online movement
-
పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు. -
రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన..
తిరుపతి: ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజాస్వామ్యం అథఃపాతాళానికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంది. ఇందుకోసం ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా..’అని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్, స్పీకర్ల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యుడు మరో పార్టీలోకి వెళితే డిస్ క్వాలిఫై అవుతారని రాజ్యాంగం పదో షెడ్యూల్లో తెలియజేస్తున్నా, పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణలో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతూ పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రులుగా చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో చెడు సాంప్రదాయం వేళ్లూనుకుంటోందనీ, దీన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసమే సేవ్ డెమొక్రసీ పేరిట ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు, ప్రజాస్వామ్య వాదులు దీనికి మద్దతుగా నిలబడాలని కోరారు. భావి తరాలకు న్యాయం అందించేందుకు చేయూతనివ్వాలన్నారు. నిరంతరం «నీతి వాక్యాలు వల్లించే సీఎం చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లను గెలిపించుకుని మంత్రి పదవులు కట్టబెట్టాలన్నారు. నిజంగా ప్రజల్లో మద్దతుంటే, మీ పాలనను ప్రజలు సమర్థిస్తున్నారన్న నమ్మకం ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఆ నలుగురూ ఉన్న ఒక్క స్థానంలోనైనా గెలువ గలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఆలోచించాలని చెవిరెడ్డి కోరారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కేశవులు, మునీశ్వర్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ఎం. చంద్రమోహన్‌రెడ్డి, చిన్ని కూడా పాల్గొన్నారు.