Old man committed suicide
-
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక..
సాక్షి,హైదరాబాద్ : స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం...గోల్నాక న్యూ గంగానగర్‌కు చెందిన ఆశయ్య(85) అదే ప్రాంతానికి చెందిన వహీద్‌తో కలిసి సివిల్ కాంట్రాక్ పనులు చేసేవాడు. ఇద్దరు ప్రాణస్నేహితులు. నిత్యం గల్లీలో ఒకే చోటు కుర్చుని కబుర్లు చెప్పుకునేవారు. 15 రోజుల క్రితం వహీద్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశయ్య మనోవేదనకు లోనయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగు మందు తాగి వృద్ధుడి మృతి
పూసపాటిరేగ : పురుగు మందు తాగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చల్లవానితోట పంచాయతీ బూర్లెవానికల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన లెంక పైడినాయుడు (68) మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం పురుగు మందు తాగాడు. వెంటనే బంధువులు గమనించి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ రాదేమోనని వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు(ఎం): పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) గ్రామ పరిధి కామునిగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాద నర్సయ్య (70) వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఆసరా పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు కూడా చేసుకున్నాడు. శనివారం లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అతికిస్తామని ఆధికారులు పేర్కొనడంతో నర్సయ్య అక్కడికి వెళ్లాడు. అక్కడున్న అధికారులను అడిగాడు. జాబితా ఇంకా రాలేదని వారు చెప్పడంతో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఏ అధికారీ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి విద్యుత్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.