
ర్యాలీలో మాట్లాడుతున్న చరణ్‌రెడ్డి
పోరుమామిళ్ల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలనే నినాదాలతో దేశాయి యువసేన అధ్యక్షుడు చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో బైక్‌లు, కార్ల ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో బ్యానర్, ప్లకారŠుడ్స పట్టుకుని ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు. ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీని పదవిలోకి వచ్చాక తుంగలో తొక్కారని, రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేంద్రంతో లాలూచీ పడి హోదాను పక్కనపెట్టి ప్రత్యేకప్యాకేజీ మంచిదని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావాలను గుర్తించి యూటర్న్ తీసుకుని హోదా మంత్రం జపిస్తున్నారని ఆయన విమర్శించారు. హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. యువతకు ఉద్యోగ అవాకాశాలు, పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. పన్నులు తగ్గుతాయని చరణ్‌రెడ్డి వివరించారు. హోదాకోసం పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజలందరూ ఐక్యంగా హోదాపోరుకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు.