the old faction
-
తల నరికి తీసుకెళ్లిన నలుగురి అరెస్టు
- పాత కక్షలతో హత్య - దొంగలు చంపినట్టుగా ప్రచారం - కేసును ఛేదించిన పోలీసులు జి.మాడుగుల: మండలంలోని వంజరి పంచాయతీ పినకిల్తారి సమీపంలో గిరిజనుడి తల నరికి తీసుకెళ్లిన ఘనటను పోలీసులు ఛేదించారు. పాతకక్షలు కారణంగా గ్రామానికి చెందిన వంజరి పోతురాజును అదే గ్రామానికి చెందిన వంజరి చిన్న అప్పలనాయుడు, గెమ్మెలి పాపారావు, కొర్రా సోమేశ్వరరావు, బోనంగి బంగారుపడాల్లు కలిసి హత మార్చారు. ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ సంఘటన గురించి సీఐ శ్రీనివాసరావు వివరాలు ఇలా ఉన్నాయి. పోతురాజు అన్నయ్య పొట్టినాయుడు కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. ఆయన భార్య లక్ష్మి,పోతురాజులు వరుసకు కొడుకైన రాజంనాయుడు ఇంటివద్ద కలిసి ఉంటున్నారు. కాగా అదే గ్రామానికి చెందిన వంజరి చిన్నఅప్పలనాయుడుతో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని సహించలేని పోతురాజు కొన్నాళ్ల క్రితం అతినితో గొడవ పడ్డాడు. అప్పటి నుంచి పోతురాజుపై చిన్నఅప్పలనాయుడు పగపెంచుకున్నాడు. దీంతో అతడ్ని చంపేందుకు పథకం రూపొందించాడు. తాగుడు అలవాటున్న పోతురాజును ఈ నెల 10న రాత్రి 7గంటల సమయంలో గెమ్మెలి పాపారావు ద్వారా సారా తాగడానికి గ్రామానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లాడు. అక్కడ పోతురాజుతో పాటు పాపారావు, చిన్నఅప్పలనాయుడు, కొర్రాసోమేశ్వరరావు, బోనంగి బంగారుపడాల్లు పూటుగా తాగారు. అనంతరం పాతపగతో ఉన్న చిన్నఅప్పలనాయుడు పోతురాజుతో గొడవ పెట్టుకున్నాడు. కాలితో గట్టిగా తన్నడంతో నేలమీద పడిపోయిన పోతురాజును నలుగురూ గట్టిగా అదిమి పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తితో అప్పలనాయుడు అతని మెడకోసి హతమార్చాడని సీఐ తెలిపారు. ఇదంతా చిన్నఅప్పలనాయుడు పథకంలో ప్రకారమే చేశాడన్నారు. మొండాన్ని రోడ్డుపై వదిలేసి తలభాగాన్ని వెంట తీసుకుపోయి దొంగలు హతమార్చినట్టుగా చిత్రీకంరించారు. సంఘటన జరిగిన నాటి నుంచి పోలీసుల నిఘా పెట్టారు. తన సమాచారం పోలీసులకు చెబితే మావోయిస్టుల్లో కలిసిపోయి చంపుతానిని బెదిరించి ఇంటి నుంచి హత్య చేసిన రాత్రి అప్పలనాయుడు వెళ్లిపోయాడు. కొందరి ద్వారా అందిన వివరాల మేరకు ముగ్గురిని గ్రామ పరిసరాల్లోను, చిన్నఅప్పలనాయుడును చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్లో పోలీసులు అరెస్టు చేశారు. మొండానికి కొంత దూరంలో ఉన్న తలను గుర్తించి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురిని రిమాండ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
స్తంభానికి కట్టేసి కొట్టారు
శ్రీకాళహస్తి రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఓ యుువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సంఘటన సోవువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సంజీవకుమార్ కథనం మేరకు.. మండలంలోని కోదండరామాపురం గ్రామంలో మునస్వామిరెడ్డి, బక్కారెడ్డి కుటుంబాలకు ముడేళ్లుగా పాతకక్షలున్నారుు. ఈ క్రమంలో మునస్వామి రెడ్డి(27)కి వస్తున్న పెళ్లి సంబంధాలను బక్కారెడ్డి వర్గం చెడగొట్టేది. ఈ విషయంపై మునస్వామిరెడ్డి శనివారం బక్కారెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించాడు. దీంతో బక్కారెడ్డితో పాటు భూపతి, దయూకర్, మోహన్, కౌసల్య కలిసి అతడిని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అతడు తీవ్రంగా గాయుపడటంతో స్థానికులు శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తనపై వుునస్వామిరెడ్డి దాడి చేశాడంటూ కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేయుడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నావుని ఎస్ఐ వివరించారు. -
