one man arrested
-
గౌరీలంకేశ్ కేసులో పురోగతి
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య కేసులో బెంగళూరు పోలీసుల విచారణలో ఓ అడుగు ముందుపడింది. ఈ కేసుకు సంబంధించి మాండ్య జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తర్వాత నవీన్ నేరాంగీకార వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఫిబ్రవరి 18నే నవీన్‌ను అరెస్టు చేసినా ఆలస్యంగా ఈ విష యం వెల్లడైంది. నవీన్‌ను అక్రమ ఆయుధాల కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, తనే గౌరీని చంపినట్లు అంగీక రించినట్లు తెలిసింది. దీంతో నవీన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది. హత్య ప్రణాళిక, వినియోగించిన ఆయుధాలు తదితర అంశాలను రాబట్టింది. ‘ప్రస్తుతానికి ఒక నిందితుడినే అరెస్టు చేశాం. దీని ఆధారంగా కుట్రకు పాల్పడిన అందరినీ పట్టుకుంటాం’ అని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మల తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన నవీన్‌కు ‘హిందు యువసేన’తో సంబంధం ఉందని విచారణలో తేలిందన్నారు. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతోనే గౌరీలంకేశ్ హత్య జరిగిందని ఫొరెన్సిక్ లేబొరేటరీ గతంలోనే తెలిపింది. కన్నడ సాహితీవేత్త ఎంఎం కల్బుర్గీ, మహారాష్ట్ర వామపక్ష నేత గోవింద్ పన్సారేల హత్యల్లోనూ ఇలాంటి తుపాకులే వాడారు. -
దక్షిణాఫ్రికాలో గుప్తా ఫ్యామిలీ అక్రమాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ వాణిజ్య సంస్థలకు అధిపతులైన గుప్తాల కుటుంబంలోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్న గుప్తాల ఇళ్లపై పోలీసు దాడులు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ ప్రావిన్సులో ఉన్న వ్రెడె అనే పట్టణంలో పాల ఉత్పత్తి కేంద్రం నుంచి పేదలకు చెందాల్సిన కోట్ల రూపాయల డబ్బును అధ్యక్షుడి అండతో గుప్తా సోదరులు అక్రమ పద్ధతుల్లో కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయమై జొహన్నెస్‌బర్గ్ శివారు ప్రాంతమైన శాక్సన్వల్డ్లో ఉన్న వారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒకరు గుప్తా కుటుంబంలోని వ్యక్తి ఉన్నారు. జాకబ్ జుమాను పదవి నుంచి దిగిపొమ్మని ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ కోరడానికి కూడా గుప్తాలతో ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. జాకబ్ జుమాపై అవిశ్వాసం! అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి జాకబ్ జుమాకు ఏఎన్సీ బుధవారం సాయంత్రం (నిన్న) వరకు గుడువిచ్చింది. ఆయన రాజీనామా చేయకపోతే పార్లమెంటులో గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా మంది. రాజీనామా చేయాల్సిందిగా ఇప్పటికే జుమాను ఏఎన్సీ కోరగా ఆయన అందుకు నిరాకరిస్తున్నారు. ఏఎన్సీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదనీ, కానీ తనను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో, తాను చేసిన తప్పేంటో ఎవరూ చెప్పడం లేదని జుమా అన్నారు. ఎవరీ గుప్తాలు? జాకబ్ జుమాను తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగాధికారాలు సైతం చెలాయించిన గుప్తా సోదరుల ప్రయాణం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైంది. యూపీ లోని సహారాన్పూర్కు చెందిన శాండ్‌స్టోన్ వ్యాపారి శివ్‌కుమార్ గుప్తాకు అజయ్, అతుల్, రాజేష్ ‘టోనీ’ గుప్తా అనే ముగ్గురు కొడుకులున్నారు. వీరు 1993లో జొహన్నెస్‌బర్గ్‌లో అడుగుబెట్టి విశాల వాణిజ్య సామ్రాజ్యం నిర్మించారు. కంప్యూటర్లు, వాటి విడిభాగాల వ్యాపారంతో ప్రారంభించి మీడియా, యురేనియం, బొగ్గు గనులు, రియల్ ఎస్టేట్, లోహాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల వరకూ విస్తరించారు. అడ్డగోలుగా వ్యాపా రాలు చేశారు. 2009లో దేశాధ్యక్షుడైన జుమాకు అత్యంత సన్నిహితులుగా మారి న గుప్తాలు.. పాలకపక్షమైన ఏఎన్సీని సైతం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. ఊరి పేరుతో తొలి కంపెనీ.. గుప్తా సోదరులు తాము పుట్టి పెరిగిన సహారాన్పూర్ పేరు మీదుగా జొహన్నెస్ బర్గ్‌లో మొదటగా ‘సహారా కంప్యూట ర్స్’ను స్థాపించారు. ఇతర వ్యాపారాలకు విస్తరించాక 20 ఏళ్లలో అపర కుబేరుల య్యారు. 2013లో వారి సమీప బంధువు అనిల్ గుప్తా కూతురు పెళ్లికి చేసిన భారీ ఖర్చుతో వారి పేర్లు మార్మోగిపోయాయి. ఈ పెళ్లికి ఇండియా నుంచి 217 మంది అతిథులతో వచ్చిన విమానాన్ని వైమానికదళ స్థావరంలో దిగడానికి అనుమతించడంతో గుప్తాలు జుమాతో ఉన్న బంధాన్ని ఎలా వాడుకుంటున్నారో బయటపడింది. -
రూ. 5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
కేరళకు చెందిన వ్యక్తి అరెస్టు గోకవరం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ కారును ఎక్సైజ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సినీఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. కారులో సుమారు రూ. 5 లక్షల విలువైన 236 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ కారు కిర్లంపూడిలోని కృష్ణవరం టోల్‌గేటు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో టోల్‌గేటు రుసుము చెల్లించి చిల్లర తీసుకోకుండా వెళ్లింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అనుమానం వచ్చింది. వారు ఆ కారును వెంబడించారు. కారు డ్రైవర్ గండేపల్లి జాతీయ రహదారి నుంచి గోకవరం మండలంలోకి ప్రవేశించి కామరాజుపేటలోని ఎస్సీ కాలనీ శివారుకు చేరుకున్నాడు. ఇంతలో కారు టైరు పేలిపోవడంతో కారులోని బ్యాగ్‌లు తీసుకుని డ్రైవర్ పారిపోతుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించి అతనిని పట్టుకున్నారు. అతను కేరళకు చెందిన ఎన్.సుభాష్ అని తేలింది. అధికారులకు గ్రామస్తులు కూడా సహకరించారు. ఆ సమయంలో సుభాష్‌తో పాటు కాకినాడ విజిలెన్స్ అండ్ ఎక్సైజ్ సీఐ వేణుమాధవ అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో కారులో ఉన్న గంజాయిని గోకవరం తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ సమక్షంలో బయటకు తీశారు. సుమారు 236 కేజీల బరువు గల 118 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. దీని విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ గంజాయిని విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సై ఆర్.శివాజీ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోరుకొండ ఎక్సైజ్ సీఐ నాగార్జున, వీఆర్వో ధర్మరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.