overdose
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆసుపత్రిలో దారుణం.. అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడంతో..
లింగోజిగూడ(హైదరాబాద్): భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్లో గురువారం జరిగింది. వైద్యులు అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన శ్రీపియల్ వెంకటేశ్వరరావు కుటుంబంతో సహా హయత్‌నగర్ సుబ్రహ్మణ్యనగర్‌లో నివాసం ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా ఇతని కుమారుడు మణిచంద్ర (28) కూడా తండ్రితో పాటు కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆడుతుండగా కుడి చెయ్యి నొప్పి వచ్చింది. పలు ఆసుపత్రుల్లో చూపించినా నొప్పి తక్కువగా కాలేదు. పలువురి సూచన మేరకు ఎల్బీనగర్లోని శ్రీకార ఆసుపత్రిలో చూపించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం శస్త్ర చికిత్స చేయడానికి మణిచంద్రను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు కొద్ది సేపటి తర్వాత అతను మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. అనస్తీషియా (మత్తుమందు) అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మణిచంద్ర చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను శాంతిపజేశారు. మృతి చెందిన మణిచంద్ర కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఆసుపత్రి యజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్‌కు బానిసై హైదరాబాద్ యువకుడు మృతి
-
రాష్ట్రంలో తొలి డ్రగ్స్ మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మితిమీరి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణాలు కోల్పోయాడు. రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి డ్రగ్స్ పెడ్లర్‌గా మారిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి, విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారికంగా పోలీసు రికార్డుల్లో నమోదైన తొలి డ్రగ్స్ సంబంధిత మరణం ఇదేనని వెల్లడించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ వివరాలను వెల్లడించారు. చనిపోవడానికి ముందు సదరు యువకుడి పరిస్థితిని తెలిపే వీడియోను ప్రదర్శించారు. డ్రగ్స్ పెడ్లర్ విచారణలో.. హైదరాబాద్‌లోని డీడీ కాలనీకి చెందిన ప్రేమ్ ఉపాధ్యాయ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. తర్వాత డ్రగ్స్ విక్రయించే పెడ్లర్‌గా మారిపోయాడు. తరచూ గోవాకు వెళ్లి ఎల్ఎస్డీ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ తెచ్చేవాడు. నగరానికే చెందిన లక్ష్మీపతి అనే వ్యక్తి నుంచి గంజాయి సంబంధిత డ్రగ్ హష్ ఆయిల్ కొనేవాడు. సింథటిక్ డ్రగ్ పిల్స్ ఒక్కోటీ రూ.3 వేలకు, ఐదు గ్రాముల హష్ ఆయిల్ రూ.3 వేలకు అమ్ముతున్నాడు. ఇటీవల అలా డ్రగ్స్ విక్రయిస్తుండగా నల్లకుంటలో ‘హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ)’ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర తరచూ డ్రగ్స్ కొనే రామకృష్ణ (సాఫ్ట్వేర్ ఉద్యోగి), నిఖిల్ జోష్వా (గిటార్ టీచర్), జీవన్‌రెడ్డి (బీటెక్ విద్యార్థి)లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేద్దామని వెళితే.. ప్రేమ్ వద్ద మరో యువకుడు కూడా డ్రగ్స్ కొనేవాడని తెలిసి అతడి ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు షాకయ్యారు. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మూడు రోజుల క్రితం చనిపోయాడని వారికి తెలిసింది. దీనిపై వారు ఆరా తీయగా.. సదరు యువకుడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని, ప్రేమ్‌తో కలిసి గోవా పార్టీలకు వెళ్లేవాడని తెలిసింది. రెండు వారాల క్రితం గోవాలో జరిగిన పార్టీలో సదరు యువకుడు వరుసగా ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టసీ పిల్స్, హష్ ఆయిల్ వంటి డ్రగ్స్ తీసుకున్నాడని.. ఓవర్‌డోస్ కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడని బయటపడింది. కుటుంబ సభ్యులు అతను కొద్దిగా కోలుకున్నాక హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. క్లరోసిస్ స్ట్రోక్‌తో నరాల పటుత్వం కోల్పోయాడని, చికిత్స లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిరోజులు మంచంపైనే ఉన్న అతను.. మూడు రోజుల క్రితం కన్నుమూశాడు. ఆ పార్టీలో మరికొందరు కూడా.. సదరు యువకుడితో పాటు గోవాలో పార్టీకి మరో ఏడుగురు కూడా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు కాగా, నలుగురు పబ్స్‌లో పనిచేసే డీజేలని తెలిసింది. వారిలోనూ కొందరు అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. కాగా.. డ్రగ్ పెడ్లర్ ప్రేమ్‌కు హష్ ఆయిల్‌ను సరఫరా చేసిన లక్ష్మీపతిని పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సదరు లక్ష్మీపతి ఇప్పటికే మూడుసార్లు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యాడని.. అయినా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. మరో కేసులో.. మరో నలుగురు.. హైదరాబాద్‌లోని బాపూజీనగర్‌కు చెందిన వి.రమేశ్ (21) కేజీల లెక్కన హష్‌ఆయిల్ కొని, చిన్న బాటిళ్లలో నింపి అమ్ముతుంటాడు. దీనిపై సమాచారం అందిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం డెయిరీఫామ్ రోడ్డులో తిరుమలగిరికి చెందిన సాయికుమార్ (25), బాపూజీనగర్‌కు చెందిన నవీన్‌కుమార్ (29)లకు హష్‌ఆయిల్ విక్రయిస్తుండగా.. ‘హెచ్–న్యూ’, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రమేశ్‌కు సహకరించిన కె.సాయిప్రకాశ్ (19)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 గ్రాముల హష్‌ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద హష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు.. ఎక్కువగా పారాసిటమాల్ మాత్రలు తీసుకుని
సాక్షి, జీడిమెట్ల: కడుపునొప్పి భరించలేక పారాసిటమాల్ మాత్రలు పెద్ద మొత్తంలో తీసుకున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా శంకర్‌నగర్‌కు చెందిన చేకూరి రాజు, లక్ష్మి(45) భార్యాభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి షాపూర్‌నగర్ సమీపంలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముంటూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా లక్ష్మి గత రెండేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతోంది. పలు ఆస్పత్రిలో చూపించి నా నొప్పి నయం కాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 25న కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో భరించలేక లక్ష్మి ఇంట్లో ఉన్న పారాసిటమాల్ మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. దీంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతున్న లక్ష్మి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం) -
పోలీస్ రిక్రూట్మెంట్కు డ్రగ్స్‌తో..!
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలలో అభ్యర్థులు సులభమైనదారులను అన్వేషిస్తూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. కురుక్షేత్రలో నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్ట్‌లో వారం రోజుల వ్యవధిలో ఇరవై ఏళ్ల యువకులు ముగ్గురు మృతిచెందారు. వీరంతా మోతాదుకు మించి ఉత్ప్రేరకాలు తీసుకోవటం వలనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో 400 మంది యువకులు సైతం ఫిజికల్ టెస్ట్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. కురుక్షేత్ర సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే నైన్ మాట్లాడుతూ.. చాలా మంది విద్యార్థులు ఫిజకల్ టెస్ట్ సమయంలో మూర్చతో పడిపోయారు. చనిపోయిన విద్యార్థులు డ్రగ్స్ ఓవర్‌డోస్ మూలంగానే మృతిచెందారనే అనుమానాలున్నాయి. దీనికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది' అని తెలిపారు. రన్నింగ్, ఇతర ఫిజికల్ టెస్ట్‌లలో అర్హత సాధించేందుకు అభ్యర్థులు కొన్ని నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా.. కొందరు మాత్రం అలా చేయకుండా ఎలాగైనా పాస్ కావాలి అనే ఉద్దేశంతో ఉత్ప్రేరకాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే ఇవ్వాల్సిన కొన్ని మందులను సైతం అభ్యర్థులు ఈజీగా మార్కెట్లో పొందుతున్నారనే విమర్శలున్నాయి.