pacage
-
ప్రత్యేకహోదా నినాదంతో బైక్, కార్లతో ర్యాలీ
పోరుమామిళ్ల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలనే నినాదాలతో దేశాయి యువసేన అధ్యక్షుడు చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో బైక్‌లు, కార్ల ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో బ్యానర్, ప్లకారŠుడ్స పట్టుకుని ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు. ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీని పదవిలోకి వచ్చాక తుంగలో తొక్కారని, రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేంద్రంతో లాలూచీ పడి హోదాను పక్కనపెట్టి ప్రత్యేకప్యాకేజీ మంచిదని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావాలను గుర్తించి యూటర్న్ తీసుకుని హోదా మంత్రం జపిస్తున్నారని ఆయన విమర్శించారు. హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. యువతకు ఉద్యోగ అవాకాశాలు, పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. పన్నులు తగ్గుతాయని చరణ్‌రెడ్డి వివరించారు. హోదాకోసం పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజలందరూ ఐక్యంగా హోదాపోరుకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. -
అంతా చట్ట ప్రకారమే
ప్యాకేజీలో అర్హుల వివరాలు పక్కా అవార్డు జరిగిన తేదీనే కటాఫ్ తప్పుడు పత్రాలతో ప్యాకేజీ పొందితే శిక్షార్హులే ప్రతి ఫిర్యాదూ నమోదు అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై జేసీ కోటేశ్వరరావు ఏలూరు (మెట్రో): ఆందోళనలు... ఆత్మహత్యా యత్నాలు... అలజడులు.. ఇవీ గత నెల రోజులుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కనిపిస్తున్న సంఘటనలు. ఒక వైపు ప్యాకేజీ సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో పడి కొందరు ఆనంద పడుతుంటే, తమకు రావాల్సిన ప్యాకేజీ రాలేదని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌ఛార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పులిపాటి కోటేశ్వరరావు ’సాక్షి’తో మాట్లాడారు. భూముల సర్వేపై ః పోలవరం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాలు భూములు ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్ ఆధారంగానే ముంపు ప్రాంతాలను గుర్తించాం. మ్యాప్‌కు అనుగుణంగానే తాము వ్యవహరించాలి తప్ప కనీసం ఒక్క అడుగు కూడా అధికంగా సేకరించేందుకు వీల్లేదు. చాలామంది తమ భూములు ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అంచనాల మేరకు తాము ముంపు ప్రాంతాలను గుర్తించాం. ఆర్ అండ్ ఆర్ చట్టం వివరిస్తూ ః చట్టంలో ఏదైతే పొందుపరిచారో అదే అమలు చేయాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిమీదనైనా చర్యలు తప్పవు. చట్టం బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది. చట్టం ప్రకారమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చేశాం. 2013 భూసేకరణ చట్టం 3 సెక్షన్ సి 2 ప్రకారం నిర్వాసితులకు (నిర్వాసిత గ్రామాల్లో 3 సంవత్సరాలుగా నివాసం ఉంటూ, ముంపు ప్రాంతాలపైనే, ముంపునకు గురయ్యే పొలాలు, స్థలాలపై ఆధారపడి జీవిస్తేనే) తప్పక పరిహారాన్ని అందిస్తాం. చట్టంలోని చాప్టర్ 12లోని 84 (1) ప్రకారం అనర్హులైన వారు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందినా, అధికారులను మోసం చేసినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా చేసిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాను కూడా విధించాలని చట్టంలో పొందు పరిచారు. అన్యాయంపై ః ఎవరివల్లో నిర్వాసితులు అన్యాయానికి గురయ్యారని చెప్పడానికి అవకాశం లేదు. ఒక రేషన్‌డీలర్ ద్వారా కాని, ఒక వీఆర్ఓ ద్వారా కాని అర్హులను అనర్హులుగా మార్చే అవకాశం లేదు. రేషన్ డీలరు, వీఆర్ఓ వంటి వారి ద్వారా పొందాల్సిన డేటా తమ వద్దే ఉంటుంది. ఈ విషయంలో నిర్వాసితులు అపోహలకు గురి కావద్దు. ఇదీ కటాఫ్ తేదీ ః అవార్డు పాస్ చేసిన జూన్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు కటాఫ్‌గా నిర్ణయించాం. దీనికి మించి ఒక్క రోజు తగ్గినా కుటుంబ ప్యాకేజీ రాదు. ఫిర్యాదులు ఇక పక్కాః ప్రతి ఫిర్యాదునూ నమోదు చేయిస్తున్నాం. పూర్తిస్థాయిలో, లోతుగా విచారణ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. విచారణకు ఎన్నిరోజులు సమయం పట్టినా న్యాయం చేసే తీరుతాం. విచారణలో ఫిర్యాదు దారులనూ ప్రశ్నించి నిజాలు తేలుస్తాం. -
ప్యాకేజీ ఇవ్వకుంటే కదలం
న్యాయం జరిగితేనే గ్రామం ఖాళీ చేస్తాం మా పేర్లు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి ఆర్ అండ్ ఆర్‌లో అక్రమాల నిగ్గుతేల్చాలి మండిపడుతున్న యువతీ, యువకులు పోలవరం: పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ జాబితాలో 18 ఏళ్లు పైబడిన పలువురు యువతీ, యువకుల పేర్లు నమోదు కాలేదు. ఈ కారణంగా వందల మంది ప్యాకేజ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీరిలో ఎక్కువ మంది బుట్టాయిగూడెం, ఏలూరు కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. 2006లో మొదటిసారి సర్వే నిర్వహించినపుడు డేటాలో వీరంతా నమోదయ్యారు. ఇటీవల గ్రామాలలో మళ్లీ సర్వే నిర్వహించినపుడు వీరి పేర్లు చదివి, ఉన్నట్లుగా నమోదు చేశారు. తుది జాబితాలో మాత్రం యువతీ, యువకుల పేర్లు లేవు. గ్రామ సభల సమయంలో వీరంతా కళాశాలలు వదిలి స్వంత గ్రామాలకు వచ్చారు. అప్పట్లో ప్యాకేజ్ వస్తుందని చెప్పిన అదికారులు, చివరికి జాబితాలో వీరి పేర్లను నమోదు చేయలేదు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎక్కువ మంది ఇంటర్ రెండవ సంవత్సరం, డిగ్రీ రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్నారు. వీరంతా గిరిజన యువతీ, యువకులు. జాబితాలో పేర్లు లేకపోవడంపై పోలవరం తహసీల్దార్ ఎం.ముక్కంటిని అడిగితే ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ప్యాకేజీ ఇవ్వకపోతే గ్రామం ఖాళీ చేసేది లేదని చెబుతున్నారు. ములగలగూడెంకు చెందిన మూలెం రాధ, కుంజం రామలక్ష్మి తదితరులు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. గాజులగొందికి చెందిన కారం ప్రకాష్, అరగంటి సూర్యకిరణ్ తదితరులు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వీరెవరికీ కూడా ప్యాకేజీ జాబితాలో పేర్లు రాలేదు. ప్యాకేజీలో నాపేరు రాలేదు.... నాకు 18 ఏళ్లు నిండాయి. 2006 డేటాలో నాపేరు ఉంది. ఇపుడు తుది జాబితాలో లేదు. తహసీల్దార్‌ను అడిగితే ప్రూఫ్‌లతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. నా పేరు ఎందుకు నమోదు చేయలేదో తెలియటం లేదు. మడకం కుమారి, ములగలగూడెం, పోలవరం మండలం నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నా. నాకు 18 ఏళ్లు నిండాయి. ప్యాకేజ్ జాబితాలో నా పేరు రాలేదు. ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలి. ప్యాకేజ్ ఇవ్వాలి. ముళ్ల రవీంద్రారెడ్డి, గాజులగొంది, పోలవరం మండలం -
ముందస్తు ఒప్పందాల ప్యాకేజీ
