్లో సంప్రదించడగానికి ‘సాక్షి’ప్రయత్ని0చగా ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా స్పందించలేదు. -
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
‘పెట్రో దిగుమతుల తగ్గింపు’ పై కీలక భేటీ
న్యూఢిల్లీ: ముడి చమురు, గ్యాస్‌ల దిగుమతులను తగ్గించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడానికి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ భేటీలో వివరించింది. దేశీయంగా ముడి చమురు, గ్యాస్‌ల ఉత్పత్తిని పెంచడం, జీవ, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, ఇంధనాన్ని సమర్థంగా, పొదుపుగా వినియోగించడం తదితర మార్గాలను అవలంబించి దిగుమతులను తగ్గించుకోవచ్చని వివరించింది. సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, నీతీ ఆయోగ్ ఉప చైర్మన్, సీఈవో, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.