orange travels bus
-
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
-
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
కర్నాటకలోని కల్బూర్గిలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్లో వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది. దీంతో, అదుపు తప్పిన బస్సు జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొని కిందకు పడిపోయింది. ఈ ధాటికి వాహనం డీజిల్ ట్యాంక్ పగిలిపోగా... బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా.. మరో 13 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు.. బాధితులు, కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్, స్థానిక బంధువుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాగా, ప్రమాదం చనిపోయిన వారి మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు మృతదేహాలను తరలించారు. ఇక, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అల్వాల్ బంజారా కాలనీకి చెందిన అర్జున్ కుమార్ 36, అతని భార్య సరళాదేవి 34, కుమారుడు వివాన్3, మేనత్త అనిత 58. గోలికబర్‌కు చెందిన రవళి 30, భర్త శివకుమార్ 35, పెద్ద కుమారుడు ధీక్షిత్ 11 ఉన్నారు. ఇక, అర్జున్ సోదరుడు అమెరికా నుండి వచ్చేంతవరకు మృతదేహాలు ఆసుపత్రిలోనే ఉండనున్నాయి. ఇది కూడా చదవండి: విహారయాత్ర విషాదాంతం -
ట్రావెల్స్ బస్సు దగ్ధం
పర్చూరు: అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలొచ్చి ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు–చిలకలూరిపేట ఆర్ అండ్ బీ రోడ్డుపై.. పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గురువారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌లోని పఠాన్‌చెరువు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 11 మందిని, చిలకలూరిపేటలో ఒకరిని దించింది. పర్చూరు, చీరాల మీదుగా గుంటూరు జిల్లా బాపట్లకు బస్సు వెళ్లాల్సి ఉంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వచ్చేసరికి గేర్ రాడ్డు పక్క నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి అందులో ఉన్న మిగిలిన 8 మంది ప్రయాణికులను కిందికి దించాడు. అంతలోనే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులతో పాటు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరెడ్డి తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారి చెప్పారు. చదవండి: ఒమిక్రాన్ గుట్టు ‘గాంధీ’లో తేలుస్తారు -
కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీకొడుకు సహా కారు డ్రైవర్ ఉన్నారు. వీరంతా నందలూరు మండలం నీలిపల్లె గ్రామస్తులు. కడప నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు దాసరి మణెమ్మ (45), సాయి కిరణ్, (19), పవన్ కల్యాణ్ (25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. డివైడర్‌ను ఢీకొన్న ఆరెంట్ ట్రావెల్స్ బస్ కాగా విజయవాడ గుణదల సమీపంలో ఆరెంట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోల్తా పడిన బస్సును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకి తొలగించారు. గాయపడిన ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కంటైనర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి మరోవైపు తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందినవారు. వీరంతా హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా..డ్రైవర్‌కు గాయాలు
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌కు మాత్రం గాయాలు అయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌ను ఢీ కొట్టి ఆగకుండా ఈడ్చుకెళ్లిన బస్సు
-
ఐదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది
నల్లగొండ జిల్లా : మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తోన్న బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం బైక్‌ను సుమారు 5 కిలో మీటర్ల దూరం బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బనావత్ రూపల్ల(37) బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో భయపడిపోయిన బస్‌డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు
కృష్ణా జిల్లా : కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు అంటుకున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముంబాయి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును నిలిపివేసి అక్కడ ఉన్న సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా స్థానిక ఎమ్మార్వో పద్మజ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాపిడి వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. -
గాఢ నిద్రలోనే శాశ్వత నిద్ర
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కునికి పాటు ముగ్గురి ప్రయాణికులు గాఢ నిద్రలో నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. బస్సు స్లీపర్ బెర్త్‌లో నుంచి నడిరోడ్డుపై శవాలుగా మిగిలారు. కావలి సమీపంలో గురువారం తెల్లవా రు జామున ప్రైవేట్ ట్రావెల్స్ సృష్టించి మరణ మృదంగం మూడు కుటుం బాల్లో తెల్లారకుండానే తీరని విషాదా న్ని మిగిల్చింది. పోలీసులు, రవాణాశాఖాధికారులు సమాచారం మేరకు.. అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఆరెంజ్ ట్రావ్సెల్కు చెందిన వొల్వొ ఏసీ స్లీపర్ బస్సు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరింది. ఈ బస్సు గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంది. 34 స్లీపర్ బెర్త్‌లు కలిగిన బస్సులో ఒక సీటును ప్రయాణికుడు రద్దు చేసుకున్నాడు. 33 మందితో బస్సు బెంగళూరుకు వెళ్తూ గురువారం తెల్లవారు జూమున 2 గంటలకు కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్దకు వచ్చే సరికి ఫ్లైఓవర్ వంతెన ఎక్కే సమయంలో ప్రమాదానికి గురైంది. తాడేపల్లిగూడెం నుంచి రొయ్యల మేతలో కలిపేందుకు వాడే పామాయిల్ వేస్ట్ పౌడర్ లోడుతో తమిళనాడులోని నమక్కల్‌కు వెళ్తున్న లారీ బ్రిడ్జి ఎక్కే సమయంలో బస్సు లారీ వెనుక భాగంలో ఢీకొంది. బస్సులో ఎడమ వైపున లోయర్ స్లీపర్ బెర్త్–1, అప్పర్ స్లీపర్ బెర్త్–1, దాని వెనుకనే ఉన్న లోయర్ స్లీపర్ బెర్త్–4 ల్లో నిద్రపోతున్న విశాఖపట్నంకు చెందిన సామవేదం సూర్యకుమారి (65), విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్ (20), రాజమండ్రికి చెందిన ముమ్మడివరం పట్టాభి రామదాసు (57) దుర్మరణం పాలై రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డారు. మృతదేహాలను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కావలిరూరల్ సీఐ టి అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఎస్సై జి.పుల్లారావు, ఏఎస్ఐలు సీహెచ్ తిరుమలరెడ్డి, దాసుతో పాటు ఇతర సిబ్బంది బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించారు. కావలిరూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొనకుంటే.. ఘటనా స్థలాన్ని చూస్తే పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు, పోలీసులు, రవాణా శాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ కునుకు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనకుండా ఉంటే వంతెన గోడ ఢీకొని ఆ వేగంలో పైనుంచి కింద పడేదని, అలా కాకుండా మరో చోట అయినా పెను ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్ వెంపల గిరీష్‌కుమార్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. విజయవాడుకు చెందిన గిరీష్‌కుమార్ రెండు నెలలు క్రితమే ఆరెంజ్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు మరో డ్రైవర్ బస్సును నడిపాడు. విజయవాడ నుంచి గిరీష్‌కుమార్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది జనవరిలో ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్తూ చిత్తూరు వద్ద ప్రమాదానికి గురై ముగ్గురు చనిపోయారు. ఇప్పడు అదే ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్తూ ప్రమాదానికి గురై మృతికి కారణమైంది. జనవరి నెల ఆరెంజ్ ట్రావెల్స్‌కు అచ్చిరాలేదని బస్సు సిబ్బంది అభిప్రాయపడ్డారు. ‘ఉదయాన్నే బస్సు దిగి కాల్ చేస్తా’ ఈ ప్రమాదంలో మృతి చెందిన తాడినాడ ప్రణీత్ (20) విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్సీ బ్రాంచ్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రణీత్ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బస్సు ఎక్కి విజయవాడ పటమట ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రామకృష్ణకు ఫోన్‌చేసి ‘డాడీ ఇప్పుడే బస్సు ఎక్కాను. ఉదయాన్నే తిరుపతిలో బస్సు దిగి కాల్ చేస్తాను’ చెప్పాడు. బస్సు దిగకుండానే ఆ తండ్రికి కుమారుడి మరణ వార్త చేరింది. రామకృష్ణ, ఆయన సతీమణి కావలి ప్రభుత్వ ఏరియా వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మాకు దూరం కావడానికే బెర్త్ మారలేదు.. బస్సులో ఎడమ వైపు లోయర్ స్లీపర్ బెర్త్–1లో ఉన్న ప్రణీత్‌ను క్లీనర్ మరొక ప్రయాణికుడు ఆ బెర్త్‌లో నిద్రపోతారని, కుడి వైపున ఉన్న అప్పర్–5 లోకి మారాలని నచ్చచెప్పాడు. ఎప్పుడూ ఎవరో ఒకరికి తన బెర్త్‌ను ఇచ్చే ప్రణీత్ ఈ సారి మాత్రం తాను మరో బెర్త్‌కు మారనని చెప్పాడు. బెర్త్ మారి ఉంటే ప్రణీత్ ప్రాణాలతో ఉండేవాడు. ఇదే విషయాన్ని తండ్రి రామకృష్ణ చెబుతూ ఎప్పడూ తన సీటును బామ్మకు ఇచ్చి వేరే సీటుకు మారానని, తాతకు ఇచ్చి మారానని, ఆంటీకి ఇచ్చి సీటు మారానని చెప్పే నా బిడ్డ ఈ సారి మాత్రం మా నుంచి దూరం కావడానికే సీటు మారననని మొండికేశాడని కన్నీటిపర్యంతమైయ్యాడు. తిరుపతిలోఎస్వీ యూనివర్సిటీలో జరిగే కాన్ఫరెన్స్‌కు తన కుమారుడితోపాటు మరో ఇద్దరు గీతం విద్యార్థులు ఎంపిక కావడంతో, అందులో పాల్గొనేందుకు విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలుదేరి తమ నుంచి శాశ్వతంగా దూరం అయ్యాడని ప్రణీత్ తల్లిదండ్రులు గుండలవిసేలా రోదించారు. నాగూర్ నాగపట్నం సందర్శిద్దామని.. సామవేదం సూర్యకుమారి (65) సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మరదలు. ఆమె విశాఖపట్నంలో ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చారు. అక్కడున్నుంచి సోదరి, ఆమె మనవడుతో కలిసి రాత్రి 9 గంటలకు ఏలూరులో బస్సు ఎక్కారు. బెంగళూరులో బంధువులు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం తమిళనాడులోని నాగూర్నాగపట్నంను సందర్శించాలని బయలదేరారు. కావలి వద్ద జరిగిన ప్రయాదంలో సూర్యకుమారి మృతి చెందడటంతో ఆమె సోదరి ధీనంగా విలపించింది. భార్య, కొడుకు వద్దకు వెళ్తూ.. ప్రమాదంలో మృతి చెంది న ముమ్మడివరం పట్టాభి రామదాసు (57)ది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. అదే జిల్లాలోని కొత్తపేట డివిజన్ పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొడుకు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటుండటంతో అతని భార్య కూడా అక్కడే ఉంటుంది. వారిని చూడటానికి రాజమండ్రిలో బస్సు ఎక్కిన రామదాసు గమ్యం చేరకుండానే, భార్య, బిడ్డను చూడకుండానే అంతర్థమయ్యారు. -
ఆరెంజ్ ట్రావెల్స్‌పై పోలీసుల కక్ష సాధింపు
విజయవాడ: ఆరెంజ్ ట్రావెల్స్‌పై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ట్రావెల్స్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఏడాది మార్చి 17న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో పోలీసులు ఆ బస్సును తమ ఆధీనంలో పెట్టుకున్నారు. రిలీజ్ చేయాలని కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతర్ చేశారు. బస్సును రిలీజ్ చేయొద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని పోలీసులు పేర్కొనటం గమనార్హం. దీంతో పటమట పోలీస్ స్టేషన్ ఎదుట ఇవాళ ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బంది నిరసన చేపట్టారు. గతంలో ఇదే బస్సు వివాదంలో ఎంపీ కేశినేని నాని తలదూర్చారు. ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చారు. అంతేకాకుండా అధికారులు తమ మాట వినకపోవడంతో కేశినేని నాని, బోండా ఉమ...దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
బాలానగర్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం
హైదరాబాద్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి హైదరాబాద్ బాలానగర్‌లో దగ్ధమైంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సుచిత్ర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఇది బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న సమయంలో ఏసీ ప్లోనర్ జామ్ అయింది. ఫలితంగా స్వల్పంగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ విజయ్‌కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును రోడ్డు పక్కకు తీసి ఆపేశారు. ప్రయాణికుల్ని కిందకు దింపేసిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంట పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.