ఆర్అండ్ఆర్ జాబితాలో రెవెన్యూ, రేషన్‌డీలర్ల మాయాజాలం అనర్హులతో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేలా అవగాహన అడ్డగోలుగా, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డుల జారీ నిజమైన నిర్వాసితులకు మొండిచెయ్యి వేలేరుపాడు: పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా అర్హులైన నిర్వాసితుల జాబితా ఖరారులో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు, రేషన్ షాపు డీలర్లు కీలకపాత్ర పోషించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమందితో ముందస్తు ఒప్పందాలు చేసుకున్న వీరు నిజమైన అర్హులను తొక్కిపట్టారు. పరిహారం వచ్చాక ఫిఫ్టీ,ఫిఫ్టీ పంచుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే అర్హుల పేర్లు గల్లంతయ్యాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక, స్థానికేతరులు ఎవరో తేల్చే పనిని గ్రామాల్లో వీఆర్ఏ, రేషన్ షాపు డీలర్లకు అప్పగించడంతో వారి ఇష్టారాజ్యమైంది. వారితో ఒప్పందం చేసుకున్న వారి పేర్లు జాబితాలో అర్హులుగా వచ్చాయి. అన్ని ఆధారాలు ఉన్న అనేక మంది నిర్వాసితుల పేర్లు మాత్రం గల్లంతయ్యాయి. మొదట్లో ఒకటికి నాలుగు సార్లు సర్వేలు చేశామని, ఇంటింటికీ తిరిగి డేటా సేకరించామని గొప్పలు పోతున్న అధికారులు, పెళ్లి అయిన వారికి కానట్లు, కాని వారికి అయినట్లు, స్థానికులను స్థానికేతరులుగా, బయటివారిని స్థానికులుగా, బతికి ఉన్న వాళ్లు చనిపోయినట్లు, గిరిజనులను గిరిజనేతరులుగా చూపారు. అలాగే ఉపాధి హామీ పనికెళ్లే కూలీలకు జాబ్‌కార్డులు ఉన్నా, వితంతు, వృధ్ధాప్య పెన్షన్లు ప్రతీ నెలా వస్తున్నా అలాంటి వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రకటించిన జాబితా వివరాలపై నిర్వాసితులు ప్రశ్నిస్తే, నోరెళ్ల బెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ తప్పిదాలన్నీ వారి అక్రమాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. కనీసం బాధితులు చెప్పేది వినిపించుకోకుండా సాక్షాత్తు ఉన్నతాధికారులే ఏకపక్షంగా వాదించడం నిర్వాసితుల్ని మరింత కుంగదీస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. జూన్ 12న గ్రామసభలు నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించారు. అర్హులను గుర్తించేందుకు వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 3430 మంది నకిలీ నిర్వాసితులుగా విఆర్ఏలు, రేషన్ షాపు డీలర్లే గుర్తించారు. ఈ రెండు మండలాల్లో 26,115 మంది నిర్వాసితులు అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత మళ్లీ ఇంటి స్ధిరాస్తి విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఇందులో కుక్కునూరు మండలంలో సుమారు 2500 మంది, వేలేరుపాడు మండలంలో సుమారు 1500 మంది అర్హులను అనర్హులుగా ప్రకటించారు. వ్యక్తిగత ప్యాకేజీ కింద గిరిజనులకైతే 7.26లక్షలు, గిరిజనేతరులకైతే 6.36 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే మొదటి జాబితాలతో అర్హులుగా వచ్చిన అనేక మంది స్థానికుల పేర్లు, ప్రస్తుత జాబితాలో అనర్హులుగా ప్రకటించడం గమనార్హం. పథకం ప్రకారమే అంతా చేసారు... రెవెన్యూ అధికారులు ముందస్తు పథకం ప్రకారమే అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పునరావాస ప్యాకేజీ ప్రకటించక ముందే ఈ రెండు మండలాల తహశీల్దార్లు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల 191 రేషన్‌కార్డులుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 18వేల 474కు పెరిగింది. అంటే 2,283 కుటుంబాలు పెరిగాయి. వేలేరుపాడు మండలంలో రెండేళ్ల క్రితం 6041 కార్డులుండగా ప్రస్తుతం 7,393, కుక్కునూరు మండలంలో 10150 ఉండగా, 11081కు పెరిగాయి. ఇవి కాకుండా అసలు రేషన్కార్డులులేని వందలాది కుటుంబాలున్నాయి. ఈ ప్రాంతం నుంచి 30, 40 ఏళ్ల క్రితం అనేక కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలాంటి వారికి కూడా రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అప్పట్లో ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పెన్షన్ వస్తున్నా స్థానికురాలిని కాదంట: వలగాని సావిత్రి, వేలేరుపాడు నేను 50 ఏళ్లుగా వేలేరుపాడులో నివాసముంటున్నా. నా భర్త అప్పలయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు. నాకు సంతానం లేదు. బాలుడిని దత్తత తీసుకొని పెంచుకున్నాను. నాకు రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఉంది. ప్రతీ నెలా రేషన్ తీసుకుంటున్నా, రోజూ ఉపాధి కూలి పనికెళ్తున్నా, బ్యాంక్‌లో ఉపాధి వేతనం పొందుతున్నాను. వితంతు పెన్షన్ వస్తోంది. ఇలాంటి అన్ని ఆధారాలు ఉన్నా జాబితాలో నాన్ లోకల్‌గా ప్రకటించారు. ఇదెక్కడి అన్యాయ మండి. జాబ్‌కార్డు ఉన్నా నాన్‌లోకల్‌గా ప్రకటించారు: కొంబత్తిన కృష్ణార్జున్‌రావు, కట్కూరు, వేలేరుపాడు మండలం మా తాతముత్తాల నుండి కట్కూరులో నివాసముంటున్నా. 2007లో నా పట్టా పొలానికి పరిహారం వచ్చింది. నాకు జాబ్ కార్డు, రేషన్, ఓటర్ఐడీ, ఆధార్‌కార్డు లాంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను నాన్రెసిడెన్స్గా ఎలా ప్రకటించారు. గ్రామంలో విచారించండి. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం: సారే రామారావు, రుద్రమకోట, æవేలేరుపాడు మండలం నేను యాభై ఏళ్లుగా మా తాతముత్తాతల నుంచి రుద్రమకోటలో నివాసముంటున్నాను. కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రేషన్,కార్డు, ఓటర్ఐడీ ఉంది. వృధ్ధాప్య పెన్షన్ వస్తోంది. నా వయసు 72 సంవత్సరాలు. అయినా అధికారులు జాబితాలో నాన్‌లోకల్‌గా ప్రకటించారు. కొండరెడ్డినని కూడా కనికరించలేదు: కెచ్చెల సీత, కట్కూరు ‡ నన్ను కొండరెడ్డినని కూడా కనికరించలేదు. 20 ఏళ్లుగా రేషన్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ ఆర్అండ్ఆర్ జాబితాలో స్థానికేతరురాలిగా ప్రకటించారు.అధికారుల కళ్లకు మా కుటుంబాలు కనబడటంలేదా..? -
పోలవరం ప్యాకేజీపై న్యాయ విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తొలి విడతలో ఖాళీ చేసిన 8 గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. మామిడిగొంది సర్పంచ్ బొరగం కన్నప్పరాజు తదితరులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరు, పునరావాస కేంద్రాల్లో సమస్యలను నాగిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ 11 రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిర్వాసితుల సమస్యలను తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించడంతో తాను ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. నిర్వాసితులు చెప్పిన సమస్యలన్నిటినీ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళతానన్నారు. ఇక్కడి సమస్యలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతు, ప్రజాసంఘాలతో కలిసి పోరాడతారని పేర్కొన్నారు. నిర్వాసితులకు అండగా ఉండేవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ధర్మబద్ధంగా మానవత ధృక్పథంతో న్యాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్నవారిని ఉసురుపెట్టడం మంచిది కాదని హితవు పలికారు. నిర్వాసితుల సమస్యలపై శనివారం విజయవాడలో అఖిలపక్ష కమిటీ సమావేశం జరుగుతోందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రాంతీయ కార్యదర్శి కె.త్రినాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాసరావు, పోలవరం మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి ఉన్నారు. -
పోలవరం ప్యాకేజీపై న్యాయ విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తొలి విడతలో ఖాళీ చేసిన 8 గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. మామిడిగొంది సర్పంచ్ బొరగం కన్నప్పరాజు తదితరులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరు, పునరావాస కేంద్రాల్లో సమస్యలను నాగిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ 11 రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిర్వాసితుల సమస్యలను తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించడంతో తాను ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. నిర్వాసితులు చెప్పిన సమస్యలన్నిటినీ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళతానన్నారు. ఇక్కడి సమస్యలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతు, ప్రజాసంఘాలతో కలిసి పోరాడతారని పేర్కొన్నారు. నిర్వాసితులకు అండగా ఉండేవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ధర్మబద్ధంగా మానవత ధృక్పథంతో న్యాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్నవారిని ఉసురుపెట్టడం మంచిది కాదని హితవు పలికారు. నిర్వాసితుల సమస్యలపై శనివారం విజయవాడలో అఖిలపక్ష కమిటీ సమావేశం జరుగుతోందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రాంతీయ కార్యదర్శి కె.త్రినాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాసరావు, పోలవరం మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి ఉన్నారు. -
ఒకే మాట.. ఒకేబాట
పోలవరం నిర్వాసితుల పోరుబాట ఆర్ఆర్ ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ లేకుంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిక ప్రభుత్వం, అధికారుల తీరుపై పోలవరం ముంపు బాధితులు మండిపడ్డారు. పోరాటానికి సిద్ధమయ్యారు. ఆర్ఆర్ప్యాకేజీపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం వేలేరుపాడు వేలేరుపాడు : పోలవరం ప్యాకేజీ ముంపుబాధితులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఇంతకాలం ఏం జరిగినా సహనంగా విని ఊరుకున్న ఈ ప్రాంత ప్రజలు ఎంతకైనా తెగించడానికి సిధ్ధమయ్యారు. ప్యాకేజీ అంశాన్ని ప్రభుత్వం నానబెడ్తుండటంతో రోజురోజుకూ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. అసలు సమస్యకు సమాధానాలు వదిలేసి అధికారులు ఎన్ని సాకులు చెప్పినా ప్రజలు వినే పరిస్ధితిలో లేరు. ప్రభుత్వం ఇలాగే తమాషాలు చేస్తే, రానురాను పరిస్ధితులు చేయిదాటి పోయినా ఆశ్చర్యనక్కరలేదు. తాజాగా ఇండ్ల సర్వే కోసం సీరియల్ నెంబర్లు వేయడానికి వెళ్ళిన అధికారులకు ప్రజల నుండి ఎదురైన వ్యతిరేకత, నిరసన సెగలు, ఇందుకు అద్దంపడుతున్నాయి. ‡ఏదో రకంగా ఏరుదాటి తెప్పతగలేద్దామన్న చందంగా అధికారుల వైఖరి కనబడుతోంది. కుక్కునూరు మండలంలో ఆర్ఆర్ సర్వేకు ముందు ప్యాకేజీ ప్రకటించిన అధికారులు వేలేరుపాడు మండలానికి వచ్చేసరికి ప్యాకేజీ ప్రకటించకపోయినా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కుక్కునూరు మండలంలో భూసేకరణ జరగలేదు కనుక అక్కడ ప్యాకేజీ ప్రకటించాల్సి వచ్చిందని, వేలేరుపాడులో 2006,2007 సంవత్సరంలో భూసేకరణ జరిగినందున ఇక్కడ నూతన భూసేకరణ(2013) ప్రకారం ప్యాకేజీ ప్రకటించలేమని అధికారులు చెబుతున్నారు. సర్వే చేపడితే కుటుంబాల సంఖ్య, ఎంతమంది యువతీ యువకులున్నది ఒక అంచనా వస్తుందని, ఈ అంచనాను బట్టి ప్రభుత్వానికి ప్యాకేజీ పై ఎంత వ్యయం అన్నది స్పష్టత లభిస్తుందని, ఆ తర్వాతే జీఓ విడుదలవుతుందని భూసేకణాధికారి పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే కుటుంబాల లెక్క తేలినంత మాత్రాన కుటుంబానికిచ్చే ప్యాకేజీ పై స్పష్టతలేనప్పుడు అంచనా వ్యయం ఎలా తెలుస్తుందన్న అనుమానాలు నిర్వాసితుల్లో ఉదయిస్తున్నాయి. ఇప్పుడైతే గ్రామాలు ఖాళీ చేయడంలేదు. ఇంత హడావుడిగా సర్వే చేపట్టేకంటే ఆర్ఆర్ ప్యాకేజీ పై ప్రభుత్వ జీఓ ప్రకటించిన అనంతరం సర్వే చేపట్టినట్లయితే పూర్తి సహకారం అందిస్తామని నిర్వాసితులు వాపోతున్నారు. అధికారుల అవకాశవాదధోరణి వల్ల నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేలేరుపాడుకు 2013 చట్టం ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చారు... వేలేరుపాడు మండలంలో రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ము రెవిన్యూల్లో ఖాల్సా భూములకు, సిధ్ధారం రెవిన్యూ గ్రామంలో పట్టా భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. ఈ మేరకు 2013వ సంవత్సరం 30 వచట్టం వలన భూసేకరణ,పునరావాసం,పునః స్ధాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్ రూల్ (1) అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసారు.ææ ఆర్ఆర్కు ఇది వర్తించదంటున్నారు... ఇంత వరకు బాగానే ఉన్నా ఆర్ఆర్ ప్యాకేజీ విషయానికొస్తే, ఈ చట్టం వర్తించదని అధికారులు అంటున్నారు. వేలేరుపాడుకు రెవిన్యూ గ్రామంలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిచ్చే తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము గ్రామాలు వేలేరుపాడు మండలం కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. ∙ll సర్వేకు సానుకూలంగా అధికార పార్టీ... ∙ ఇదిలా ఉండగా అధికార పార్టీ మాత్రం ఇండ్ల సర్వేకు సానుకూలంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు అఖిల పక్షంతో పాటు ఆందోళనలు చేసిన ఆ పార్టీ నాయకులు నేడు సర్వేకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న అధికారులు స్ధానిక నేతలను వెంటబెట్టుకొని కొన్ని చోట్ల నామమాత్రంగా ఇండ్లకు నెంబర్లు వేస్తున్నారు. ఇండ్ల యజమానులు తమ ఇండ్లకు తాళాలు వేసుకొని పనులకు వెళ్ళినా, వాటికి కూడా నెంబర్లు వేసారు. మమ్మల్ని ఇంకా ముంచాలనే చూస్తున్నారు: తెల్లం బూబమ్మ గిరిజన నిర్వాసితురాలు ఎర్రబోరు వేలేరుపాడు మండలం ఇంకా మ్మల్ని ముంచాలనే అధికార్లు చూస్తున్నారు. నాకు 9ఎకరాల పొలం ఉంది. 2006లో భూమికి బదులు భూమికింద 610 కుంటల భూమిపోను 2.30 ఎకరాలకు ఎకరాకు లక్షా15వేల చొప్పున 3లక్షల20 వేల పరిహార ఇచ్చారు. ఇందులో బ్యాంక్ అప్పులకు 70లు జమ చేసుకున్నారు. మిగతావి ఖర్చులకే అయిపోయాయి. మిగిలింది వట్టి చేతులే. ఆర్ఆర్ ప్యాకేజీ అన్నా మంచిగ వస్తది అనుకుంటే అదీ ప్రకటించడంలేదు. భూములకిచ్చేటప్పుడు ఇండ్లకెందుకు ఇవ్వరు: కారం వెంకటరమణ సర్పంచ్ రేపాకగొమ్ము 2013 చట్టం ప్రకారం రేపాకగొమ్ము గ్రామ పంచాయితీలో భూములకు పరిహారం ఇస్తున్నప్పుడు ఇండ్లకు ఎందుకివ్వరు. చట్టం అంతటా వర్తిస్తుంది. కావాలనే, ప్రభుత్వం మాయ చేస్తోంది. ప్రజల తిరుగుబాటు తప్పదు: జాన్‌బాబు నడిమిగొమ్ము ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగబడతారు. అన్ని విధాలా నష్టపోయిన తమకు ఉద్యమ బాట పట్టక తప్పేటట్లు లేదు.