Old gold
-
పాత బంగారం మార్చుకుంటున్నారా?
పండుగలు అంటే కేవలం ఖర్చు చేయడమే కాదు.. భవిష్యత్‌కు ‘బంగారు’బాట వేసుకోవడం కూడా. నచ్చిన గృహోపకరణాలు, గ్యాడ్జెట్లు కొనే వారు, అందులో కొంత ఆదా చేసి భవిష్యత్ కోసం ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోకూడదు? ఇలా ఆలోచించే కొందరు పండుగ సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం కేవలం అందాన్ని పెంచే ఆభరణం మాత్రమే కాదు, విలువను పెంచే ఆస్తి. అస్థిరతల్లో ర్యాలీ చేసే పెట్టుబడి సాధనం. కనుక పండుగ సమయాల్లో విలువ తరిగిపోయే వాటి కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టేవారు.. పసిడికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. గడిచిన కొన్నేళ్లలో బంగారం కొనుగోలు ఎన్నో మార్పులను సంతరించుకుంది. 20 ఏళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టే వారు అరుదుగా కనిపించేవారు. తర్వాత కాలంలో ఇందులో స్పష్టమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా గడిచిన పదేళ్ల కాలంలో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవడం పెరిగింది. గతంలో బంగారంపై పెట్టుబడి అంతా భౌతిక రూపంలోనే ఉండేది. ఇప్పుడు సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, ఇప్పటికీ పెట్టుబడి దృష్ట్యా భౌతిక బంగారానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ధంతేరస్ (ధనత్రయోదశి) వంటి ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు నమోదవుతుంటాయి. ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యే ఆస్తుల్లో బంగారానికి మొదటి స్థానం ఉంటుంది. నేటితరం పాత బంగారాన్ని, కొత్త ఆభరణాలతో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి పాత బంగారం మారి్పడితో కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం సరైనదా..? ఆభరణాలను పెట్టుబడిగా చూడొచ్చా? పెట్టుబడి కోసం ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయడం మెరుగు? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. బంగారం మార్పిడి విధానం..? పాత బంగారు ఆభరణాలను మార్చుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్ల పట్ల ఆసక్తి ఏర్పడొచ్చు. పాత నగలు డ్యామేజ్ కావొచ్చు. లేదంటే కొత్త ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి బడ్జెట్ లేక పాత వాటిని మార్చుకోవచ్చు. కారణం ఏదైనా.. పాత బంగారం మార్చుకునే క్రమంలో కొంత నష్టపోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాత బంగారం ఆభరణాల మార్పిడికి సంబంధించి మన దేశంలో ప్రామాణిక విధానం అంటూ లేదు. వర్తకుల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఆభరణం కొనుగోలు చేసిన వర్తకుడి వద్దే దాన్ని మార్చుకోవడం వల్ల గరిష్ట విలువను తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. హాల్‌మార్క్ ఆభరణాలు అయితే బంగారం మార్కెట్ ధర మేర విలువను పొందొచ్చు. అయినా కానీ, ఆభరణాల తరుగు–తయారీ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. బంగారం ధరలో 10–20 శాతం వరకు తరుగు, తయారీ చార్జీలను జ్యుయలరీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. పాత ఆభరణాన్ని మార్చుకున్నప్పుడు అందులో తరుగు–తయారీ రూపంలో కొంత నష్టం ఏర్పడుతుంది. తిరిగి నూతన ఆభరణం కొనుగోలు చేయడం వల్ల, దాని తరుగు–తయారీ చార్జీల రూపంలో అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసిన వర్తకుడి నుంచి కాకుండా, వేరొక చోట పాత ఆభరణాన్ని మార్చుకునేట్టు అయితే ప్రక్రియ వేరుగా ఉంటుంది. వర్తకులు కొందరు కొన్ని అంశాల్లో ఏకరూప విధానాన్ని అనుసరిస్తుంటే, కొన్నింటి విషయాల్లో సొంత ప్రక్రియలను అమలు చేస్తున్నారు. పాత బంగారం ఆభరణాన్ని కరిగించి, స్వచ్ఛత చూసిన తర్వాత, కొత్త ఆభరణంతో మార్చుకోవడానికి చాలా సంస్థలు అనుమతిస్తున్నాయి. ‘‘డిజిటల్ స్కేల్ సాయంతో బంగారం ఆభరణం బరువు చూస్తారు. దీని ఆధారంగా స్వచ్ఛతను బట్టి ధర నిర్ణయిస్తారు. సాధారణంగా అనుసరించే స్వచ్ఛతలు 24 క్యారట్ (99.9 శాతం స్వచ్ఛత), 22 క్యారట్ (91.6 శాతం స్వచ్ఛత), 18 క్యారట్ (75 శాతం స్వచ్ఛత). కొందరు జ్యుయలర్లు స్క్రాచ్ (గీయడం), యాసిడ్ టెస్ట్ ద్వారా బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంటారు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ హెడ్ హరీశ్.వి తెలిపారు. అన్నింటికంటే ప్రామాణికమైనది హాల్‌మార్క్ స్వచ్ఛత విధానం. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) హాల్‌మార్క్ సరి్టఫికేషన్ సేవలు అందిస్తోందని, హాల్‌మార్క్ గోల్డ్ స్వచ్ఛత పరంగా విశ్వసనీయమైనదిగా హరీశ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెద్ద సంస్థలు అయితే క్యారట్‌ను కొలిచే మెషీన్లను ఉపయోగిస్తున్నాయి. వీటినే గోల్డ్ అనలైజర్ మెషీన్లు అంటున్నారు. అందులో బంగారం లేదా ఆభరణాన్ని ఉంచితే బరువు ఎంత, ప్యూరిటీ ఎంత అనే వివరాలను ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు వడోదరకు చెందిన రీనా దంపతులు ఎదుర్కొన్న అనుభవాన్ని తెలుసుకుంటే పాత బంగారం మారి్పడి ఇప్పుడు ఎంత సులభంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వీరివద్దనున్న 20 గ్రాముల బంగారం చైన్ తెగిపోగా, 2014లో మార్చుకుందామని అనుకున్నారు. ఓ జ్యుయలర్ వద్దకు వెళితే, కంటితో చూసి 18 క్యారట్ల బంగారం అని ఖరారు చేసి, రూ.37,500 ధర చెల్లిస్తానని చెప్పాడు. అప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.25,000 స్థాయిలో ఉంది. దీంతో వారు మార్చుకోలేదు. ఇటీవలే అదే చైన్‌ను ఓ వర్తకుడి వద్దకు తీసుకెళ్లగా, గోల్డ్ అనలైజర్ మెషీన్లో పెట్టి చూశారు. 22 క్యారెట్ల ప్యూరిటీ ఉన్నట్టు చూపించింది. దాన్ని కరిగించిన తర్వాత అసలు విలువ చెబుతానని అనడంతో, అందుకు రీనా దంపతులు ఒప్పుకున్నారు. కరిగించిన తర్వాత కూడా 22.1 క్యారెట్ నిర్ధారణ అయింది. దాంతో 10 గ్రాములకు రూ.61,000 చొప్పున విలువ కట్టారు. కొత్త ఆభరణం ధర కూడా అదే రీతిలో ఉండడంతో వారు మార్చుకునేందుకు సమ్మతించారు. కొత్త ఆభరణాల కొనుగోలు బంగారం కూడా ఒక ఆస్తే. ఎవరి పెట్టుబడుల పోర్ట్ఫోలియోకైనా ఇది విలువను పెంచుతుంది. ఆభరణం కోసం కొంటున్నారా? లేక పెట్టుబడి దృష్ట్యా కొంటున్నారా? అన్న స్పష్టత అవసరం. భౌతిక బంగారం, ఆభరణాల రూపంలో ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే తరుగు–తయారీ చార్జీలు, దానిపై జీఎస్టీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. నేడు చాలా జ్యుయలరీ సంస్థలు తమ వద్దే విక్రయిస్తే 100 శాతం విలువను చెల్లిస్తున్నాయి. ఒకవేళ ఆభరణంతో మార్చుకోకుండా, నగదు కోరితే మొత్తం విలువలో 5 శాతం వరకు తగ్గించి ఇస్తున్నాయి. పన్ను కోణంలో ఇలా చేస్తున్నాయి. ‘‘జ్యుయలరీ అనేది సెంటిమెంటల్. మనోభావాలతో ఉంటుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ అవుతుంటుంది. అయితే అధిక తరుగు–తయారీ చార్జీల (10–20 శాతం)తో మార్చుకునేందుకు అయ్యే వ్యయం ఎక్కువ. దీనికితోడు జ్యుయలరీ కోసం స్టోరేజ్, లాకర్ చార్జీలను కూడా చెల్లించుకోవాల్సి రావచ్చు. భౌతిక బంగారం అయినా, ఆభరణాలు అయినా అవి వ్యక్తిగత ఆస్తులు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువకు తోడు కావు. పెట్టుబడి కోసం అయితే బంగారం కడ్డీలు లేదా కాయిన్లను కొనుగోలు చేయడం కాస్త మెరుగైనది’’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దిల్షద్ బిల్లిమోరియా సూచించారు. అయితే బంగారం కాయిన్లు, కడ్డీలను తిరిగి విక్రయించే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అంటున్నారు. ‘‘బ్యాంక్‌లు కాయిన్లు, కడ్డీలను విక్రయించడమే కానీ, వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో వీటిని బయట విక్రయించుకోవాల్సి వస్తుంది. తరుగు, కరిగించేందుకు చార్జీలను ఆ సమయంలో వసూలు చేస్తున్నారు’’అని బిల్లిమోరియా వివరించారు. ఏమిటి మార్గం..? ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే చక్కని హెడ్జింగ్ సాధనం బంగారం అని నిపుణులు చెబుతున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరి పోర్ట్‌ఫోలియోలో అయినా వైవిధ్యం ఏర్పడుతుందని అంటున్నారు. కాకపోతే పెట్టుబడి దృష్ట్యా అయితే ఆభరణాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నది నిపుణుల సూచన. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం ధరలు ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా సగటున ఏటా 5–11% మధ్య వృద్ధి చెందాయి. ద్రవ్యోల్బణం పెరిగే సమయంలో గోల్డ్ చక్కని హెడ్జింగ్ సాధనం. పెట్టుబడుల వైవిధ్యం దృష్టా బంగారం ఒక మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. అయితే అది కడ్డీలు లేదా జ్యుయలరీ రూపంలో ఉండకూడదు’’ అని బిల్లిమోరీ సూచించారు. పీపీఎఫ్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సాధనాలు బంగారం మాదిరే వైవిధ్యానికి తోడు, మెరుగైన రాబడి, లిక్విడిటీతో ఉంటాయని చెప్పారు. కనుక పాత బంగారం మార్పి డి అనేది అవసరం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. ఉపయోగించని ఆభరణాలను మార్చుకుని కొత్తవి తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. పెట్టుబడి కోసం అయితే ఆభరణాలకు బదులు నిపు ణులు సూచించిన ప్రత్యామ్నాయాలను పరిశీలించడం మేలు. దీనివల్ల బంగారం విలువలో నష్టపోయే అవకాశం ఉండదు. 2010 వరకు బంగారం విలువ 10 గ్రాములు రూ.15,000 స్థాయిలోనే ఉండేది. కనుక పెట్టుబడుల దృష్ట్యా భౌతిక బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారు. కానీ, నేడు ధర గణనీయంగా పెరిగిపోవడంతో, పెట్టుబడి కోణంలో డిజిటల్ బంగారం సాధనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. -
పాత బంగారంపై జోయ్ అలుక్కాస్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘జోయ్ అలుక్కాస్’.. హాల్ మార్క్ కలిగిన పాత బంగారాన్ని గరిష్టవిలువకు మార్పిడి చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త బంగారాన్ని మార్చుకోవడం.. లేదంటే, తక్షణ క్యాష్ ఇస్తున్నట్లు వివరించింది. కోవిడ్–19 వైరస్ దృష్ట్యా తమ అన్ని షోరూంలను ప్రభుత్వం, ఆరోగ్య విభాగం ఇచ్చిన సూచనల మేరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, కేవలం 10 శాతం మొత్తానికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు వివరించింది. -
బురిడీ కొట్టించబోయిన బిహారీలు
