Optimism
-
ఈసారి రూ. 4.7 లక్షల కోట్ల వ్యాపారం..
న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు. -
భారత్‌పై ఆశావహంగా విదేశీ ఇన్వెస్టర్లు
ముంబై: భారత్‌పై అమెరికా, యూరప్‌లోని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది. చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్ ఎఫ్‌పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ వివరించింది. -
ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?
ఆశావాదం మంచిదే కాని అతి ఆశావాదంతోనే సమస్య. అతి ఆశావాదం వాస్తవాలను చూడనివ్వదు. భ్రమజనిత ప్రపంచంలో పెడుతుంది. ఏదైనా ఐడియా లేదా ప్లాన్‌లో వాస్తవం తక్కువై, ఆశావాదం మరీ ఎక్కువైంది అనుకోండి ‘ఉత్త ప్యాంగసియన్ ఐడియా’ అంటారు. అతి ఆశావాదులను ‘ప్యాంగసియన్’ అంటారు. ఇంతకీ ఎవరు ఇతను? ఫ్రెంచ్ ఫిలాసఫర్, రైటర్, హిస్టారియన్ వొల్టేర్ 1759 లో ‘కాండీడ్’ అనే నవల రాశాడు. అనేక దేశాల్లో ఈ పుస్తకం నిషేధానికి గురైంది. ఆ కాలంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేరుగాంచింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది) ఈ నవలలో ‘ప్యాంగ్లాస్’ అనే తత్వవేత్త అతిఆశావాది. నెత్తి మీద బండ పడినా, కొండ పడలేదు కదా! అని సర్దుకుపోయే తత్వం. తన అతి ఆశావాదాన్ని నెగ్గించుకోవడానికి వాస్తవాలతో సంబంధం లేని ఎన్ని వాదనలైనా చేస్తాడు. చివరికి తాను బిచ్చమెత్తుకునే విషాదపరిస్థితి వచ్చినప్పటికీ తన ఆతిఆశావాదాన్ని మాత్రం వదలడు! తన కంటే సీనియర్ అయిన ఒక జర్మన్ తత్వవేత్తను దృష్టిలో పెట్టుకొని వొల్టేర్ సెటైరికల్‌గా ఈ పాత్రను సృష్టించాడు. (చదవండి: లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ.. అదే ఆమె మంత్రం!) -
2018; మాకు అత్యంత సానుకూలం.. !
కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కేలండర్లో సంవత్సరం, తేదీలు, వారాలు మారటమే కాదు.. గత కాలపు చేదు స్మృతులు, అనుభవాలను తొలగిస్తుందనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే సందర్భం. ఏంటీ 2018లోకి ప్రవేశించి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం కదా.. మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకని ఆలోచిస్తున్నారా.. అదేనండీ మీలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం గురించి ఎంతమంది, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సాసిస్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలేమిటో ఓ సారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో సర్వే నిర్వహించగా మొత్తంగా 76 శాతం మంది ప్రజలు 2017తో పోలిస్తే ఈ ఏడాది తమకు సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో ముఖ్యంగా యువత 2018ని అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొన్నారు. లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలో 93శాతం మంది సానుకూలంగా స్పందించారు. 88శాతం మంది చైనీయులు 2018కే ఓటు వేశారు. ఇక మన దేశంలో 87శాతం మంది 2018 పట్ల ఆశావహంగానే ఉన్నారు. అమెరికన్లకు గతేడాది అధ్యక్ష ఎన్నికలతో ఎంతో నాటకీయంగా గడిచిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల చాలామంది బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. 80శాతం మంది అమెరికన్లు కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక యూరప్ దేశాల విషయానికొస్తే... జర్మనీలో 67శాతం, బ్రిటన్‌లో 67శాతం, ఫ్రాన్స్‌లో కేవలం 55శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఈ సర్వేలో 44శాతం మందితో జపాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. -
ఆశావాదం బతికిస్తుంది!
ఆత్మీయం ఇద్దరు ౖఖదీలు జైలు ఊచలనుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆశావాదిగా ఉండాలి. మొదట్లో అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే..నీవాయిస్ అంత సూట్‌కాదు అని చెప్పి పంపించేశారు. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే..నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వాళ్లేమన్నా నిరాశావాదానికి గురయ్యారా? లేదే! అదే అమితాబ్ బచ్చన్ ఈవేళ ప్రపంచ ప్రఖ్యాత నటుడయ్యాడు. ఆయన కంఠాన్ని ప్రత్యేక కంఠమని దేశం ఆరాధిస్తోంది. ఈవేళ ఎవరి కంఠం వినబడితే మనందరం కళ్ళు మూసుకుని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు జీవితంలో పొందిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఎంత ఉన్నతశిఖరాలకు ఎదిగినా, తన మూలాలను, తొలినాటి దుర్భరమైన పరిస్థితులను చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. సగం నిండిన గ్లాసును చూపించి ఇదేమిటి అనడిగితే ఆశావాది అయితే, దానిలో సగం వరకు నిండా ఉంది అంటాడు. అదే నిరాశావాది అయితే, సగం ఖాళీగా ఉంది అంటాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు కుంగిపోకూడదు. నిరాదరణ వల్ల నిరాశపడి నీరసించకూడదు. అందులోనే అవకాశాలను వెదుక్కోవాలి. గొప్పవారి విజయ గాథలు అందుకే చదవాలి. వాటినుంచి స్ఫూర్తి పొందాలి.