orders release
-
AP: దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చదవండి: AP: 31న కేబినెట్ భేటీ -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
ఆంధ్రలో అర్బన్ మండలాల విభజన
అమరావతి: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని అర్బన్ మండలాలను విభజించి కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు కొత్త మండలాలుగా విభజించింది. అవి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ ఉత్తరం, విజయవాడ మధ్య మండలాలుగా ఉంటాయి. గుంటూరు మండలాన్ని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్‌గా విభజించింది. ఇక కర్నూలు మండలాన్ని విభజించి కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విశాఖ అర్బన్, రూరల్ మండలాలను ఐదు కొత్త మండలాలుగా విభజించింది. -
పలువురు సీఐలకు బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ కాకినాడ క్రైం: ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీఐలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ పేరు ప్రస్తుతం బదిలీ జరిగిన పనిచేస్తున్న ప్రాంతం ప్రాంతం పి.మురళీకృష్ణారెడ్డి ఒ¯ŒSటౌ¯ŒS సీసీఎస్, వీఆర్, కాకినాడ సీసీఎస్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS పోలీస్ జిల్లా జె.జోగేశ్వరరావు ఎటాచ్డ్ పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్, కాకినాడ అద్ధంకి శ్రీనివాసరావు వీఆర్, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ జి.సత్యనారాయణ ప్రత్తిపాడు వీఆర్, పశ్చిమ గోదావరి జిల్లా బి.పెద్దిరాజు వీఆర్, కృష్ణాజిల్లా రావులపాలెం సర్కిల్, తూర్పుగోదావరి జిల్లా పాల వెంకటరమణ రావులపాలెం సీఐ డీఎస్బీ, కాకినాడ వి.శ్రీనివాస్ డీఎస్బీ, కాకినాడ తుని టౌ¯ŒS సర్కిల్ బి.అప్పారావు తుని టౌ¯ŒS పిఠాపురం సర్కిల్ ఎండీ ఉమర్ పిఠాపురం టౌ¯ŒS టూటౌన్, లా అండ్ ఆర్డర్ పీఎస్, కాకినాడ కనుమళ్ల వెంకటేశ్వరరావు వీఆర్, రాజమహేంద్రవరం విజయవాడ సిటీ -
బాలుడి హత్య కేసులో నలుగురిపై సస్పెన్షన్ వేటు
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ప్రభుత్వ బాలుర గహంలో ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున ముస్తఫా అనే బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనకు సంబంధించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ బాలుర గృహాల విభాగం రాష్ట్ర డైరెక్టర్ శారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆమె బాలుర గృహాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ అన్నాజీ, డిప్యూటీ సూపరింటెండెంట్ సుదర్శన్‌రెడ్డి, సూపర్వైజర్లు, సిబ్బందిని విడివిడిగా విచారించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న హెడ్ సూపర్వైజర్, మరో ముగ్గురు సూపర్వైజర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన ప్రభుత్వ బాలుర గృహంలోని పరిశీలన గదిలో ఉన్న ఓ బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. ముస్తఫా అనే బాలుడిని అదే గదిలో ఉన్న మరో బాలుడు మహబూబ్‌బాషా గొంతు చుట్టూ టవల్ బిగించి హత్య చేశాడని, అంతకుముందు రోజు ఉదయం నుంచి వారి మధ్య వాగ్వాదంతోపాటు ఘర్షణ జరిగిందనే విషయాన్ని పరిశీలనలో ఉన్న సూపర్వైజర్లు తెలుసుకోలేక పోయారన్నారు. వారు తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటనజరిగి ఉండేది కాదన్నారు. దీనికి బాధ్యతగా హెడ్ సూపర్వైజర్ సుబ్రమణ్యం, విధుల్లో ఉన్న సూపర్వైజర్ పురుషోత్తంరెడ్డి, బలరామరాజు, వరప్రకాశ్లను సస్పెండ్ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశీలన గృహంలో బాలురను చూసుకునే సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. కడప ప్రభుత్వ బాలుర గృహంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దాదాపు 25 నుంచి 28 సంవత్సరాల నుంచి విధుల్లో అనుభవం కలిగిన వారేనన్నారు. అలాంటి పరిస్థితిలో ఈ సంఘటన జరగడం ముమ్మాటికీ సిబ్బంది నిర్లక్ష్యమేనని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర గృహం జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.