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): మీ పాత వస్తువులు కొత్తగా తళతళలాడేలా మెరుగు పెడతామంటూ వచ్చేవారితో జనం మోసపోయిన సంఘటనలెన్నో. మెరుగు పేరుతో బంగారు అభరణాలనుంచి బంగారాన్ని కాజేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అదే విధంగా ఆలమూరు మండలం బడుగువానిలంకలో మోసగించేందుకు యత్నించిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను స్థానికులు నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. బడుగువానిలంక కొత్తూరులో అన్ని ఆభరణాలను తక్కువ రేటుకే సరికొత్తగా ఉండేలా మెరుగుపెడతామంటూ బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆదివారం వీధి వీధీ తిరిగారు. దూలం పండు నివాసానికి వెళ్లిన వారు ఆయన భార్య సుబ్బలక్ష్మి, కుమార్తె పోలావతిలను మెరుగు పెట్టించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. తొలుత ఇత్తడి వస్తువులను మెరుగుపెడతామని, మీరు సంతృప్తి చెందితే మిగిలిన వస్తువులకు కూడా మెరుగు పెట్టించుకోండని నమ్మ బలికారు. దాంతో ఆమహిళలు తొలుత దేవుడి మందిరంలోని ఇత్తడి వస్తువులను, తరువాత వెండి పట్టీలను మెరుగుపెట్టించుకున్నారు. వాటిని యథాతథంగా ఆమహిళలకు బిహారీలు అప్పగించారు. అనంతరం వారు తమ మెడలో ఉన్న బంగారు గొలుసును, మంగళ సూత్రాలను మెరుగు పెట్టించేందుకు అంగీకరించారు. ఆ బంగారు ఆభరణాలను బిహారీ యువకులు తమ వెంట తెచ్చుకున్న గిన్నెలో పోసిన ద్రావకంలో కడిగి మళ్లీ ఆవస్తువులను వారికి ఇచ్చేశారు. అయితే ఆరు కాసులు ఉండాల్సిన ఆబంగారు ఆభరణాల బరువు మూడున్నర కాసులు ఉన్నాయి. రెండున్నర కాసులు తక్కువగా ఉండటంతో పాటు రంగు తగ్గి వెలవెలబోయాయి. జరిగిన మోసాన్ని గుర్తించి ఆ మహిళలు కేకలు వేశారు. దాంతో గ్రామస్తులు ఆయువకులను పట్టుకుని బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యులుపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వెరయిటీగా పాత బంగారం
చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి. సెలవల కోసం పిల్లలు ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు అయిపోవడానికి. మహా ఉంటే మరో వారం రోజులు... జూన్ మొదటికల్లా స్కూళ్లు తెరుస్తారు. ఆంధ్రలో అయితే, సెలవులు ఇవ్వడం కాస్త ఆలస్యం అయింది కాబట్టి, బళ్లు తెరవడం కూడా ఇంకో గుప్పెడు రోజుల తర్వాతే. అది సరే, స్కూల్ తెరిచేసరికే పిల్లలకు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, లంచ్‌బాక్స్, యూనిఫారమ్, షూస్, టై, బెల్టు, బుక్స్ షాపింగ్‌తో పేరెంట్స్‌కు హడావుడి. కొత్తవి కొనక ఎలాగూ తప్పదు. పాతవాటినేం చేస్తారు మరి? అటకమీద పడేస్తారు. లేదంటే ఇంట్లోనే తర్వాత పుట్టిన పిల్లలకు అంటే తమ్ముళ్లకో, చెల్లెళ్లకో బలవంతాన ఇస్తారు. అంతేగా! మరింకేం చేస్తాం అంటారా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే, చిన్నారులకు కావలసిన స్కూలు సరంజామా కొనడానికి కిందా మీదా అవుతుంటే, ఇళ్లలో పని చేసే వారి పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడైనా ఆలోచించారా? కారు డ్రైవర్లు, పాలు పోసి పొట్టపోసుకునేవాళ్లు, ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వాళ్లు, చెత్తబండి వాళ్ల పిల్లలు, పేపర్లు, పాలప్యాకెట్లు వేసి చదువుకునే వాళ్ల సంగతి ఏమిటి మరి? పిల్లల చదువుల దగ్గర మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతున్నారేంటి అని తల పట్టుకుంటున్నారా? మరేం లేదు, మీ పిల్లల యూనిఫామ్స్, బుక్స్, స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, షూస్ వంటి వాటిలో బాగున్న వాటిని ఇంటిలో పని చేసేవారి పిల్లలకు ఇవ్వండి. వీలయితే, కొత్తవి కొనివ్వడం బెటర్. లేదంటే, చిన్న చిన్న చిరుగులు పడ్డవాటికి లేదా జిప్పులు పోయిన బ్యాగ్‌లకు చిన్నాచితకా రిపేర్లు చేయించి వాటిని కొనుక్కోలేని వారికి ఇవ్వండి. ఈ చిన్ని సాయమే వారిని పాఠశాలకు దూరం కాకుండా చేస్తుందేమో! స్టీలుసామాన్ల వారికో లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇచ్చేసి, వాళ్లు ఇచ్చే ఓచర్లు తెచ్చుకుని, వాటిని వదిలించుకోవడానికి అంతకు పది రెట్లు ఖర్చు చేసి, పర్సుకు చిల్లులు పెట్టుకోకండి. ఒకవేళ ఇతరులకు ఇచ్చేంత స్తోమత లేకపోతే, పాత వాటినే, కొద్ది మార్పులతో కొత్త వాటిలా తయారు చేసే ప్రయత్నం చేయండి లేదంటే, రీ సైక్లింగ్‌కు ఇవ్వండి. ఇదంతా ఎందుకంటే, ఒక వస్తువును తయారు చేయడానికి ఎంతో ఖర్చవుతుంది. దానిని పూర్తిగా వాడుకోకుండా మధ్యలోనే పారేసి, కొత్తవి కొంటూ పోతే, ఎంత చెత్త పేరుకు పోతుంది? తద్వారా పర్యావరణానికి ఎంతముప్పు? ప్రకృతిని ప్రేమించే వాళ్లయితే, బుర్రలకు కాస్త పదును పెట్టండి పాత వాటిని ఏం చేస్తే వాటిని పర్యావరణ హితంగా మలచుకోవచ్చో... నెట్లో సెర్చ్ చేస్తే బోలెడన్ని సైట్లు ... ఉపాయాలు... ట్రై చేయండి మరి! -
పాత ఆభరణాలు, కార్ల అమ్మకాలపై నో జీఎస్టీ
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా అమ్ముకునే పాత బంగారం ఆభరణాలు, కార్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కాబోదని ఆదాయపు పన్ను శాఖ గురువారం వివరణ ఇచ్చింది. ఆయా అమ్మకాలు వ్యాపారం చేయటానికి కాదు కనక జీఎస్టీ అమలు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, సెంట్రల్ జీఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్ 9 (4) పాత ఆభరణాల వ్యక్తిగత అమ్మకాలు జీఎస్టీ పన్ను పరిధిలోకి ఎంతమాత్రం రావని వివరించింది. కార్లు, ద్విచక్ర వాహనాలకూ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. రివర్స్ చార్జ్ విధానం గురించి వివరిస్తూ, పన్ను విధించాల్సిన వస్తువుల సరఫరాల (ఉదాహరణకు బంగారం) అంశానికి సంబంధించి రిజిస్టర్‌కాని సరఫరాదారు (వ్యక్తిగతంగా) ఒక రిజిస్టర్ అయిన వ్యక్తికి (జ్యూయెలర్) విక్రయాలు జరిపితే, రిజిస్టర్డ్ పర్సన్ పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ, అయితే వ్యాపార ప్రయోజనం నిమిత్తం ఆయా వాణిజ్య లావాదేవీ జరగకపోతే, పన్ను వర్తించబోదని తెలిపింది. అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ విషయంలో ఆభరణాలు రిజిస్టర్డ్ సప్లయర్‌కు అమ్మినా జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. -
పాత బంగారాన్ని కొంటాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు స్థిరంగా ఉన్నా అమ్మకాలు పెరగలేదని, ఎన్నికల తర్వాత బంగారంపై సుంకాలు తగ్గే అవకాశం ముందని ప్రముఖ జ్యూవెలరీ సంస్థ టైటాన్ (తనిష్క్) అంచనా వేస్తోంది. ఆభరణాల తయారీకి దిగుమతులపై కాకుండా స్థానికంగా ఉండే బంగారాన్ని సేకరించడానికి త్వరలోనే గోల్డ్ బై బ్యాక్ స్కీంను ప్రారంభిస్తామంటున్న టైటాన్ సీఈవో (జ్యూవెలరీ) సి.కె.వెంకటరామన్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధిస్తుండటంతో పరిశ్రమ ఏమైనా బంగారం కొరతను ఎదుర్కొంటోందా? ప్రభుత్వ ఆంక్షలకు తోడు డిమాండ్ తగ్గడంతో దిగుమతులు క్షీణిస్తున్న అంశాన్ని చూస్తూనే ఉన్నాం. అమ్మకాలు బాగా తగ్గడంతో ప్రస్తుతం పరిశ్రమ బంగారం కొరతను ఎదుర్కొనడం లేదు. కరెంట్ ఖాతా లోటు అదుపులోకి రావడంతో వచ్చే ఎన్నికల తర్వాత బంగారంపై విధించిన సుంకాలు దిగొస్తాయని అనుకుంటున్నాం. దిగుమతుల కంటే రీ-సైకిల్డ్ గోల్డ్‌పై ప్రధానంగా దృష్టిసారించమని ఆర్బీఐ సూచిస్తోంది? ఈ దిశగా టైటాన్ ఏమైనా ఆలోచిస్తోందా? ప్రస్తుతం భారతీయుల దగ్గర 30,000 టన్నులకు పైగా బంగారం ఉంది. దీన్ని తిరిగి కొనుగోలు చేయడం ద్వారా అవసరాలను తీర్చుకోమని ఆర్బీఐ కోరింది. కాని దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేవు. మా తనిష్క్ షోరూంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఈ ఏడాదిలోగా గోల్డ్ బైబ్యాక్ స్కీంను ప్రవేశపెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం. సెంటిమెంట్ పరంగా చూస్తే భారతీయులు బంగారాన్ని విక్రయించడానికి అంతగా ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీం జయవంతం అవుతుందని అనుకుంటున్నారా? బంగారం సెంటిమెంట్ విషయంలో ఉత్తరాది వారికంటే దక్షిణాది వారికి సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. వీరు ఆభరణాలు అమ్మడానికి ఇష్టపడరు కాని కాయిన్స్ విక్రయించడానికి వెనుకాడరు. భారతీయులు కలిగిన 30 వేల టన్నుల బంగారంలో సుమారు 15 నుంచి 20 శాతం కాయిన్స్ ఉన్నట్లు అంచనా. అంటే 4,500 నుంచి 6,000 టన్నుల బంగారం కాయిన్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ మొత్తాన్ని ఒకటి రెండు సంవత్సరాలు కొనుగోలు చేయడం ద్వారా దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. గత కొంతకాలంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు తగ్గి స్థిరంగా ఉండటంతో అమ్మకాలు ఏమైనా పెరిగాయా? రెండు సంవత్సరాల క్రితం నుంచి బంగారు ఆభరణాల పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంకా కోలుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. అమ్మకాలు తగ్గడంతో వ్యాపార విస్తరణను ఏమైనా తగ్గించారా? రాష్ట్ర విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా? ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా కొత్తగా మరో 30 షోరూంలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమస్య అమ్మకాలపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా బంద్‌లు, సమ్మెల వల్ల వ్యాపారం బాగా పడిపోయింది. దీంతో రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించాం. ప్రస్తుతం బంగారు ఆభరణాల తయారీలో యాంత్రీకరణ ఏ స్థాయిలో ఉంది? ఇతర రంగాలతో పోలిస్తే బంగారు ఆభరణాల తయారీకి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ఈ రంగంలో ఇప్పుడిప్పుడే యాంత్రీకరణ జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం 30 శాతం ఆభరణాలు యంత్రాల ద్వారా తయారవుతుంటే, మిగిలినవి చేతి ద్వారానే తయారవుతున్నాయి. యంత్రాల ద్వారా తయారవుతున్న వాటిలో అత్యధికంగా చైన్లు, గాజులు ఉన్నాయి. ఆభరణాల తయారీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీని పరిష్కారం కోసం మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ రంగంలోకి కొత్త వారసులు రాకపోవడంతో నిపుణులు కొరత ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీనికి ప్రధాన కారణం సరైన ఆదాయం లభించకపోవడమే. అందుకే దీన్ని పరిష్కరించడానికి కారిగర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాం. అన్ని సౌకర్యాలు ఒకేచోట అందిస్తుండటంతో స్వర్ణకారుల ఆదాయం రెట్టింపు అవుతోంది. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెలకు 600 గ్రాముల ఆభరణాలు తయారు చేస్తుంటే, ఈ కేంద్రాల్లో 1,500 గ్రాముల వరకు తయారు చేస్తున్నారు. రానున్న కాలంలో యాంత్రీకరణ పెంచడం ద్వారా ఈ సామర్థ్యాన్ని మూడు కేజీలకు పెంచాలన్నది మా ఆలోచన. అలాగే ఒక ఆభరణం తయారు కావడానికి సగటున 21 రోజులు పడితే ఈ కేంద్రాల్లో మూడు రోజుల్లోనే తయారవుతోంది. దేశం నుంచి బంగారు ఆభరణాల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? వీటిల్లో టైటాన్ వాటా ఎంత? బంగారం వినియోగంలో మనం ముందున్నా.. ఆభరణాల ఎగుమతులు అసలు లేవనే చెప్పాలి. దీనికి కారణం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మన ఆభరణాల తయారీ లేకపోవడమే. ఈ కారిగర్ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభరణాలను తయారు చేసి ఎగుమతులు పెంచాలన్నది మా దీర్ఘకాలిక లక్ష్యం.