కౌలురైతుల ఆందోళన
కౌలు చేసుకుంటున్న భూమి పట్టాలు ఇప్పించాలని కోరుతూ కౌలురైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని ఓంకారేశ్వర స్వామి దేవాలయ భూములను గత 30 ఏళ్లుగా గ్రామానికి చెందిన కొందరు రైతులు కౌలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ని రోజులుగా కౌలుకు చేస్తున్న భూమికి చెందిన పట్టాలను ఇప్పించాలని వాళ్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు.