రోడ్డు ప్రమాదంలో సద్గురు పైప్స్ ఎండీ మృతి
నల్లగొండ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో సద్గురు పీవీసీ పైపుల ఎండీ హరినాథ్ గుప్తా(45) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తున్నారు.
ఆ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో హరినాథ్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.అలాగే మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు.