old parents
-
పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?
‘శతమానం భవతి’ అన్నారు మన పెద్దలు. నూరేళ్లు జీవించి పిల్ల పాపల ఆనందాలు చూసి వీడ్కోలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటారు. ఒకప్పుడు ఆయుఃప్రమాణం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానాల వల్ల ఆయుఃప్రమాణం పెరిగింది. అయితే వైద్య విధానం ఎంత ఆధునికంగా ఉన్నా అది పూర్తిగా జబ్బు నయం చేయలేనివే ఎక్కువ. యధాతథ స్థితిని కొనసాగించి ఆయుష్షును పొడిగించగలుగుతున్నాయి. ఇది ఒక రకంగా వరం. మరో రకంగా ఇబ్బందిగా మారుతోంది. పెద్దవాళ్లు జబ్బుపడి ఎక్కువ రోజులు సహాయం పొందే స్థితికి వస్తే ఇంటిలో సమస్యలు మొదలవుతున్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి?మన దేశంలో 70 ఏళ్ల వయసు దాటాక స్త్రీల కంటే పురుషులే ఎక్కువ జబ్బుల గురించి ఆందోళన చెందుతున్నారట. దానికి కారణం మంచాన పడితే ఎవరు చూడాలి అనేది ఒకటైతే పూర్తి కదలికలు నియంత్రణలోకి వెళితే జీవితం చాలా కష్టంగా మారుతుందనే భయం ఒకటి. స్త్రీలకు సేవ చేసే స్త్రీలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటే పురుషులకు సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 70లు 80లకు చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడితే బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయం మీద చాలా ఇళ్లల్లో ఒక అనిశ్చితి నెలకొంటోంది.స్పష్టత వచ్చే వీలు ఉందా?తల్లిదండ్రులు జబ్బుపడితే వారి బాగోగులు చూసే స్థితిలో ఇప్పుడు సంతానం ఉండటం లేదు. దానికి కారణం బిజీ బతుకుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సం΄ాదించాల్సి వస్తోంది. దానికితోడు పిల్లల కెరీర్లకు వారి అవసరాలకు సమయం చాలదు. మధ్య తరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా త్రీ బెడ్ నివాసాలు ఉండి జబ్బుపడ్డ తల్లిదండ్రులకు ఒక గది ఇచ్చే వీలు 90 శాతం ఇళ్లల్లో ఉండటం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని అంటీముట్టనట్టు తయారవుతున్న సంతానం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది తల్లిదండ్రులను మరింత బాధపెడుతోంది. ఇప్పుడే ఇలా వీరుంటే రేపెలా అనే చింత పట్టుకుంటోంది.కూర్చుని మాట్లాడుకోవాలిఅంతా బాగున్నప్పుడే తల్లిదండ్రులు, పిల్లలు కూచుని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల అనారోగ్యం కోసం వారు సొంతంగా దాచుకున్న నిధిని, పిల్లలు తమ వంతుగా ఇవ్వగలిగిన నిధిని కలిపి ఒకచోట ఉంచి దాని గురించి సమాచారం ఇచ్చుకోవాలి. చూసే వీలు లేకపోతే ఏజెన్సీల సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ హాస్పిటల్లో చేర్చాలో ముందే నిర్ణయించుకొని ఆ హాస్పిటల్లో తరచూ చెకప్‌లు చేయిస్తూ ఉంటే సమయానికి కొత్త పేషంట్‌గా మారే పరిస్థితి ఉండదు. బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఏయే అనారోగ్యాలకు ప్రభుత్వ/చారిటీ ఆస్పత్రులు అతి తక్కువ చార్జీలకు వైద్యసేవలు ఇవ్వగలవో తెలుసుకుని అందరూ ఆ సమాచారం పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాన్నే వెచ్చించి ఉంటారు కాబట్టి వారికి కచ్చితంగా సమయం ఇవ్వగలమని, బాధ్యతను పంచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించాలి. సాధారణంగా ఎవరో ఒకరి నెత్తి మీద ఈ బాధ్యతను తోసే ధోరణి కొందరిలో ఉంటుంది. అది సమస్యను తీవ్రంగా పెంచుతుంది.పంతాలు విడవాలితల్లిదండ్రులు పెద్దవయసు వచ్చే వేళకు జీవితంలో వారి వల్ల లేదా సంతానం వల్ల ఎన్నో తప్పొప్పులు జరిగి పంతాలు పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు. కాని తల్లిదండ్రులు అనారోగ్య స్థితికి చేరుకునేవేళకు అవి సమసే వాతావరణం కల్పించుకోవాలి. క్షమ చాలా సమస్యలు దూరం చేస్తుంది. మనుషులు దూరమయ్యాక చేయగలిగింది ఏమీ లేదు. అందుకే పెద్దవారు వారి చివరిదశను ప్రశాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఇందుకు సామరస్య వాతావరణంలో ఎంత మాట్లాడుకుంటే అంత స్పష్టత వస్తుంది. వాట్సప్‌లు, ఫోన్ కాల్స్ మాని ఎదురుబొదురు కూచుంటే తప్ప ఇలాంటి సందర్భాలలో పరిష్కారాలు దొరకవు. అసలే జబ్బుపడ్డ పెద్దవారికి ఆత్మీయమైన ఇంటి వాతావరణానికి దగ్గర చేయడం అతిఒక్క కుటుంబ సభ్యుని బాధ్యత.(చదవండి: కాన్పులో రక్తస్రావం కావడంతో ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?) -
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా..
తల్లి.. తండ్రి.. ఈ లోకంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు. నవమాసాలు మోసి, ప్రాణం పోయే నొప్పులను పంటి బిగువన భరించి జన్మనిచ్చేది తల్లి అయితే.. బిడ్డ ముసిముసి నవ్వులకు మురిసిపోతూ.. బుడి బుడి అడుగుల్లో సంతోషం వెతుక్కుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకునేది తండ్రి. రక్తం పంచిన వీరిద్దరినీ మించిన బంధం మరొకటి ఉండదు..కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో దాచుకొనే నేస్తాలూ ఈ ఇద్దరే. అమ్మ లేనిదే ముద్ద దిగదు.. నాన్న లేనిదే కాలం గడవదు.. పిల్లలకు వీళ్లే రెండు కళ్లు. తాము తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలనుకునే తల్లిదండ్రులు.. కాస్త వయస్సు పైబడితే చాలు, అదే పిల్లలకు చేదవుతున్నారు. తమ బతుకు వారి రక్తమాంసాలనే విషయం మరిచి.. చచ్చినప్పుడు వెంట రాని డబ్బు కోసం కాటికి కాలు చాచిన ఎండు కట్టెలను వీధిన పడేస్తున్న ఘటన కడు దయనీయం. పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పడు.. అమ్మానాన్నలపై ఎనలేని ప్రేమ. పెరిగే కొద్దీ, ఓ తోడు ఇంటికి చేరగానే ఆ బంధం క్రమంగా బరువవుతోంది. ఈ రోజు వాళ్లు.. రేపు మనం అనే విషయాన్ని మరిచి, కళ్లను కమ్మేసిన కరెన్సీ పొరలు మానవ సంబంధాలను కనుమరుగు చేస్తున్నాయి. మట్టినే నమ్ముకున్న ఓ రైతు, రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఓ ఇంటి వాళ్లను చేసి ఉన్నంతలో పంచిపెట్టాడు. ఇక్కడే.. అన్నదమ్ములు, తోడి కోడళ్ల మధ్య అగ్గి రాజుకుంది. ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకొని.. చివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడం మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రగిరి: మండల పరిధిలోని కొటాల గ్రామానికి చెందిన చెంగల్‌రామ నాయుడు(86), నాగభూషణమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు యోగానంద తిరుపతిలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపనీలో జూనియర్ అసిస్టెంట్‌గా.. చిన్న కుమారుడు దేవరాజులు టీటీడీకి చెందిన సాంస్కృతిక విభాగంలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఇటీవల కొటాల గ్రామంలోని సర్వే నంబర్ 445లోని చెంగల్‌రామ నాయుడుకు చెందిన వ్యవసాయ భూమిలో 54 సెంట్లను యోగానందకు, 15 సెంట్లను దేవరాజులకు రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే 20 ఏళ్ల క్రితం చెంగల్‌రామ నాయుడు నిర్మించిన ఇంట్లో భార్యతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యోగనంద పాత ఇంటిని మరింత సౌకర్యవంతంగా కట్టుకోవడానికి బ్యాంకు లోను అవసరమని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నాగభూషణమ్మ, తమ్ముడు దేవరాజు సంతకాలు లేకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పంపకాల్లో అన్యాయమని.. సోమవారం రాత్రి యోగానంద ఇంట్లో ఉండగా అతని భార్య విశ్వేశ్వరి(వేద) వృద్ధులు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారంటూ గొడవకు దిగింది. మేము కోరిన మేరకు ఆస్తి పంపకాలు చేయలేదని, అడిగిన మేరకు రాసివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. వృద్ధాప్యం కారణంగా తాను ఎక్కడికీ రాలేనని, నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిల్లో ఉన్నామని కోడలితో కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా తిట్ల దండకం అందుకుంది. అంతటిలో ఆగకుండా తీవ్ర ఆగ్రహంతో ఇల్లు తన భర్త యోగానంద పేరిట ఉందంటూ వృద్ధులను బయటకు గెంటేసి తాళం వేసింది. బంధువుల ఇంట్లో ఆశ్రయం కోడలు ఇంట్లో నుంచి గెంటేయడంతో రాత్రి వేళ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితిలోని భార్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ పెద్దలు కోడలికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎంతో గుట్టుగా సంసారం నెట్టుకొచ్చినా, ఇద్దరు కొడుకులు ఉండి మరో ఇంట్లో ఉండాల్సి రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. విధిలేక పోలీసుస్టేషన్‌కు.. ఆ రాత్రి కన్నీళ్లతో గడిచిపోయింది. ఇక బంధువులకు భారం కాలేక, న్యాయం జరుగుతుందనే ఆశతో అతి కష్టం మీద పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. కొడుకు, కోడలికి సర్దిచెప్పి న్యాయం చేయాలని చంద్రగిరి ఎస్ఐ వంశీధర్‌ను వేడుకున్నారు. కనీసం పోలీసుస్టేషన్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల వద్దకే వెళ్లి ఎస్ఐ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు ఓ చిన్న గది ఒక రాత్రి బంధువుల ఇంట్లో తల దాచుకొని, మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వృద్ధ దంపతులకు కాస్త ఊరట కల్పించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. యోగానంద, అతని భార్య విశ్వేశ్వరితో చర్చించి, గట్టిగానే హెచ్చరించారు. కుమారుడి స్వాధీనంలోని ఇంట్లోనే వృథాగా ఉన్న ఓ గదిలో వృద్ధ దంపతులు ఉండేందుకు అతి కష్టం మీద ఒప్పించారు. కనీస సౌకర్యాలు లేని ఆ గదిని చూసి నాగభూషణమ్మ ఈ వయస్సులో తమకు ఇదేమి ఖర్మ అంటూ కన్నీరుమున్నీరైంది. అల్లారు ముద్దుగా పెంచినా.. ఇద్దరూ కొడుకులే కావడంతో జీవిత చరమాంకంలో ఎలాంటి లోటు ఉండదనుకున్నాం. ఈ వయస్సులో ఆస్తి పంపకాల వద్ద పెద్ద కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం కన్నీరు పెట్టిస్తోంది. నా భార్యకు ఇటీవల ఆపరేషన్ జరగడంతో కనీసం కూర్చోలేని పరిస్థితి. కష్టపడి ఇల్లు కట్టి, కొడుక్కు ఉద్యోగం తీయిస్తే నిలువ నీడ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ వయస్సులో మాకు ఇంకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. – చెంగల్‌రామ నాయుడు మమ్మల్ని మోసం చేశారు 2006లో మా మామ చెంగల్‌రామ నాయుడు ఆస్తి భాగపరిష్కారంలో నన్ను, నా భర్తను మోసం చేసి మా మరిదికి అనుకూలంగా వ్యవహరించారు. మెయిన్ రోడ్డులోని పొలం కాకుండా మాకు లోపలి భాగం ఇచ్చారు. అడిగితే అదేం లేదని, మీకు మెయిన్ రోడ్డులోనే ఉంటుందని చెప్పడంతో అప్పట్లో సంతకాలు చేశాం. ఇప్పుడు మా మరిది ఆ స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయమై అత్తమామలను సోమవారం రాత్రి ప్రశ్నిస్తే పత్రాలు ఎలా ఉంటే అలా చేసుకోండని అంటున్నారు. 