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
తొర్రూరులో ఘటన బంధువులపైనే అనుమానం తొర్రూరు : పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన తొర్రూరు శివారులో అమ్మాపురంలో రోడ్డులోని భద్రకాళి దేవాలయం సమీపంలో శనివారం వెలుగు చూసింది. సీఐ సార్ల రాజు, ఎస్సై కరుణాకర్‌రావు కథనం ప్రకారం... మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన కుంట వెంకన్న, సుగుణమ్మ దంపతుల రెండో కుమారుడు మహేందర్(24) కొద్దినెలలుగా తొర్రూరులోని ఓ టైలర్‌షాపులో టైలరింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు శుక్రవారం ఉదయం షాపునకు వచ్చాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా తన బావలు నారబోయిన రాజారాం(మహేందర్ పిన్ని కూతురు భర్త), నారబోయిన పురుషోత్తం షాపు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచే మహేందర్‌ను వెంట తీసుకెళ్లారు. అరుుతే రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో మహేందర్‌కు అతడి అన్న కుమారస్వామి ఫోన్ చేశాడు.ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో టైలర్‌షాపు యజమానికి ఫోన్ చేయగా మహేందర్‌ను రాజారాం, పురుషోత్తం తీసుకెళ్లారని చెప్పాడు. పురుషోత్తం, రాజారంకు కూడా ఫోన్ చేయగా వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చారుు. దీంతో వారు ఆందోళనకు రాత్రంతా బంధువులకు ఫోన్లు చేస్తూ ఎదురు చూశా రు. అతడి జాడ తెలియకపోవడంతో శనివారం ఉదయమే కుమారస్వామి తన తమ్ముడి జాడ కోసం ఆటోలో తొర్రూరు బయల్దేరాడు. అదే సమయంలో భద్రకాళి ఆలయం సమీపంలోని ముళ్ల పొదల్లోపడి ఉన్న వ్యక్తిని చూసిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి సీఐ, ఎస్సై చేరుకుని ముళ్లపొదల్లోపడి ఉన్న అతడిని బయటికి తీసేసరికి రక్తపు మడుగులో మహేందర్ మృతిచెంది ఉన్నాడు. ఆటోలో తొర్రూరుకు వస్తున్న కుమారస్వామి పోలీసులు, స్థాని కులు గుమిగూడి ఉండడాన్ని చూసి ఆటో దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహం తన తమ్ముడిదిగా గుర్తించి బోరున విలపించాడు. రాజారాం, పురుషోత్తంలే తమ్ముడిని పొట్టనపెట్టుకున్నారని రోదించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. మృతుడు మహేందర్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. మృతుడి భార్య మౌనిక, తల్లిదండ్రులు వెంకన్న, సుగుణమ్మ, సోదరులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చెల్లెలిని కొడుతుంటే అడ్డుకున్నందుకే.. దారుణం మహేందర్ పిన్ని కూతురికి నారబోయిన రాజారాంతో వివాహమైంది. గత ఆరు నెలలుగా రాజారాం తన భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఒకసారి అలాగే కొడుతుండగా ఇంటి పక్కనే ఉన్న మహేందర్ చూడలేక తన ముందే తన చెల్లెలిని ఎందుకు కొడుతున్నావని రాజారాంతో గొడవపడ్డాడు. వారి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బావ, బావమరిది నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఆ విషయూన్ని మనసులో పెట్టుకున్న రాజారాం తన బావమరిది మహేందర్‌ను ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పెద్దనాన్న కుమారుడు పురుషోత్తంతో కలిసి మహేందర్‌ను హత్య చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు.