'నదిలో పడిన కారు.. కారులో మహిళలు'
ఓక్లాహామా: రోడ్డుపై వెళుతున్న కారు సడెన్ కారు సడెన్గా అదుపుతప్పింది. ఏం జరుగుతుందో తెలిసే లోగా వెళ్లి నదిలో పడింది. అదృష్టం బాగుండి సమాయానికి పోలీసులు స్పందించడంతో అందులోని ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఓక్లాహామా నగరంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం నది పక్కన ఉన్న రోడ్డు వెంట ఆదివారం సాయంత్రం 6.15గంటల ప్రాంతంలో వెళుతుండగా అనుకోకుండా అదుపుతప్పింది. దానిని నియంత్రించేలోగానే వెళ్లి నదీ భాగంలో పడిపోయింది. కారు సగం మునిగిపోయి పూర్తి స్థాయిలో జలసమాధి కానుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు అందులోని ఇద్దరు మహిళలను బయటకు తీసి కారును భారీ క్రేన్ సహాయంతో బయటకు లాగేశారు.