కర్నాటకలోని కల్బూర్గిలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది.
దీంతో, అదుపు తప్పిన బస్సు జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొని కిందకు పడిపోయింది. ఈ ధాటికి వాహనం డీజిల్ ట్యాంక్ పగిలిపోగా... బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా.. మరో 13 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు.. బాధితులు, కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్, స్థానిక బంధువుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
కాగా, ప్రమాదం చనిపోయిన వారి మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు మృతదేహాలను తరలించారు. ఇక, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అల్వాల్ బంజారా కాలనీకి చెందిన అర్జున్ కుమార్ 36, అతని భార్య సరళాదేవి 34, కుమారుడు వివాన్3, మేనత్త అనిత 58. గోలికబర్‌కు చెందిన రవళి 30, భర్త శివకుమార్ 35, పెద్ద కుమారుడు ధీక్షిత్ 11 ఉన్నారు. ఇక, అర్జున్ సోదరుడు అమెరికా నుండి వచ్చేంతవరకు మృతదేహాలు ఆసుపత్రిలోనే ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: విహారయాత్ర విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment