online cheating case
-
ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!
ముంబై: ఇటీవల కాలంలో చాలా రకాల సైబర్ మోసాలను చూశాం. కానీ చాలా వరకు చదువుకున్నవారు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగలు మోసపోవడం చూశాం. అచ్చం అలానే ఇప్పుడు తాజాగా ఒక ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి ఆన్లైన్ సైబర్ మోసానికి గురైంది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) అసలు విషయంలోకెళ్లితే...70 ఏళ్ల ఆర్బీఐ రిటైర్డ్ మహిళా ఉద్యోగికి కేవైసీ అప్‌గ్రేడేషన్ కోసం హెచ్చరిస్తూ ఎస్బీఐ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని భావించింది. దీంతో ఆమె ఆ మెసేజ్‌లో వచ్చిన నెంబర్‌కి కాల్ చేస్తే సదరు వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా రాహుల్‌గా పేర్కొంటాడు. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం కేవైసీ ఆన్లైన్ అప్‌గ్రేడేషన్‌కి సంబంధించిన ఒక కొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందంటూ నమ్మబలుకుతాడు. దీంతో ఆమె అతను పంపించిన వెబ్ లింక్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే ఆ వెబ్ పేజి ఎస్బీఐ లోగోతో సహా ఉండటంతో ఆమె పూర్తిగా అతన్ని నమ్మి ఆ వెబ్‌పేజ్‌లో తన పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్‌తో సహా నమోదు చేస్తుంది. ఇక అంతే ఏకంగా ఆరు లావాదేవీల్లో ఒక్కసారిగా రూ 3 లక్షలు పోయినట్లు గుర్తించి వెంటనే ఆమె బ్యాంక్‌కి కాల్చేసి కార్డుని బ్లాక్ చేయిస్తుంది. ఆ తర్వాత బాధితురాలు చితల్సర్ మాన్పాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..) -
ఆ కన్నీటికి బదులేది..?
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సరిగ్గా 15 నెలలు క్రితం జిల్లాను కుదిపేసిన ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో అధిక వడ్డీలు వస్తాయని చెప్పడంతో అనేక మంది సుమారు రూ.180 కోట్లు దీనిలో పెట్టుబడులు పెట్టారు. అనంతరం ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు పెట్టినవారు రోడ్డున పడ్డారు. దీనిపై నెల రోజుల వ్యవధిలో సివిల్ పోలీసులు కేసులోని పలు కీలక అంశాలను పట్టుకొని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం ఈ కేసు సీఐడీకి తరలించారు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకూ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ మోసానికి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు అధికార పార్టీలోనే కొనసాగుతూ..చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారే ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ అండదండలతోనే.. సంతకవిటి మండలం తాలాడ గ్రామం వద్ద ఇండీట్రేడ్ పేరుతో మందరాడకు చెందిన టంకాల శ్రీరామ్ అనే యువకుడు ట్రేడ్ కార్యాలయాన్ని నిర్వహించాడు. అతను నాలుగేళ్లు వ్యాపారం చేసి పెట్టుబడులు సాధించిన అనంతరం పెట్టుబడులకు సంబంధించిన వడ్డీలు, వసులు ఇవ్వలేనని బోర్డు తిప్పేశాడు. 2017 నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేయడంతో సంచలనం ఏర్పడింది. అప్పటివరకూ ఆ సంస్థలో తక్కువ పెట్టుబడులే ఉంటాయని అనుకుంటుండగా బాధితులంతా రోడ్డుపైకి వచ్చి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ సంస్థలో సుమారు రూ.180 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసి జిల్లా మొత్తం నివ్వెరపోయింది. రోడ్డున పడిన బాధిత కుటుంబాలు ఈ కంపెనీ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు తిరిగిరావని తెలిసి బాధితుల్లో ఇద్దరు అకాల మరణం చెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు ఒకరు. ఆయనే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎంతో కష్టపడి గ్రామంలో ఉన్నతంగా ఎదిగారు. ఎంతో మందికి న్యాయం చేయడంతో పాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పేవాడు. అలాంటి అతనే చివరికి ట్రేడ్ బ్రోకర్ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ కూడా ఇదే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్ల వివాహం నిమిత్తం పెట్టుబడి పెట్టిన నగదు తిరిగిరాదని తెలుసుకుని ఆస్పత్రిపాలై చివరకు మృతి చెందింది. అప్పటి నుంచి ఆ కుంటుంబాలలో నుంచి విషాదచాయలు తొలిగిపోలేదు. ఎంతోమంది ఎప్పటికైనా డబ్బు తిరిగి వస్తుందని గుండెల నిండా ఆశతో జీవిస్తూ ఉన్నారు. అసలు ప్లాన్ ఎవరిది..? ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు అప్పటి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపరాణి శరవేగంగా కేసును దర్యాప్తు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, ఫిర్యాదుల ఆధారంగా బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సమయంలో నిందితులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేయగా కేసును ముందుకు నడిపించేందుకు సీఐడీకి అప్పగించారు. అయితే కేసు నేటికీ నడుస్తూనే ఉంది. మోసం వెనుక అసలు ఎవరు ఉన్నది తెలియడం లేదు. అయితే దీని వెనుక సంతకవిటి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చా యి. కానీ ఇప్పటికీ వీటి వెనుక కొత్త విషయాలు వెలుగులోకి రావడం లేదు. ఈ ఉదంతం జరిగి 15 నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కుటుంబాలు రోడ్డున పడి విలపిస్తుండగా, నిందుతులు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా కేసులో వేగం పెంచి నిందితుల నుంచి డబ్బును రికవరీ చేయాలని కోరుతున్నారు. -
స్మార్ట్ చీటింగ్!
నాగర్‌కర్నూల్ క్రైం : టెక్నాలజీ పెరిగే కొద్ది ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి వారి బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడం, ఆన్లైన్ ద్వారా ఫీజులు , రీఛార్జ్‌లు, టిక్కెట్లు బుక్ చేయడంతోపాటు ఇతర రకాల పేమెంట్లు చేస్తుంటారు. ఇలా ఆన్లైన్లో లావాదేవీలు జరిపేటప్పుడు లేదా బ్యాంకర్ల పేర్లతో ఫోన్‌చేసి వ్యక్తిగత డాటా సేకరించి వారి అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. గత నెలలో జరిగిన సంఘటనలు అక్టోబర్ 23న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన చెన్న రమేష్ తన స్మార్ట్ ఫోన్లో మిత్రుడికి తేజ్ యాప్ ద్వారా రూ.10వేల నగదు పంపాడు. కానీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కాలేదు. దీంతో గూగుల్‌లోని తేజ్ యాప్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు చెప్పినట్లుగా మరో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అడిగిన వివరాలు నమోదు చేశాడు. కాసేపటికి చెన్న రమేష్ అకౌంట్లో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ూ అక్టోబర్ 10న నల్లవెల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డికి ఎస్బీఐ బ్యాంకు నుంచి అంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ఏటీఎం కార్డు గడువు ముగిసిందని (ఎక్స్పైరీ) చెప్పారు. పాతకార్డు బ్లాక్‌చేసి కొత్తకార్డు పంపడానికి వివరాలు అడిగారు. ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఖాతాలో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతడు ఈనెల 23న స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాల్స్, మేసేజ్‌లతో జాగ్రత్త వినియోగదారులకు బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని, అకౌంట్ వివరాలు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల వివరాలు తెలియజేయాలని అడుగుతుంటారు. అలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సంబందిత బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. కొన్నిసార్లు బహుమతులు గెలుచుకున్నారని ఫోన్లు, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలి. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు ఏదైనా ఫోన్నంబర్ల నుంచి ఇతరులు ఫోన్లు చేసి ఖాతానంబర్లు, వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు వారికి వ్యక్తిగత వివరాలు తెలుపవద్దు. ఒకవేళ వివరాలు తెలియజేస్తే అకౌంట్లో ఉన్న నగదు ఖాజేసే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వెబ్సైట్లలో ఫైల్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. తెలియని అనుమానాస్పద సైట్ల నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత కంప్యూటర్లో సమస్యలు వస్తాయి. వెబ్సైట్లలో నుంచి పాటలు, వీడియోలు, డౌన్లోడ్ చేయడం వల్ల అందులో ఉన్న సాఫ్ట్వేర్, మాల్వేర్ కంప్యూటర్లలో ఉన్న డాటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. వెబ్సైట్లలో నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్స్‌ను యాన్టీవైరస్ ద్వారా స్కాన్ చేసుకోవాలి. పాస్వర్డ్ మార్చాలి ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే నెట్‌బ్యాంకింగ్, ఏవైనా యాప్‌లకు సంబందించినవి, అకౌంట్లకు సంబందించిన వాటి పాస్వర్డ్లు తరుచూ మారుస్తూ ఉండాలి. అలాగే ప్రతిఒక అకౌంట్‌కు ఒకే పాస్వర్డ్ పెట్టుకోకూడదు. వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి వ్యక్తిగత వివరాలు, అకౌంట్ వివరాలు అడిగితే వారికి ఎలాంటి సమాచారం అందించవద్దు. ఫోన్‌కాల్‌కు సంబందించిన సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయాలి. – భగవంత్‌రెడ్డి, ఎస్ఐ, నాగర్‌కర్నూల్ -
మోసపోయి.. మోసం చేసి
సాక్షి, గుంటూరు: ఆన్లైన్లో యువతులను బుక్ చేసుకుని మోసపోయిన ఓ యువకుడు అదే ఫార్ములాను ప్రయోగించి 507 మందిని మోసం చేశాడు. వారి వద్ద నుంచి సుమారు రూ.21.28 లక్షలు కాజేశాడు. తాజాగా అతడి చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అతడి గుట్టు రట్టయింది. ఆన్లైన్లో అందమైన యువతుల ఫోటోలను ఉంచి, వారిని సరఫరా చేస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో యువతుల ఫోటోలను చూసి అక్కడ ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించి గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకడు ఆన్లైన్ ద్వారా రూ.17,500 వారికి బదిలీ చేశాడు. అనంతరం వారిక ఫోన్ చేయగా తన నంబరును బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తేలడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో బసచేసేందుకు యత్నించిన యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపన్నపల్లి గ్రామానికి చెందిన వీరం రెడ్డి సుమన్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఆన్లైన్లో యువతులను బుక్ చేసుకొని అక్కడ మోసపోయాడు. అదే విధానంలో తాను కూడా చేయవచ్చని ఆర్నెల్ల నుంచి అందమైన యువతుల ఫోటోలను పెట్టి ఇప్పటివరకు 507 మందిని మోసం చేసి లక్షల డబ్బును కాజేశానని అంగీకరించాడు. అతని వద్ద ఉన్న రూ.8 లక్షల నగదు, కారు, ల్యాప్‌ట్యాప్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు సౌమ్యలత, డి. ప్రసాద్, సీఐ వై. శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ భాగ్యరాజు పాల్గొన్నారు. -
ఆన్లైన్ టోకరా కేసులో మరో నైజీరియన్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ: విదేశీ లాటరీ వచ్చిందంటూ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపి, వివిధ చార్జీల పేరుతో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి నుంచి నగదు కాజేసిన ముఠాలో మరో నిందితుడిగా ఉన్న నైజీరియన్ యుహుమ్‌వాన్సెబో జెరెమీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇతడు కూడా కీలక పాత్ర పోషించినట్లు అదనపు డీజీ సీహెచ్ ద్వారక తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిఛెల్ అలియాస్ జెఫ్ మోర్గాన్, యుహుమ్‌వాన్సెబో జెరెమీ అలియాస్ ఒసా నాలుగేళ్ళ క్రితం స్టడీ వీసాపై భారత్‌కు వచ్చిన ఢిల్లీలో స్థిరపడ్డారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అనేక మంది సెల్ఫోన్లకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించారు. ఆన్లైన్ లాటరీ, అవార్డు, క్యాష్‌ప్రైజ్ తదితరాలు వచ్చాయంటూ ఎరవేస్తాడు. ఆకర్షితులై సంప్రదించి వారితో ఫోనులో మాట్లాడి ముగ్గులోకి దించుతారు. ఈ ముఠా ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి ఓ ఎస్సెమ్మెస్ పంపాడు. యూఎస్ సామ్సంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందని, నగదు కోసం తమను సంప్రదించాలని వీటిలో పేర్కొన్నాడు. దీనికి ఆకర్షితుడైన వ్యాపారి ముఠాతో ఫోను, ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా ముగ్గులోకి దించిన తరవాత నగదు రిలీజ్ కావడానికి ఆదాయపు పన్ను, నగదు మార్పిడి చార్జీలు, కస్టమ్స్ డ్యూటీ పేర్లు చెప్పి వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నాడు. దాదాపు మూడు నెలల పాటు ఎదురు చూసినా లాటరీ సొమ్ము రాకపోవడం, ఎబెగా మిఛెల్ స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించిన వ్యాపారి సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఎబెగా మిఛెల్ హర్యానాలోని గుర్గావ్లో ఉన్నాడని గుర్తించి జూన్ 25న అరెస్టు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, లాప్టాప్లను విశ్లేషించిన నేపథ్యంలో యుహుమ్‌వాన్సెబో జెరెమీ సైతం కీలక నిందితుడిగా తేలింది. దీంతో మరోసారి ఢిల్లీ వెళ్ళిన ప్రత్యేక బృందం మంగళవారం ఇతడిని పట్టుకుంది. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై గురువారం హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మిమోసపోవద్దని ఎస్పీ టాటా సూచించారు.