అమరావతి: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని అర్బన్ మండలాలను విభజించి కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు కొత్త మండలాలుగా విభజించింది. అవి విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ ఉత్తరం, విజయవాడ మధ్య మండలాలుగా ఉంటాయి. గుంటూరు మండలాన్ని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్‌గా విభజించింది. ఇక కర్నూలు మండలాన్ని విభజించి కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విశాఖ అర్బన్, రూరల్ మండలాలను ఐదు కొత్త మండలాలుగా విభజించింది.
Comments
Please login to add a commentAdd a comment