ఎంజీఎంలో కరెంట్ కట్
ఎంజీఎంలో నిలిచిన విద్యుత్
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలోని ఔట్‌పేషెంట్ బ్లాక్‌లో శుక్రవారం ఓపీ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ లేక ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షల వంటి నివేదికలు రాకపోవడంతో రోగులు వెనుదిరిగాల్సి వచ్చింది. ఆస్పత్రిలోని అత్యవసర వార్డులకు మాత్రమే జనరేటర్ సౌకర్యం ఉండగా.. నిత్యం వేలాది రోగులు చికిత్స పొందే ఓపీ బ్లాక్ ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. దీంతో ఔట్ పేషెంట్ రోగులు నరకయాతన అనుభవించారు.ఓపీ సమయంలో విద్యుత్ పలుమార్లు నిలిచిపోయినా.. పరిపాలనాధికారులు స్పందించిన దాఖలాలు లేవు.