'నేను నటుడిని కాదయ్యా బాబు..'
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వర్థమాన నటుడు షఫీని పోలిన ఓ వ్యక్తి ఘాట్ వద్ద కనిపించాడు. దీంతో భక్తులంతా ఆయన సినీ నటుడనుకుని ఆసక్తిగా పలకరించారు. చివరకు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లి ఫొటోలు తీశారు. ఇంతలో కొందరు ఆయన్ని పలకరిస్తూ ‘ఖడ్గం, ఛత్రపతి’ సినీమాలలో మీరు నటించారు కదా? అని ప్రశ్నించగా ఆయన బదులిస్తూ ‘నటుడిని కాదయ్యా బాబు, సీఎం చంద్రబాబుకి ఓఎస్డీని. నా పేరు వెంకయ్యచౌదరి’ అంటూ వెళ్లిపోయారు.