2003లో అత్తమామలు ఉంటున్న ఇంటిని మాకు రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే మా ఇంటికి మాకు ఇమ్మంటున్నా. – విశ్వేశ్వరి, యోగానంద భార్య, కొటాల -
ఆస్తి నవ్వింది.. అమ్మ ఏడ్చింది!
సాక్షి, అమరచింత(కొత్తకోట): ‘నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకులు.. వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టడానికి ఆస్తులు ఏమిచ్చారంటూ.. తమ పోషణను పట్టించుకోకుండా బయటికి వెళ్లండని గొడవపడుతున్నారు..’ అంటూ వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు పుల్లారెడ్డి, గోవిందమ్మ పోలీస్‌స్టేషన్ ఎదుట తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. మూడురోజుల క్రితం తమకు న్యాయం చేయాలంటూ తమ పోషణకు భరోసాను కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. గురువారం అదే పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. వీరికి కుమారులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డితో పాటు కూతురు అలివేలమ్మ ఉన్నారు. తమకున్న పదెకరాల పొలంలో పెద్దకొడుకు వెంకట్‌రెడ్డి కూతుళ్ల వివాహ సందర్భాల్లో నాలుగెకరాలు అమ్మారు. భాగాల పంపిణీ సమయంలో కుమారులకు సమానంగా పంచి ఇచ్చారు. ప్రస్తుతం మూడు అంకణాల ఇళ్లు మాత్రమే తమ పేరిట ఉందని అది కూడా కాజేయాలనే కుట్రలు పన్నుతున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. ఇద్దరు కొడుకులు సమానంగా తమను పోషిస్తామని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారని, పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి ఇంటికెళ్తే చీదరించడంతో ఆ మాటలను భరించలేక చిన్నకొడుకు ఇంటికి వచ్చామన్నారు. హన్మంత్‌రెడ్డి కూడా అన్నకు ఇచ్చిన ఇంటిని తనపేర రాస్తే శాశ్వతకాలం పోషిస్తానని చెప్పడంతో పెద్ద కొడుకుకు ఇచ్చిన ఇంటిగోడను పడగొట్టే ప్రయత్నం చేశామని ఇందుకుగాను పోలీసులకు పెద్దకొడుకు వెంకట్‌రెడ్డి మాపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఉన్న పింఛన్లు కూడా పాయే! ప్రతినెలా వస్తున్న వృద్ధాప్య పింఛనుతో కాలం గడిపేవాళ్లమని పుల్లారెడ్డి, గోవిందమ్మ తెలిపారు. ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఉండరాదన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇద్దరిలో ఒకరి పెన్షన్‌ను తొలగించడానికి బదులుగా ఉన్న రెండూ తొలగించారన్నారు. ఐదు నెలలుగా చేతిలో డబ్బులు లేకపోవడంతో వ్యక్తిగత అవసరాలకు కొడుకులనైనా అడగలేక మదనపడుతున్నామన్నారు. అంతేగాక తమ పెద్ద కుమారుడు వెంకట్‌రెడ్డి కూతుళ్లు, అల్లుళ్లు కూడా తమను ఇంటి నుంచి గెంటివేస్తామని బెదిరిస్తున్నారని, తమ గోడును ఆలకించి తమకు న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఏఎస్ఐ వెంకట్రాములును వివరణ కోరగా ఈ వ్యవహారంలో తండ్రి, కొడుకులే కూర్చుని మాట్లాడతారని గడువు కోరారని తెలిపారు. -
తల్లిదండ్రుల జోలికెళ్తే...
సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007కి కీలక సవరణలు చేసింది. తల్లిదండ్రుల(60 ఏళ్లపైబడిన వారిని)ను నిర్లక్ష్యం చేసినా లేక వేధించినా ఇది వరకు మూడు నెలల శిక్ష విధించేవారు. కానీ, తాజా ముసాయిదా చట్టం ప్రకారం దానిని ఆరు నెలలకు మార్చారు. అంతేకాదు తల్లిదండ్రులకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నెల రోజుల శిక్ష విధించేలా సవరణలు చేశారు. ఈ మేరకు ట్రిబ్యూనల్స్‌కు అధికారాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది ఓ సర్వేలో వెల్లవైన వివరాల ప్రకారం.. 44 శాతం మంది వృద్ధులు తమ పిల్లలు తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. దుర్భషలాడటం, చెయ్యి చేసుకోవటం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని చాలా మంది తెలిపారు. దీంతో ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు దత్తత తీసుకున్న వారిని, అలుళ్లు, కోడళ్లు, మనవళ్లు-మునిమనవరాళ్లను కూడా వారసుల జాబితా పరిధిలోకి తీసుకురానుంది.ఈ చట్టం అమలులోకి వస్తే గనుక నిస్సహయులైన వృద్ధులకు వారి వారి వారసులు రూ.10 వేల నెలనెలా భరణంగా చెల్లించటం తప్పనిసరి అవుతుంది. -
తండ్రిని మోసం చేసిన కొడుక్కి కోర్టు ఝలక్
పాటియాల: కన్నతండ్రిని మోసం చేసిన ఓ కుమారుడు అతడి భార్యకు పంజాబ్‌లోని ఓ కోర్టు తగిన బుద్ది చెప్పింది. మాయమాటలు చెప్పి, బంగారంలా చూసుకుంటామని నమ్మబలికించి వారికున్న పొలాన్ని తమ పేరుమీదకు మార్పించుకుని ఆ తర్వాత తల్లిదండ్రులను వెళ్లగొట్టిన ఆ ప్రబుద్ధులకు తగిన శాస్తి చేసింది. ఆ పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతుల పేరుమీదకు మార్చాలని చెప్పింది. దీంతో చకచకా ఆ మండల అధికారి ఆ పనులు పూర్తి చేయడంతో ఆ కపట తనయుడు, కోడలు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని టర్కియానా గ్రామంలో జోగిందర్ సింగ్ (80) అనే పెద్దాయనకు మల్కిత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. వారికి ఐదున్నర ఎకరాల భూమి ఉంది. అయితే, వృద్ధులైన ఆ తల్లిదండ్రులను కుమారుడు, కోడలు కలిసి నమ్మబలికించి మొత్తం పొలాన్ని రాయించుకున్నారు. అనంతరం అప్పుడే నిర్మించుకున్న కొత్త ఇంట్లో నుంచి గెంటేశారు. వెంటనే ఊర్లోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్న పాత ఇంట్లో ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు కావడంతో తలదించుకొని అతడి మాట ప్రకారం ఊరెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో వృద్ధుడైన జోగిందర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) బజిందర్ సింగ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారి సంక్షేమం దృష్ట్యా ఆ కుమారుడి చేతిలోకి వెళ్లిన పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతులకు కేటాయించారు.