పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది
ౖÐð రా కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్ హేమంత్‌కుమార్
ఏన్కూరు: పచ్చిరొట్ట ఎరువులు కలియదున్నడం ద్వార భూసారం పెరుగుతుందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్ హేమంత్‌కుమార్ తెలిపారు. క్లస్టర్ స్థాయి జీవనోపాధుల వనరుల కేంద్రంలో ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పంట సమూహాల అభివృద్ధి పథకం కింద గురువారం జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట, ఎరువులు , పెసర, పిల్లిపెసర, జనుము, జిలుగులు సాగు భూమికి అందించలన్నారు. దీనివలన భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయన్నారు. వరిలో జింక్ రెండు పంటలకు ఒక్కసారి వేయాలన్నారు. వరిలో కాలిబాటలు తీయటం, యూరియాను తగిన మోతదులో వాడటం వలన దోమ ఉధృతిని నివారించవచ్చన్నారు. పత్తికి 45 రోజులకు మెగ్నిషియం, 60 రోజులకు బోరాన్ వేయలన్నారు. పత్తిలో అంతర్పంటగా కందిసాగు చేయాలన్నారు. మిర్చి, వేపపిండి, వేపనూనె వాడలన్నారు. మిర్చితోట చుట్టు జొన్న, మొక్కజొన్న పంటలు వేయాలన్నారు. తోటలో బంతి, ఆముదం వేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏఓ శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి డి. బాలాజి పాల్గొన్నారు.