open jail
-
జైల్లో ఉంటూ.. అరుదైన రికార్డు!
జైపూర్: జైలులో తండ్రితోపాటు కలిసి ఓపెన్ కారాగారంలో ఉంటూ ఓ కుర్రాడు ఐఐటీ సీటు సాధించాడు. జేఈఈ పరీక్ష పాసయ్యాడు. పూల్ చంద్ అనే వ్యక్తి ఓ నేరానికి సంబంధించి కోట ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైలులో కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉండటంతో తండ్రితోపాటే అక్కడ ఉండేందుకు అతడి కుమారుడు పీయూష్ మీనా సిద్ధమయ్యాడు. పేదరికమే ఈ పరిస్థితికి దారితీసింది. తండ్రి వారించినా వినకుండా జైలులోనే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు ఉండి వెలుతురు సరిగా రాని గదిలో ఉంటూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమై విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీ కింద 453వ ర్యాంక్ సాధించాడు. ఓపెన్ జైలులో కుటుంబసభ్యులను శిక్షను అనుభవించేవారితోపాటే ఉండనివ్వడంతోపాటు రోజూవారీ అవసరాల కోసం పనికి కూడా బయటకు వెళ్లి రావచ్చు. కాగా, తండ్రి పూల్ చంద్ కు ఇష్టం లేకపోయినా.. హాస్టల్, కోచింగ్ ఫీజులకు డబ్బు సరిపోకపోవడంతో పీయూష్ మీనా 2014 జులైలో జైలుకు వచ్చేశాడు. ఈ విషయంపై మాట్లాడిన మీనా తండ్రి బంధువులు, స్నేహితులు అందరిని సంప్రదించగా లక్ష రూపాయలు ఏర్పాటు అయ్యాయని కోచింగ్, హాస్టల్ ఫీజుకు రెండు లక్షలు అవసరమయ్యాయని తెలిపారు. ఎలాగైనా బిడ్డను చదివించుకోవాలని గతంలో ప్రభుత్వ టీచర్ అయిన తాను ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ గా ప్రయత్నిస్తే, నేరస్థుడిని కావడం మూలాన అవేమీ దొరకలేదని, దాంతో మెడికల్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసినట్లు వివరించారు. జేఈఈలో ర్యాంక్ సంపాదించడంపై మాట్లాడిన పీయూష్ మీనా.. మొదట్లో జైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పాడు. కచ్చితమైన నిబంధనలు ఉండటంతో పాటు రాత్రి 11గంటలకు లైట్లన్నీ ఆర్పివేస్తారని తెలిపాడు. జైలు గది మరీ చిన్నదిగా ఉండటంతో పాటు వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేది కాదని చెప్పాడు. తాను రోజూవారీ సిలబస్ ను పూర్తి చేయడానికి చదువుకునే సమయంలో తన తండ్రి బయట ఉండేవారని వివరించాడు. ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన పీయూష్ శిక్షాకాలం ముగిసిన తర్వాత తండ్రి బాగోగులు చూసుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. మొత్తం 12 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న పూల్ చంద్ ఇప్పటికి 10ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేశాడు. -
లాభాల బాటలో చర్లపల్లి ఓపెన్ జైలు
కుషాయిగూడ: ఆరు నెలల క్రితం అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ ఎయిర్‌జైలు) ప్రస్తుతం మిగులుతో నడుస్తోంది. ఈ జైలులో ఖైదీలు కూరగాయల సాగు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం చేపడుతూ ఆదాయం చూపుతున్నారు. కూరగాయలు, పాలు, చికెన్ వంటి ఉత్పత్తులను చర్లపల్లి కేంద్ర కారాగార ఖైదీలకు సరఫరా చేయడంతో పాటుగా మిగిలిన ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి విక్రయిస్తున్నారు. దీంతో పాటు చర్లపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ఆరు నెలల క్రితం ఇదే జైలు సుమారు రూ.12 లక్షల లోటుతో ఉంది. ఈ జైలు పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజేష్‌కుమార్ ఆదాయ పెంపుపై దృష్టి సారించి ఆమేరకు ఫలితాలు రాబట్టారు. పెట్రోలు బంక్ ద్వారా ఐదు లక్షలు, కూరగాయల ద్వారా రూ.1.5 లక్షలు, పాడి, పౌల్ట్రీ ఇతర రంగాల ద్వారా మరో రూ. 2.5 లక్షల ఆదాయం సమకూరుతోందని రాజేష్‌కుమార్ వెల్లడించారు. దీంతో ఆరు నెలల క్రితం 12 లక్షల అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు ప్రస్తుతం రూ.30 లక్షల మిగులులో ఉందన్నారు. ఇది ఖైదీల సమిష్టి కృషితోనే సాధ్యమయిందని తెలిపారు. -
