ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై పోలీసుల కక్ష సాధింపు | Orange travels employees protest in front of patamala police station | Sakshi
Sakshi News home page

ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై పోలీసుల కక్ష సాధింపు

May 16 2017 1:57 PM | Updated on Aug 21 2018 5:51 PM

ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది ఆందోళనకు దిగారు.

విజయవాడ: ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ట్రావెల్స్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఏడాది మార్చి 17న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో పోలీసులు ఆ బస్సును తమ ఆధీనంలో పెట్టుకున్నారు. రిలీజ్‌ చేయాలని కోర్టు ఉ‍త్తర్వులను కూడా బేఖాతర్‌ చేశారు. బస్సును రిలీజ్‌ చేయొద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని పోలీసులు పేర్కొనటం గమనార్హం.

దీంతో పటమట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఇవాళ ఆరెంజ్‌ ట్రావెల్స్‌ సిబ్బంది నిరసన చేపట్టారు. గతంలో ఇదే బస్సు వివాదంలో ఎంపీ కేశినేని నాని తలదూర్చారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చారు. అంతేకాకుండా అధికారులు తమ మాట వినకపోవడంతో కేశినేని నాని, బోండా ఉమ...దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement