old age problems
-
అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక మలుపు. ఆ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. పదేళ్లుగా అద్వానీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాదే ఆయన భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే. -
‘ట్రంప్‌కు భార్య పేరు కూడా గుర్తులేదు’
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉన్న వయసు ప్రభావం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో ఆయనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై వయసుకు సంబంధించి వస్తోన్న విమర్శలను మరోసారి తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారుడైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సైతం తప్పులు చేస్తున్నారని తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన రిపోర్టును ప్రస్తావించారు. విత్ సేథ్ మేయర్స్ షోలో పాల్గొన్న బైడెన్ ట్రంప్‌పై విమర్శలు చేశారు. ‘మీరు అవతలి వ్యక్తి( డొనాల్డ్ ట్రంప్)ని గమనించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే ఉంటుంది. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు’ అని బైడెన్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఆలోచనలన్నీ కూడా కాలం చెల్లినవని అన్నారు. ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేదా తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అనే దానిపై స్పష్టత మాత్రం లేదు. అధ్యక్షుడు బైడెన్ వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక రిపోర్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా తగ్గిందని ఆ రిపోర్టు వెల్లడించింది. జీవితంలోని పలు కీలక విషయాలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని పేర్కొంది. తన కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ ఆయనకు గుర్తులేదని తెలిపింది. ఆయన యూఎస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని పేర్కొంది. అయితే ఆయనపై వెలువడిన ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల విమానం మెట్లు ఎక్కుతూ.. అయన తూలిపడిపోబోయారు. గతంలో ఓ వేదికపై ఎటువైపు నుంచి దిగాలో తెలిక తడబడిపోయారు. ఇటువంటి ఘటనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ ఘటనలు అన్నీ.. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆయనకు, డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా వీటినే రిపబ్లికన్ పార్టీకి ప్రచారానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే క్రమంలో బైడెన్.. ట్రంప్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. -
వృద్ధాప్యంలో డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా?
మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు సహజం. వృద్ధాప్యమంటే మరోమారు బాల్యదశకు చేరినట్లేనని పెద్దలు చెపుతుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం ముదిరేకొద్దీ వారిని పసిపిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసుపైబడుతున్న కొద్దీ ప్రతి జీవిలో అనేక జైవిక మార్పులు జరుగుతుంటాయి. మనుషుల్లో వయసు మీరే కొద్దీ జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, మతిమరుపు పెరగడం వంటివి గమనించవచ్చు. వృద్ధాప్యం ముదిరే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెరుగైన ఆరోగ్య విధానాలు అందుబాటులోకి రావడంతో మనిషి జీవన ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారాలు కూడా పెరిగాయి. ఇప్పటికీ సమాజంలో వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువగానే గమనించవచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్లేనని గుర్తించి పెద్దలపై, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజ విచ్ఛిన్నం జరుగుతుందని మానవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులను భారంగా పరిగణించేవారు అసలెందుకు వృద్ధాప్యంలో సమస్యలొస్తాయో అవగాహన పెంచుకోవడం అవసరమన్నది నిపుణుల మాట. అలాగే ఎవరమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు సైతం ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది. సో, జీవన సంధ్య వేళ సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం! వయోవృద్దుల్లో జీర్ణక్రియ మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణతకు, కండరాల బలహీనతకు, అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తినేది కొంచమైన పౌష్టికాహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ తినలేకపోతే, కొద్దికొద్దిగా పలుమార్లు ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. దైనందిన ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహారాలను తగ్గించాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు సాధారణంగా వృద్ధాప్యంలో డిప్రెషన్ వస్తుంది. అంతవరకు ఎంతో చురుగ్గా తిరుగుతూ అందరినీ శాసించినవారు క్రమంగా నిస్సహాయత ఆవరించడంతో ఏపని చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతుంటారు. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిరశా నిస్పృహలకుదారి తీస్తాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, కుటుంబం, స్నేహితుల సాయంతో ఉల్లాసంగా గడపడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్ ఛాయలు మనసులోకి రాకుండా చూసుకోవడం చేయవచ్చు. ఫుల్స్టాప్ పెట్టాలి. చిన్నప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన చెవులు, కళ్లు, నోరు వయసు ముదిరేకొద్దీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దీంతో చెవుడు, చూపు మందగించడం, పంటి సమస్యలు ఎదురవతుంటాయి. కళ్లజోడు, హియరింగ్ ఎయిడ్స్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వినికిడి, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించవచ్చు. అదేవిధంగా పెద్దయ్యేకొద్దీ వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో పళ్లు దెబ్బతినడం, నోరు పొడిబారడం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మొదటి నుంచి డెంటల్కేర్పై దృష్టి సారించాలి. ధూమపానం, పాన్ పరాగ్, తంబాకు వంటి అలవాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలి. మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. -
ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్!
వృద్ధాప్య లక్షణాలను తగ్గించి ఆయుష్షును పెంచే మందుపై జరిగిన తొలి పరీక్ష విజయవంతమైంది. వయసైపోయిన శరీర కణాలను (విభజన జరక్కపోయిన రసాయన సంకేతాలను వెలువరించే కణాలు) నాశనం చేసి బయటకు పంపించడం ద్వారా ఈ మందు పనిచేస్తుందని టెక్సస్ యూనివర్శిటీ శాస్త్రవేత్త నికోలస్ మూసీ తెలిపారు. ఈ కణాలు తొలగిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధులను నివారించవచ్చునని మూసీ అంటున్నారు. గత జనవరిలో తాను 14 మందితో ఒక ప్రయోగం చేశామని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వీరికి డాసాటినిబ్ (లుకేమియాకు ఇచ్చే మందు), క్వెర్సిటిన్ అనే మందులను కలిపి ఇచ్చామని చెప్పారు. కొంత కాలం తరువాత పరీక్షించినప్పుడు వారి ఆరోగ్యంలో ఎంతో మార్పు కనిపించిందని.. ఎక్కువ దూరం నడవగలిగారని తెలిపారు. ఈ ప్రయోగం చాలా పరిమితమైంది ఐనప్పటికీ... మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ దిశలోనే తాము 15 మందికి ఊపిరితిత్తుల, 20 మంది కిడ్నీ రోగులకు ఈ మందు ఇస్తున్నామని.. సత్ఫలితాలు వస్తే మరింత విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేపడతామని వివరించారు. -
ముసలోళ్ల కంటే ముసలమ్మలే నయం!
వార్ధక్యం వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, కళ్లజోడు నెత్తిమీద పెట్టుకుని దానికోసం ఊరంతా వెతుక్కోవడం.. ఇలాంటివన్నీ సర్వసాధారణం. అయితే, వయసు మీద పడ్డ తర్వాత కూడా మగాళ్ల కంటే ఆడాళ్ల మెదడు కొంత మెరుగ్గా పనిచేస్తుందట. ఈ విషయం తాజా సర్వేలో తేలింది. గడిచిన 20 ఏళ్లలో ఆడవాళ్ల సగటు జీవితకాలం బాగానే పెరిగింది. కానీ వాళ్లకు మాత్రం మతిమరుపు లాంటి సమస్యలు అంత ఎక్కువగా ఏమీ రావట్లేదట. మగాళ్ల విషయం మాత్రం అలా లేదు. కొంచెం వయసు మీద పడినప్పటి నుంచి వాళ్లలో మతిమరుపు అలా అలా.. వచ్చేస్తోందట. ఇలా ఎందుకు జరుగుతోందన్న దానికి కారణాలు దొరకట్లేదు గానీ.. జరగడం మాత్రం వాస్తవమని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. బహుశా మహిళలకు విద్యావకాశాలు పెరగడం లాంటివి కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయేమోనని అంటున్నారు. సంక్లిష్ట విషయాల గురించి ఆలోచిస్తూ మెదడును ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు డిమెన్షియా లాంటి సమస్యలు రావడం తక్కువని, మహిళలు ఇటీవలి కాలంలో యూనివర్సిటీలకు ఎక్కువగా వెళ్తుండటంతో.. వాళ్లకు డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు. న్యూకేజిల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు ఈ అంశంపై పరిశోధన చేశాయి. వాళ్ల పరిశోధనలో కూడా మహిళలు ఎక్కువ కాలం పాటు తెలివితేటలు కలిగి ఉంటారని, పురుషులు మాత్రం శారీకంగాను, మానసికంగాను త్వరగా అలసిపోతున్నారని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం పురుషులు దాదాపు 75.3 ఏళ్ల వయసు వరకు ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా ఫిట్‌గా ఉంటుండగా, మహిళలు 76 ఏళ్ల వరకు అలా ఉండేవారు. అదే ఇప్పుడు మాత్రం పురుషులు 77.9 ఏళ్ల వరకు, మహిళలు 76.5 ఏళ్ల వరకు ఫిట్‌గా ఉంటున్నారట. మహిళల్లో ఊబకాయం ఇటీవల కొంత ఎక్కువవుతోందని, అందువల్ల వారికి ఈ తరహా శారీరక సమస్యలు వస్తున్నాయని ప్రొఫెసర్ జాగర్ చెప్పారు.