‘పెట్రో దిగుమతుల తగ్గింపు’ పై కీలక భేటీ
న్యూఢిల్లీ: ముడి చమురు, గ్యాస్‌ల దిగుమతులను తగ్గించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడానికి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ భేటీలో వివరించింది.
దేశీయంగా ముడి చమురు, గ్యాస్‌ల ఉత్పత్తిని పెంచడం, జీవ, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, ఇంధనాన్ని సమర్థంగా, పొదుపుగా వినియోగించడం తదితర మార్గాలను అవలంబించి దిగుమతులను తగ్గించుకోవచ్చని వివరించింది. సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, నీతీ ఆయోగ్ ఉప చైర్మన్, సీఈవో, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.