ordinance factory
-
దేశీ గన్లతో డ్రాగన్‌పై గురి
సాక్షి, న్యూఢిల్లీ : కార్బైన్ (లాంగ్ గన్స్)లను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వినియోగానికి మేడిన్ ఇండియా కార్బైన్లను సమీకరించాలని రక్షణ బలగాలు యోచిస్తున్నాయి. ప్రత్యర్ధులతో నేరుగా తలపడే సమయంలో పదాతిదళాలు వాడే తేలికపాటి పొడవైన గన్లను కార్భైన్లుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ఆయుధాల సేకరణ కోసం భారత సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపోర్ కేంద్రంలో తయారైన కార్బైన్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ రక్షణ బలగాలకు అప్పగించగా వీటి కొనుగోలుకు సాయుధ బలగాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల కోసం ఈ ఆయుధాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే ఈ ఆయుధాలపై ప్రాథమికంగా పరీక్షించినట్టు తెలిసింది. ఈ ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు కొద్ది దేశాలకే అదీ తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న క్రమంలో దేశీయ కార్బైన్ కొనుగోలుకు సాయుధ బలగాలు మొగ్గుచూపాయి. విదేశాల నుంచి కార్భైన్ల కొనుగోలు ప్రతిపాదన రెండేళ్లుగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నియమించిన ఉన్నతస్ధాయి కమిటీ పరిశీలనలో ఉండటం కూడా వీటి సమీకరణలో జాప్యానికి కారణమవుతోంది. సాయుధ బలగాలకు 3.5 లక్షల కార్బైన్స్ అవసురం కాగా, ఫాస్ట్‌ట్రాక్ మార్గంలో 94,000 ఆయుధాలనే దిగుమతి చేసుకోనున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్బైన్‌ను సాయుధ బలగాలు ఎంపిక చేస్తే వీటిని కఠినంగా పరీక్షించి తొలుత పరిమిత సంఖ్యలోనే రక్షణ బలగాలకు అందచేస్తారు. చదవండి : ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను
నిజామాబాద్ నాగారం : నిజామాబాద్ డివిజన్ సర్కిల్ పరిధి సంగారెడ్డి జిల్లా యెద్దు మైలారం గ్రామంలో గల ఆర్డినెన్సు ఫ్యాక్టరీ నుంచి 123 కోట్ల 70 లక్షల 64వేల 553 పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ ఇంటిలిజెన్సు అసిస్టెంట్ కమీషనర్ లక్ష్మయ్య తెలిపారు. దేశ రక్షణకు యుద్ధ ట్యాంకులు తయారు చేసి సరఫరా చేస్తున్న ఆర్డినెన్స్ కంపెనీ పన్నులు చెల్లించకపోవడంతో ఇంటిలిజెన్స్ బృందం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సుమారు 49 ఆర్డినెన్సు కంపెనీలు ఉన్నాయని, ఎక్కడ కూడా ఈ కంపెనీలు పన్నులు చెల్లించ లేదన్నారు. నిజామాబాద్ డివిజన్లో ఇదే మొదటి సారన్నారు. వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు మదింపు చేసి టాక్స్‌లు వసూలు చేస్తుంటామన్నారు. యెద్దు మైలారంలోని ఆర్డినెన్స్ కంపెనీ గతంలో కేవలం కొన్ని వ్యాపార లావాదేవీలపైన మాత్రమే పన్ను చెల్లించేందన్నారు. ముఖ్యంగా కంపెనీ తయారు చేసి దేశరక్షణకు సరఫరా చేస్తున్న యుద్ధ ట్యాంకర్ వాహనాలపైన మినహాయింపులు పొందుతూ టాక్స్ చెల్లించడం లేదని ఇంటలి జెన్స్ బృందం పరిశీలనలో తేలిందన్నారు. ఆ ట్యాంకర్ల సరఫరాపై పన్నులు విధించినట్లు తెలిపారు. మొదటి విడత రూ. మార్చి 17న రూ. 25 కోట్ల 85 లక్షల 34 వేల 185 వసూలు చేసినట్లు తెలిపారు. రెండవ విడతలో సెప్టెంబర్ 29న రూ.42 కోట్ల 55 లక్షల 11వేల 235 వసూలు చేశామన్నారు. శుక్రవారం నాడు రూ. 55 కోట్ల 35 లక్షల 19వేల 133 వసూలు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 123 కోట్ల 70 లక్షల 64వేల 553 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తెలిపారు. కేవలం ఆడిట్ ద్వారా పన్నులు అత్యధికంగా వసూలు చేసిన ఘనత నిజామాబాద్ వాణిణ్య పన్నుల శాఖ డివిజన్‌కు దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వ్యాపార సంస్థ ద్వారా పన్నులు వసూలు చేయడం ఇంటిలిజెన్స్ వింగ్ ద్వారానే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా వివిధ వ్యాపార సంస్థలు తమ అమ్మకాలపై రాష్ట్రంలో వ్యాట్, సీఎస్టీ ట్యాక్సులు వసూలు చేస్తాయన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 8 లార్జ్ యూనిట్ సర్కిల్లు ఉన్నాయని, వీటిలో అధిక పన్నులు చెల్లించే 41 మంది డీలర్లు అయిన ప్రముఖ వ్యాపార సంస్థలు ఎంఆర్ఎఫ్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తదితర కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ జి లావణ్య, గతంలో ఉన్న డీసీ శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇది సాధించామన్నారు. సమావేశంలో ఏసీటీఓలు జి గంగాధర్, పోతనకర్ లక్ష్మీనారాయణ, ఎస్ జయంత్నాద్, ఆధిత్యకుమార్, జూనియర్అసిస్టెంట్ బి భారతి, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పల్లంరాజు అన్నారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో శని వారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పోటీతత్వం, సృజనాత్మకంగా ఆలోచించ గలిగే మానవ వనరులు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక అంశాలపై అధ్యాపకులకు మంచి పట్టు ఉన్నప్పుడే బోధనలో నాణ్యత ఉంటుందన్నారు. సాంకేతిక పరంగా పురోగమిస్తున్నందున అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిందిగా పల్లం రాజు సూచించారు. నూతన పరిశోధనలు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని మానవ వనరుల అభివృద్ధి మంత్రి త్వ శాఖ అదనపు కార్యదర్శి అనిత వెల్లడిం చారు. ఈ సదస్సులో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్కే నంది, ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ పాల్గొన్నారు.