our right
-
‘సమాచారం’ మన హక్కు
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పథకాల అమలు, మంజురైన నిధులు, చేసిన పనులు తదితర వివరాల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. అయితే, తాము కోరిన సమాచారం పొందేందుకు ఓ చట్టం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం రూ.10తో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా పొందే వీలుంది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని ప్రతి పౌరుడు అడిగి తెసుకోవాలన్న ఉద్ధేశంతో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా దరఖాస్తు చేసుకుని.. కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం చేసిన పనులు, నిధుల విడుదల, వినియోగం తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో వివరాలు ఉండాలి.. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, సమాచార అధికారి, అప్పిలేట్ అధికారిని నియమిస్తారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లను ప్రజలకు కనిపించేలా బోర్డుపై స్పష్టంగా రాసి ఉంచాలి. తెల్లకార్డు ఉంటే ఫీజు ఉచితం తెల్లకార్డు ఉన్నవారికి దరఖాస్తు రుసుం ఉచితం. గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం లేదు. మండల స్థాయిలో అయితే రూ.5, జిల్లా స్థాయిలో రూ.10 చెల్లించాలి. దీనిని నగదు, డీడీ, బ్యాంక్ చెక్కు, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవచ్చు. కాగా, అడిగిన సమాచారం మేరకు వివరాలు ముద్రణ రూపంలో ఇచ్చేందుకు అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారుడి నుంచే వసూలు చేస్తారు. సాధారణంగా దరఖాస్తు ఫీజుతో పాటు ముద్రణ రూపంలో సమాచారం కోరితే పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సీడీ ద్వారా సమాచారం కోరితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రికార్డులు పరిశీలన విషయంలో మొదటి గంటకు ఉచితం, ఆపై ప్రతి గంటకు రూ.5 చెల్లించాలి. సమాచారం కోరే పద్ధతి.. సమాచారం కావాల్సిన వారు సంబంధిత కార్యాలయంలో సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్లకాగితంపై రాస్తే సరిపోతుంది. రాయడం తెలియకపోయినా.. సమాచారం సక్రమంగా కోరే అవగాహన లేకపోయినా.. సంబంధిత పౌర సమాచార అధికారి తగిన సహాయం చేస్తారు. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినేట్ మీటింగ్‌లు, రికార్డులు, మంత్రులు, వారి కార్యదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. అయితే, అవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవైతే తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. స.హ. చట్టంపై అవగాహన కల్పించాలి సామాన్యులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సామాన్యులు వివిధ కార్యాలయాల సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగిన సందర్భాలు అనేకం. అలాగే సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత గడువులోగా సమాచారం అందించాల్సి ఉంటుంది. – వడ్డెపల్లి మల్లేశం, ఐకాస మండల చైర్మన్, హుస్నాబాద్ నిర్ణీత సమయంలో సమాచారం అందించాలి సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న సమాచారాన్ని నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారుడికి అందించాలి. లేని పక్షంలో సంబంధిత పౌర సమాచార అధికారులు బాధ్యుత వహించాలి. దరఖాస్తుదారుడి ఫిర్యాదు మేరకు కోర్టు చట్టరీత్యా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – భీమా సాహెబ్, న్యాయవాది, హుస్నాబాద్ -
బీజేపీపై పోరాటమెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సుప్రీం కోర్టుకు వెళతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చారు. కోర్టుకు వెళతామంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఆయన శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని మంత్రులకు చెప్పారు. విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం మన హక్కని, అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు. అంతా బాగుందని విర్రవీగితే అసలుకే మోసం వస్తుందని, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీలో చేర్చుకున్న వారితో ఇబ్బందులు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకునే అంశాన్ని ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా.. ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న వారితో నియోజకవర్గాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అందరినీ సర్దుబాటు చేయడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. స్థానికంగా సమస్యలు లేకపోతే ఎవరినైనా పార్టీలో చేర్చుకుందామని అన్నట్లు సమాచారం. -
కడప ఉక్కుపై ఉద్యమించాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం విద్యార్థులు ఉద్యమిస్తేనే ప్రభుత్వాల్లో చలనం వస్తుందని నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాష అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, అమరావతిని ఫ్రీ జోన్‌గా చేయాలంటూ రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని మంగళవారం వారు సందర్శించి మద్దతు ప్రకటించారు. మేయర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ 1970లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతోనే విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటైందన్నారు. ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కడప ఉక్కు అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకుడు షఫీ, చల్లా రాజశేఖర్, ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, ముక్తియార్ విద్యా సంస్థలు, నారాయణ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా మన హక్కు : జగన్
-
స్పెషల్ ప్యాకేజీ భిక్ష కాదు.. మా హక్కు
న్యూఢిల్లీ: బీహార్ మీద వరాల జల్లు కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. మోదీ ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ తమ రాష్ట్ర హక్కని, భిక్ష కాదని పేర్కొన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు తమకు అక్కర్లేదంటూ పరోక్షంగా విరుచుకుపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నట్టయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిపై బీజేపీ తన దాడిని ఎక్కుపెడుతూ, అటు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. స్పెషల్ ప్యాకేజీ తమ హక్కని, సహాయం కాదని తాను నొక్కి వక్కాణిస్తున్నట్లు నితీష్ వ్యాఖ్యానించారు. అంత ఆర్భాటంగా ప్రకటించిన ఆ ప్యాకేజీ వివరాలేంటో చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కోసం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రాధేయపడాలంటే అందుకు తాను సిద్ధమన్నారు. ఆ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కామెంట్ చేశారు. మంగళవారం బీహార్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మరో రూ.40 వేల కోట్ల గ్రాంట్ ఇస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ బీహార్ రాష్ట్రం బీమారు స్టేట్ గా ముద్రపడింది అంటే నితీష్ కు కోపం వస్తోందన్నారు. దీన్నిఅంగీకరించని, నితీష్ సహాయాన్నిమాత్రం అర్థిస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీహార్ సీఎం మండిపడ్డారు. బీహార్ లో ఆటవిక పాలనకు చరమాంకం పలకాల్సిన సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ గతంలో కూడా వ్యాఖ్యానించింన సంగతి విదితమే. While I will wait to hear details of the so called package announced by Modiji, I emphasize, special assistance is OUR RIGHT & not a favor — Nitish Kumar (@NitishKumar) August 18, 2015