విచారిస్తుండగా భవనంపై నుంచి కిందికి దూకేశాడు!
విజయవాడ: పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. విజయవాడలోని వన్‌టౌన్‌లో మూడో అంతస్తులో విచారిస్తుండగా వినోద్ అనే అనుమానితుడు భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ గురువారం నిందితుడు వినోద్ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఓ చోరీ కేసులో రెండు రోజుల కింద అనుమానంతో వినోద్‌ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.