pace maker
-
వందేళ్లు పనిచేసే అణువిద్యుత్ బ్యాటరీ
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ సంప్రదాయ కెమికల్ బ్యాటరీ కన్నా పదింతలు అధిక విద్యుత్ ఇవ్వడమే కాకుండా నూరేళ్లపాటు చార్జింగ్ చేయాల్సిన అవసరం లేని అణు విద్యుత్ బ్యాటరీని రష్యా శాస్త్రవేత్తలు తయారు చేశారు. గుండె కొట్టుకోవడానికి అమర్చుకునే పేస్ మేకర్ నుంచి అంగారక గ్రహానికి వెళ్లే వాహనంలో ఉపయోగించుకునేందుకు కూడా ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అణు విద్యుత్ బ్యాటరీ ఓ జీవితకాలం పని చేస్తుంది కనుక పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే చాలు, మళ్లీ దాన్ని చార్జి చేసుకోవాల్సిన అవసరమే రాదు. అణు విద్యుత్ ప్రొటోటైప్ తయారీలో సెమీకండక్టర్గా తాము వజ్రాన్ని, రేడియో యాక్టివ్ కెమికల్‌ను ఉపయోగించినట్లు మాస్కోలోని ‘టెక్నాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సూపర్ హార్డ్ అండ్ నావల్ కార్బన్ మెటీరియల్స్’కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో బీటా రేడియేషన్ ఉండడం వల్ల దాన్ని మానవ శరీరం లోపల ఉపయోగించి ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు. అణు విద్యుత్ బ్యాటరీని తయారు చేయడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు తయారు చేసినవి సైజులో చాలా పెద్దవని, మొట్టమొదటిసారిగా అతి చిన్న బ్యాటరీని తయారు చేయడంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము తయారు చేసిన ఈ బ్యాటరీ పరిజ్ఞానం కూడా నాసా శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుందని వారు అన్నారు. అంగారక గ్రహంలో ఏర్పాటు చేయనున్న మానవ కాలనీలకు కొన్నేళ్లపాటు విద్యుత్‌ను అందించేందుకుగాకు నాసా ఇప్పుటికే ‘కిలో పవర్’ అణు విద్యుత్ రియాక్టర్‌ను తయారు చేస్తోంది. -
ఇక గుండెకు బ్యాటరీ లెస్ పేస్‌మేకర్
వాషింగ్టన్: వైద్యరంగంలో గుండెకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పేస్మేకర్లను వాడుతున్నారు. పేస్మేకర్లు గుండెకు కావాల్సిన కదలికలను అందించడానికి ఉపయోగపడుతాయి. అయితే ఇప్పటివరకూ వాడుతున్న పేస్మేకర్లలో బ్యాటరీలను వాడుతున్నారు. ఇక బ్యాటరీల అవసరం లేకుండా స్వతహాగా శక్తిని తయారుచేసుకునే పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నయి. పీజోఎలక్ట్రిక్ సిస్టం ద్వారా గుండెకదలికల్లో జనించే శక్తినే పేస్మేకర్లు ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ పవర్‌గా మార్చుకునే కొత్త టెక్నాలజీని అమెరికన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పటివరకు వాడుతున్న పేస్మేకర్లను వాటిలోని బ్యాటరీ చార్జింగ్ కోసం ఐదు నుండి పది సంవత్సరాలలో మార్చాల్సి ఉండేది. కాగా తాజా విధానంతో దీనికి పరిష్కారం లభించినట్లవుతుంనీ, తద్వారా పేస్మేకర్ల ఖర్చు తగ్గుతుందని ప్రొఫెసర్ అమిన్ కరామి తెలిపారు. పీజోఎలక్ట్రిక్ విధానం ద్వారా పేజ్మేకర్ల నిర్మాణంలో ఇంతకు ముందున్నటువంటి సంక్లిష్టతలు తొలగిపోనున్నట్లు తెలిపారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్న వారికోసం త్వరలోనే బ్యాటరీ లెస్ పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నాయి. -
గుండెకు వైర్లు లేని పేస్‌మేకర్
విజయవంతంగా అమర్చిన భారతీయ వైద్యుడు వివేక్ రెడ్డి సంప్రదాయ పేస్మేకర్కన్నా 10 శాతం చిన్నది శస్త్రచికిత్స అవసరం లేకుండానే గుండెలో నేరుగా అమర్చవచ్చు న్యూయార్క్: భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ వివేక్ రెడ్డి అమెరికాలో ఘనత చాటారు. లీడ్లు (వైర్లు) లేని చిన్న పేస్‌మేకర్‌ను ఒక హృద్రోగి గుండెలోపలే నేరుగా అమర్చారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా గజ్జల వద్ద నుంచి ధమని ద్వారా కేథెడర్ విధానంలో ఆ పేస్‌మేకర్‌ను గుండెలోకి పంపించగలిగారు. ఇక్కడి ది మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో ఆ చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ లీడ్లులేని పేస్ మేకర్ సంప్రదాయ పేస్‌మేకర్ కన్నా పది శాతం చిన్నగా ఉంటుంది. సెయింట్ జ్యూడ్ మెడికల్ రూపొందించిన ఈ బుల్లి పేస్ మేకర్ చిన్న సిల్వర్ ట్యూబ్‌ను పోలి ఉంటుంది. ఈ పేస్ మేకర్ గురించి వివేక్ రెడ్డి చెప్పిన విషయాలు.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సామర్థ్యం, భద్రతపై పలు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. దీనిని లీడ్లెస్ 2 అని పిలుస్తారు. దీని కోసం అమెరికా, కెనడా, యూరప్‌లోని 50 కేంద్రాల్లో 670 మంది నమోదు చేసుకున్నారు. అక్కడ వైద్య పరీక్షల్లో శస్త్ర చికిత్స అవసరం లేని ఈ కొత్త పరికరాన్ని పరీక్షిస్తారు. కొత్త పేస్‌మేకర్‌కు ఎటువంటి వైర్లు లేకపోవడం వల్ల ఇది సురక్షితమైనది. గుండె కొట్టుకోవడం మందగించినపుడు ఇతర పేస్ మేకర్లలానే ఇది కూడా విద్యుత్ ప్రకంపనలు సృష్టించి గుండె సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. దీని బ్యాటరీ జీవిత కాలం కూడా ఇతర వాటిల్లానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది పేస్మేకర్లను వినియోగిస్తున్నారు. ప్రతీ ఏడాది 7 లక్షల మంది కొత్త పేషెంట్లకు వీటిని అమర్చుతున్నారు. వాళ్లకు శస్త్ర చికిత్సలాంటి ఇబ్బందులు లేకుండా దీనిని అమర్చవచ్చు. దీనిని వల్ల ఎలాంటిఇబ్బందులు తలెత్తవని ఈ పరి శోధన పరిశీలకుడు శ్రీనివాస్ దుక్కిపాటి తెలిపారు.