Online account
-
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
డాక్ పే.. జిందాబాద్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దేశంలో వినియోగ దారులకు సత్వర సేవలు అందించేందుకు తపాలాశాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, కొరియర్, స్పీడ్ పోస్ట్‌తోపాటు బ్యాంకింగ్, గోల్డ్ బాండ్, బీమా తదితర సేవలను ప్రైవేటు సంస్థలకు దీటుగా దిగ్విజయంగా అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి డిజిటల్ లావాదేవీల పెంపునకు గూగుల్ పే, ఫోన్ పే మాదిరిగా డాక్ పే అనే యాప్‌ను 2021లోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని ప్రజలకు చేరువ చేసే దిశగా దూసుకెళుతోంది. ఈ డాక్ పే ద్వారా ప్రజలు డిజిటల్ ఫైనాన్స్ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, అందించే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డిజిటల్ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం లాంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చేలా డాక్ పే యాప్‌ను రూపొందించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా దీనిని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నారు. ఈ యాప్‌ను ఏ బ్యాంకు ఖాతాదారుడైనా వినియోగించవచ్చు. గ్రీవెన్స్ వెసులుబాటు గూగుల్ పే, ఫోన్ పే నగదు లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు చోటుచేసుకుంటే ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాటి కార్యాలయాలు మనకు అందుబాటులో ఉండవు. అయితే డాక్‌పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫిర్యాదుల స్వీకరణకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. డాక్ పే అనే యాప్ తపాలాశాఖ కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోనే పనిచేస్తుండడంతో మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది. యాప్ గురించిన సమగ్ర సమాచారం కోసం ఐపీపీబీ టోల్‌ఫ్రీ నంబర్ 155299ను వినియోగదారులు సంప్రదించొచ్చని తపాలా శాఖా అధికారులు చెబుతున్నారు. -
China: బూతు బొమ్మలతో ఉక్కు పాదం!
బీజింగ్: సోషల్ మీడియా కాలంలో ఉద్యమాల్ని అణచివేయడం అంత తేలికనా?.. అవునని నిరూపిస్తోంది చైనా. కోవిడ్ కట్టడి పేరుతో అక్కడ అమలు అవుతున్న కఠోర లాక్డౌన్ ఇక తమ వల్ల కాదంటూ ఎదురు తిరిగిన ప్రజావేశాన్ని తొక్కిపెట్టేందుకు దుర్మార్గమైన ఆలోచనలను అమలు చేస్తోంది జిన్‌పింగ్ నేతృత్వంలోని సర్కార్. బోట్ పోలీస్, సెక్స్ బోట్స్.. ఇప్పుడు నిరసనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న ఆయుధాలు. ప్రపంచమంతా కరోనా స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్న వేళ.. చైనా మాత్రం ఇంకా వైరస్ టెన్షన్‌తోనే వణికిపోతోంది. రోజుకు 30వేలకు పైగా కేసుల నమోదుతో.. జీరో కొవిడ్ పాలసీని.. అదీ అతికఠినంగా అమలు చేస్తుండడంతో జనం సహనం కోల్పోతున్నారు. చైనాలోని పదుల సంఖ్యలో నగరాల్లో.. కొవిడ్ ఆంక్షల వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరాయి. తమ గళాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ, ఆ ఆన్లైన్ నిరసనలను అంతే సమర్థవంతంగా అణచివేస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చైనాలో పాపులర్ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సెన్సార్ చేస్తున్నారు అధికారులు. నిరసన, బీజింగ్, అల్లర్లు.. ఇలాంటి పదాలతో కూడిన పోస్టులు చేయకుండా.. పూర్తిగా బ్యాన్ చేసింది. ఇందు కోసం పోలీస్ బోట్లను ఉపయోగించుకుంటోంది. అదే సమయంలో.. బయటి ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. ట్విటర్లో అయితే నిరసనల ప్రదర్శనల ఊసు లేకుండా చేస్తోంది. ట్విటర్ సెర్చింగ్‌లో.. చైనా నిరసనలు, బీజింగ్, ఇతర ప్రముఖల నగరాల కోసం వెతికితే.. ఆ ప్లేస్‌లో అందమైన మోడల్స్ ఫొటోలు, అశ్లీల వీడియోలు, బూతు బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్లు దర్శనమిస్తున్నాయి. చైనీస్(మాండరిన్) భాషలో.. అదీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆ పోస్టులు ట్రెండ్ అవుతుండడం గమనార్హం. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 2009లో ట్విటర్‌ను చైనా వ్యాప్తంగా బ్లాక్ చేసింది. అయితే కొందరు యూజర్లు వీపీఎన్, వెబ్సైట్ ప్రాక్సీ సర్వీసుల ద్వారా అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ట్విటర్లో ఇప్పుడు పెయిడ్ యాడ్స్ కనిపిస్తున్నాయి. అదీ పోర్న్ నుంచి వ్యభిచారం సంబంధించినవి ట్రెండ్ అవుతుండడం గమనార్హం. వీఛాట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇదే పరిస్థితి. నిబంధన ఉల్లంఘన పేరుతో నిరసనల పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ఏదైనా సరే.. ‘తప్పుడు సమాచారం’గా పేర్కొంటూ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. తాజాగా.. గురువారం ఉరుమ్‌ఖ్వీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఈ నిఘా ఎక్కువైంది. అగ్ని ప్రమాద సమయంలో కరోనా లాక్డౌన్, బారికేడ్లు, వాహనాల అడ్డగింత ద్వారా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించగా.. కఠోర నిబంధనల అమలుపై ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. Chinese netizens filling WeChat with angry messages condemning deadly fire in Urumqi (rescue possibly delayed by covid measures) and zerocovid policy. As messages are censored, netizens post articles only using ‘safe’ words: OK OK OK, agree agree agree, support support support pic.twitter.com/Bv4x6VIXN0 — leen vervaeke (@leenvervaeke) November 25, 2022 షుయిమోగావో జిల్లాలో ఓ యువకుడు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే.. అతన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ పదిరోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు చైనా అధికారులు. అదే సమయంలో నిరసనకారులపై వ్యతిరేక పోస్టులను, ప్రభుత్వ అనుకూల పోస్టులకు అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అనుమతి లభిస్తోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి హావో లిజియన్ భార్య.. నిరసన కారులపై ఆగ్రహంతో చేసిన ఓ పోస్టు విపరీతంగా ట్రెండ్ అయ్యింది. -
ఘనంగా ‘స్వరకల్పన సమారాధన’ ప్రథమ వార్షికోత్సవం
విద్యా సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారంతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎందరో గురువులు, కళాకారులు తమవంతు కృషిచేస్తూ పాటలు రాస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకు వచ్చేలా స్వరకల్పన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్లో జరిగిన ఈ కార్య క్రమంలో అన్నమయ్య కీర్తనలు, వర్ణాలు, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులు తెలుగు వారిని అలరించాయి. ఈ వేడుకలలో ప్రఖ్యాత గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి , మోదుమూడి సుధాకర్, ద్వారం వీకేజీ త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్నుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తిలు పాడిన కీర్తనలు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ రచనలన్నీ కొటేషన్స్ తో సహా ఒక ఈ-పుస్తకరూపంలో కూడా ప్రచురించారు. ఈ సందర్భంగా స్వరకల్పన సమారాధన నిర్వహాకులు మాట్లాడుతూ గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థికసహాయాన్ని కూడా అందించినట్లు తెలిపారు. భారత్‌తో పాటు సింగపూర్, అమెరికా, యూకే, మలేషియాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో వీక్షించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు ధన్యవాదాలు తెలిపారు. -
ఈ వాలెట్‌తో లాభమేనా?
► సొంత వాలెట్లతో ముందుకొస్తున్న ఈ-కామర్స్ సంస్థలు ► ఇతర సంస్థలతో ఒప్పందంతో సెమీ క్లోజ్డ్ వాలెట్లు కూడా ► భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు ► ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు ► డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు ► దీని దృష్ట్యా అవసరం లేకున్నా డబ్బులు వేస్తే నష్టమేనని సూచన బ్యాంకు ఖాతాలు అందరికీ తెలిసినవే. ఈ ఖాతాలో డబ్బులుంటే కావాల్సినపుడు తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఖాతా ఉంటే ఆ డబ్బులతో ఆన్లైన్ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. ఈ-వాలెట్ లేదా డిజిటల్ వాలెట్లు కూడా ఇలాంటివే. ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు సాయంతో వీటిలో కొంత డబ్బు డిపాజిట్ చేసుకుని, ఆన్లైన్ లావాదేవీలకు ఆ డబ్బును వాడుకోవచ్చు. ఒకవేళ ఇదే వాలెట్‌ను మొబైల్ ద్వారా వినియోగిస్తే దాన్ని మొబైల్ వాలెట్‌గా వ్యవహరిస్తారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్. ఓలా క్యాబ్‌ను బుక్ చేసినపుడు... ఓలా మనీతో చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫరుంది... చెప్పాడు సురేష్. పేటీఎం వాలెట్‌తో రీచార్జ్ చేయిస్తే 20 శాతం అదనపు టాక్‌టైమ్ ఇస్తారట... చెప్పాడు శ్రీనివాస్. ఇవన్నీ వింటున్న అజయ్‌కి ముందు అర్థం కాలేదు. తనకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్... ఇవన్నీ తెలుసు గానీ ఈ ఓలా మనీ... పేటీఎం వాలెట్ తెలీవు. శేఖర్ ఒక్కడికే కాదు. ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ మొబైల్, ఇంటర్నెట్ వాలెట్ల గురించి చాలా మందికి తెలీదు. మరి ఈ వ్యాలెట్ల కథేంటి? వీటితో ఏం చేయొచ్చు? అసలు ఎన్ని రకాల వాలెట్లుంటాయి? ఇంతకీ ఇవి వాడటం లాభమేనా..? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్. క్లోజ్డ్ వాలెట్... క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలాంటివన్నీ క్లోజ్డ్ వాలెట్లే. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వాటిలో జరిపే లావాదేవీలకే వినియోగించాలి. వేరే లావాదేవీలకు ఉపయోగించటం కానీ, ఒకసారి వేసిన డబ్బును వెనక్కి తీసుకోవటం కానీ కుదరదు. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల నియంత్రణలో ఉంటాయి కనక వీటికి ఆర్బీఐ అనుమతి కూడా అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సెమీ క్లోజ్డ్... ఈ-వాలెట్లలో డబ్బులు డిపాజిట్ చేసుకున్నాక వీటిని ఇతర ఆన్లైన్ సైట్లలో కూడా పరిమితంగా వినియోగించుకునే అవకాశముంటుంది. కాకపోతే సదరు వాలెట్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ఏఏ కంపెనీలతో ఒప్పందాలున్నాయో ఆ కంపెనీలు మా త్రమే ఈ వాలెట్లను అనుమతిస్తాయి. వాటితో జరిపే లావాదేవీలకు మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. మొబిక్విక్, పేయు, పేటీఎం, సిట్రస్ క్యాష్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు మాత్రమే చెల్లింపులు చేయొచ్చు. పెపైచ్చు ఈ చెల్లింపుల పరిమితి కూడా రూ.10వేల లోపే. వీటిలో కూడా ఒకసారి డిపాజిట్ చేసిన సొమ్మును లావాదేవీలకు వాడుకోవాలే తప్ప విత్‌డ్రా చెయ్యలేం. ఓపెన్... ఒక ఓపెన్ వాలెట్ల విషయానికొస్తే వీటి ద్వారా డబ్బులు వెయ్యటం, విత్‌డ్రా చెయ్యటం సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేసుకోవచ్చు. వీటిలో ఉన్న సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వాలెట్లను బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. అయితే వొడాఫోన్ ఎంపైసాను సెమీక్లోజ్డ్ వాలెట్ రూపంలో కూడా ఆఫర్ చేస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్ల ద్వారా నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు. ఇక ఈ ఓపెన్ డిజిటల్ వాలెట్లు పేమెంట్ బ్యాం కుల్లాంటివేనా... అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి రుణాలివ్వటం, డిపాజిట్లు సేకరించటం కానీ చెయ్యలేవు. డెబిట్ కార్డులు కూడా జారీ చేయవు. పెపైచ్చు వీటిలో రూ.లక్ష కన్నా ఎక్కువ ఉంచలేం. ఎయిర్టెల్ మనీ, ఎయిర్‌సెల్ మొబైల్ మనీ, టాటా టెలీ ఎం-రుపీ ఇలాంటివే. డిజిటల్ వాలెట్లతో లాభాలివీ... భద్రత: నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి తాలూకు ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటాయి. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు. ఒకవేళ డిజిటల్ వాలెట్ పాస్వర్డ్ వేరొకరికి తెలిసిపోయినా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది. సులువు: ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నాయి. యాపిల్ పే మాటల్లో చెప్పాలంటే... స్టోర్లలో, ఆన్లైన్లో చెల్లింపులు ఇప్పుడున్నంత ఈజీగా ఇంతకు ముందెన్నడూ లేవు. వినూత్న డిస్కౌంట్లు: వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావటంతో పాటు లాయల్టీ పాయింట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అయి ఉంటాయి కనక... దేన్ని కొనుగోలు చేయడానికి ఏ కార్డు వాడితే బెటరనే ఆలోచన అవసరం లేదు. నష్టాలూ ఉన్నాయ్! - ఓపెన్ వాలెట్లకు ఆర్బీఐ అనుమతి ఉంటుంది. వాటిలో డబ్బులు అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక సెమీక్లోజ్డ్గానీ, క్లోజ్డ్ గానీ ఏ వాలెట్లోనైనా డబ్బులు వేస్తే మళ్లీ తీసుకునే వీలుండదు. పెపైచ్చు ఈ వాలెట్లలో దేన్లో డబ్బులు వేసినా ఎలాంటి వడ్డీ రాదన్నది గుర్తుంచుకోవాలి. అందుబాటులో ఉన్నాయి కదా అని వివిధ రకాల వ్యాలెట్లలో డబ్బులు వేసేస్తే... అవసరం పడేంత వరకూ ఆ డబ్బులు వృథాగా పడి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. - ఒకోసారి మన వాలెట్లో డబ్బులున్న కంపెనీకి బదులు వేరే కంపెనీ సేవల్ని వినియోగించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నాయి. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవనుకుందాం. మరో కంపెనీ క్యాబ్‌ను అప్పటికప్పుడు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!. అంతెందుకు! ఓలా ఇటీవల కొనుగోలు చేసిన ట్యాక్సీ ఫర్ స్యూర్ తాలూకు క్యాబ్‌లన్నీ ఓలా యాప్‌లోనే ఉంటాయి. వాటిని ఆ యాప్ నుంచే బుక్ చేసినా... చివరికి డబ్బులివ్వాల్సి వచ్చినపుడు మాత్రం ఓలా మనీ నుంచి ఇస్తామంటే కుదరదు. నేరుగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నాయి. ఏదైనా కొనాలనుకున్నపుడు వివిధ ఈకామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి? డిజిటల్ వాలెట్లలో డిపాజిట్ చేసేముందు అవి ఎంతవరకూ అవసరమవుతాయన్నది ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడో ఒకసారి పడే అవసరం కోసం ముందే డబ్బులు వేసుకుని ఉంచటం తెలివైన పని కాదనేది నిపుణుల మాట.