మళ్లీ తెరపైకి ఓపెన్‌జైలు ప్రతిపాదన
న్యూఢిల్లీ: జైలు వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా బాప్రోలా ప్రాంతంలో ఓపెన్ జైలు నిర్మించాలన్న సుదీర్ఘకాల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఇందుకోసం బాప్రోలాలో స్థలాన్ని సేకరించాలని జైలుశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయిం చారు. ఓపెన్‌జైలు చుట్టూ గోడలు, కాపలా వంటి ఏ ఇతర అడ్డంకులూ ఉండవు. శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండి, సత్ప్రవర్తన కలిగిన వారిని ఓపెన్ జైలులో ఉండడానికి అనుమతిస్తారు. ఖైదీల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలసి పోవడానికి వీలుగా ఓపెన్‌జైలు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. నిజానికి 1996లోనే ఓపెన్ జైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే బాప్రోలాలో ల్యాండ్ మాఫియా ఆగడాల వల్ల జైళ్లశాఖకు భూమి కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు. ఓపెన్ జైలు నిర్మాణం వల్ల తీహార్ జైలుపైనా భారం తగ్గుతుంది. కేవలం ఆరువేల మందికి వసతి కల్పించగల తీహార్ జైలులో ప్రస్తుతం 10 వేల మందిని ఉంచుతున్నారు. దీనిపై భారం తగ్గించడానికి కొత్తగా తొమ్మిది జైళ్లు నిర్మిస్తున్నామని, రోహిణి జైలులో అదనంగా మూడు భవనాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఒక అధికారి చెప్పారు. దీనికితోడు మండోలీ జైలు భవన సముదాయంలోనూ కొత్తగా ఆరు జైళ్లు నిర్మిస్తున్నారు. ఇందుకోసం డీడీఏ నుంచి 78.62 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. వీటి నిర్మాణం కూడా డిసెంబర్లో పూర్తికానుంది. దాదాపు 3,700 మంది ఖైదీలకు ఈ కొత్త భవనాల్లో వసతి కల్పించవచ్చు. టిక్రిఖుర్ద్ గ్రామంలోనూ మరో జైలు నిర్మాణానికి ప్రభుత్వం భూమిని సేకరించింది. అవసరమైన అనుమతులు వచ్చాక నిర్మాణాన్ని ప్రారంభిస్తామని జైళ్లశాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాస్తవకు వివరించారు. జైళ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించాలని ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలను ఈ సందర్భంగా ఆదేశించారు. -
మళ్లీ తెరపైకి ఓపెన్ జైలు ప్రతిపాదన
న్యూఢిల్లీ: జైలు వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా బాప్రోలా ప్రాంతంలో ఓపెన్ జైలు నిర్మించాలన్న సుదీర్ఘకాల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇటీవల నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఇందుకోసం బాప్రోలాలో స్థలాన్ని సేకరించాలని జైలుశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఓపెన్‌జైలు చుట్టూ గోడలు, కాపలా వంటి ఏ ఇతర అడ్డంకులూ ఉండవు. శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండి, సత్ప్రవర్తన కలిగిన వారిని ఓపెన్ జైలులో ఉండడానికి అనుమతిస్తారు. ఖైదీల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలసి పోవడానికి వీలుగా ఓపెన్‌జైలు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. నిజానికి 1996లోనే ఓపెన్ జైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే బాప్రోలాలో ల్యాండ్ మాఫియా ఆగడాల వల్ల జైళ్లశాఖకు భూమి కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు. ఓపెన్ జైలు నిర్మాణం వల్ల తీహార్ జైలుపైనా భారం తగ్గుతుంది. కేవలం ఆరువేల మందికి వసతి కల్పించగల తీహార్ జైలులో ప్రస్తుతం 10 వేల మందిని ఉంచుతున్నారు. దీనిపై భారం తగ్గించడానికి కొత్తగా తొమ్మిది జైళ్లు నిర్మిస్తున్నామని, రోహిణి జైలులో అదనంగా మూడు భవనాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఒక అధికారి చెప్పారు.