oli company
-
ఆయిల్ కంపెనీలకు భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయెల్– ఏటీఎఫ్ ఎగుమతులపై జీరో రేటును కొనసాగిస్తూనే, దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై కూడా ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) ప్రభుత్వం మంగళవారం నుండి పూర్తిగా తొలగించినట్లు అధికారిక ఉత్తర్వులు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ పన్ను టన్నుకు రూ.4,100గా ఉంది. చమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతిదారుల భారీ లాభాలపై పన్ను విధించడానికి సంబంధించిన ఈ లెవీని గత ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా తొలగించడం ఇది రెండవసారి. ఏప్రిల్ ప్రారంభంలో పన్నును సున్నాకి తగ్గించారు. అయితే అదే నెల ద్వితీయార్థంలో టన్నుకు రూ. 6,400 విధించడంతో తిరిగి విధించారు. అటు తర్వాత రూ.4,100కి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పన్ను పూర్తగా తీసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్4న డీజిట్ ఎగుమతులపై, మార్చి 4 నుంచి ఏటీఎఫ్ ఎగుమతులపై పూర్తిగా తొలగించిన పన్ను యథాతథంగా కొనసాగుతుందని కూడా తాజా ప్రకటన తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌లో కోతకు ప్రధాన కారణం.. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు 80 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గడమేనని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వేగన్ - ఆర్! భారీ ఆదాయాలు.. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
వెలగని ‘దీపం’..?
నల్లగొండ :రాజకీయ నేతల ఆర్భాటం సామాన్యలను నట్టేట ముంచింది. దీపం కనెక్షన్లు ఎప్పటికై నా వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. రాజకీయ పైరవీలతో ఎంపిక చేసిన లబ్ధిదారులతో పాటు, అర్హులైన సామాన్యులు సైతం ఇక్కట్లు పడక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన సభ్యులకు ప్రత్యేకంగా దీపం కనెక్షన్లు కేటాయించింది. వీటితో పాటు గతంలో మిగిలిన కొన్ని కనెక్షన్లు కూడా తోడయ్యాయి. అయితే ఈ మొత్తం కనెక్షన్లకు సంబంధించిన డిపాజిట్లను లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కనెక్షన్‌కు రూ.1400 చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆయిల్ కంపెన్లీకు ఇవ్వలేదు. దీంతో కంపెనీలు కనెక్షన్లు మంజూరు చేయకుండా నిలిపేశాయి. ఎదురుచూపులు... అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 6,604 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక ఎన్నికల ముందు శాసన సభ్యుల కోటా పేరుతో కొత్తగా 31వేల కనెక్షన్లు మంజూరు చేశారు. ఎప్పుడూ జిల్లా కోటాతోనే మంజూరవుతూ వస్తున్న దీపం కనెక్షన్లు.. ఈ సారి ఎన్నికలు రావడంతో శాసనసభ్యులకు లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో ప్రత్యేక కేటాయింపులు చేశారు. దీంతో అప్పటి ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తులను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారికి కేటాయించిన కోటాలో 10వేల కనెక్షన్లు అప్పటికే గ్రౌండింగ్ కూడా పూర్తి చేశారు. ఇంకా 21వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పథకం మార్చే యోచన... కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు పాలనలో లబ్ధిదారుల ఎంపిక మళ్లీ మొదటికి వస్తోందేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఎమ్మెల్యేల కోటా విషయంలోనే ఈ ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో పాటు పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కూడా నివేదికలు కోరుతోంది. దీపం పథకాన్ని అసలు అమలు చేయాలా.. ? లేదా?, పథకంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాలపై జిల్లా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీపం కనెక్షన్లు పొందాలంటే లబ్ధిదారులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. దీపం గ్యాస్ కనెక్షన్ల గ్రౌండింగ్ వివరాలు సంవత్సరం మంజూరైనవి లబ్ధిదారుల ఎంపిక జరిగినవి పెండింగ్‌లో ఉన్నవి 2009-10 24,871 24,871 24,467 404 2011-12 14,000 14,000 7,800 6,200 ఎమ్మెల్యేలకు కేటాయింపు 31,000 31,000 10,000 21,000