pacquiao
-
'గే' లపై కామెంట్స్‌తో కాంట్రాక్ట్ పోయే..
మనీలా: స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా నీచం అని వ్యాఖ్యానించి తరువాత క్షమాపణలు చెప్పిన ఫిలిప్పీన్స్ బాక్సర్ ఫకియావ్తో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైక్ ప్రకటించింది. పకియావ్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలను తమ సంస్థ ఏ మాత్రం సహించబోదని నైక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. లింగవివక్ష ఎదుర్కొంటున్న కమ్యూనిటీకి తమ సంస్థ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పకియావ్ ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తరువాత బైబిల్ చెబుతున్న విషయాన్నే నేను చెబుతున్నానని సమర్థించుకున్నా ఆయనపై విమర్శల పర్వం ఆగలేదు. ప్రస్తుతం పకియావ్ ఫిలిప్పీన్స్‌లో సెనేటర్ స్థానం కోసం పోటీలో ఉన్నాడు. -
మహాయుద్ధంలో మేవెదర్ విజయం!
-
మహా యుద్ధంలో ఫ్లాయిడ్ మేవెదర్ గెలుపు
-
పాకియోను పడగొట్టిన మేవెదర్
లాస్‌వేగాస్: మహా యుద్ధంలో ఫ్లాయిడ్ మేవెదర్ గెలుపొందాడు. ఫిలిప్పీన్స్ బాక్సర్ మ్యానీ పాకియో పోరాడి ఓడాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’లో అమెరికా మహాబలుడు మేవెదర్ విజయకేతనం ఎగురవేశాడు. ప్రత్యర్థి పాకియోను పడగొట్టి టైటిల్ కైవశం చేసుకున్నాడు. న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా మేవెదర్ ను విజేతగా ప్రకటించారు. మేవెదర్ కు 1500 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. 12 రౌండ్ల పాటు జరిగిన మహాపోరులో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఇద్దరు యోధులు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన 'రింగ్' ఫైట్ లో బాక్సలిద్దరూ పంచ్ లతో విరుచుకుపడ్డారు. అనుకున్న సమయానికి కంటే గంట సేపు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 'రింగ్'లో పాకియో చురుగ్గా కదిలినట్టు కనిపించాడు. మేవెదర్ మాత్రం ఆచితూచి ఆడాడు. పాకియో ఎటాకింగ్ చేయగా, మేవెదర్ ఆత్మరక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరి రెండు రౌండ్లులో మేవెదర్ దూకుడు పెంచాడు. పాకియోపై ఎటాక్ చేసి అతడిని ఆత్మరక్షణలో పడేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత న్యాయనిర్ణేతలు మేవెదర్ ను విజేతగా ప్రకటిస్తూ ఏకగ్రీవ నిర్ణయం వెలువరించారు. తన కెరీర్లో పోటీపడిన 48 బౌట్లలోనూ గెలిచి తన అజేయ రికార్డు మెరుగుపరుచుకున్నాడు. మరో బౌట్ గెలిస్తే అమెరికా దిగ్గజ బాక్సర్ రాకీ మార్సియానో రికార్డు 49-0ను చేరుకుంటాడు. ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ కు... 40 శాతం పాకియో కు చెల్లిస్తారు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ బౌట్‌కు రిఫరీగా కెన్నీ బేలిస్ వ్యవహరించారు. ఆయనకు 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలు) ఫీజు ఇస్తారు. బాక్సింగ్‌లో ఓ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం. -
కొదమ సింహాల్లా కలబడ్డారు
లాస్‌వేగాస్: ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) బాక్సింగ్ యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ఇద్దరు మహాబలులు హోరాహోరీ తలపడుతున్నారు. వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు) జరుగుతున్న పోరులో బ్యాక్సింగ్ కింగ్ లు ఇద్దరూ కొదమ సింహలా కలబడడుతున్నారు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’పాకియో పైచేయి సాధించాడు. ఎటాకింగ్ తో మేవెదర్ ను పాకియో ను బెంబేలెత్తిస్తున్నాడు. మేవెదర్ ఆత్మరక్షణ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే మొదట వెనకబడినట్టు కనబడిన మేవెదర్ తర్వాత పుంజుకున్నాడు. -
బిగ్ ఫైట్ ప్రారంభం
లాస్‌వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’కు తెర లేచింది. మహా బలుల యుద్ధం మొదలైంది. ‘రింగ్’లో కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి పోటీకి దిగారు. వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు)లో జరిగే ఈ బౌట్లో మూడు నిమిషాల నిడివిగల 12 రౌండ్లు ఉంటాయి. నిర్ణీత 12 రౌండ్లలోపు ఎవరైనా నాకౌట్ అయితే బౌట్ అక్కడే ముగుస్తుంది. ఒకవేళ బౌట్ పూర్తిగా 12 రౌండ్లు జరిగితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. మొత్తానికి 45 నిమిషాల పాటు పోరు సాగే అవకాశముంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ముందే కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ ఖాతాలోకి... 40 శాతం పాకియో ఖాతాలోకి వెళ్తుంది. -
మెగా ఫైట్
మేవెదర్‌తో పాకియో అమీతుమీ నేడే ప్రొఫెషనల్ కెరీర్లో పరాజయమెరుగని బాక్సర్ ఒకవైపు... పట్టుదల ఉండాలేగాని అట్టడుగు స్థాయి నుంచి అగ్రపథానికి చేరుకోవచ్చని నిరూపించిన బాక్సర్ మరోవైపు... నేపథ్యాలు వేరైనా దశాబ్దకాలంగా ‘రింగ్’లో కింగ్స్‌గా వెలుగొందుతున్న వారిద్దరే ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్). ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు నిర్వహించేందుకు ఐదేళ్లుగా సాగిన ప్రయత్నాలు ఈ ఏడాది ఫలించాయి. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే ఈ ‘శతాబ్దపు పోరు’లో విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి. సాక్షి క్రీడావిభాగం బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీ దైన పోటీకి అమెరికాలోని లాస్వేగాస్లో మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. పదేళ్లకంటే ఎక్కువ కాలం నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఉన్నప్ప టికీ ఈ బౌట్ ద్వారా మేవెదర్, పాకియోల పేర్లు అందరి నోళ్లలో నానుతున్నాయి. ఈ బౌట్ విశేషాలు, బాక్సర్ల నేపథ్యం గురించి క్లుప్తంగా... ఎలా జరుగుతుందంటే... వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు)లో జరిగే ఈ బౌట్లో మూడు నిమిషాల నిడివిగల 12 రౌండ్లు ఉంటాయి. నిర్ణీత 12 రౌండ్లలోపు ఎవరైనా నాకౌట్ అయితే బౌట్ అక్కడే ముగుస్తుంది. ఒకవేళ బౌట్ పూర్తిగా 12 రౌండ్లు జరిగితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. మొత్తానికి 45 నిమిషాల పోరాటం ద్వారా ఈ ఇద్దరు బాక్సర్లు వందల కోట్లు జమచేసుకోనున్నారు. ఆదాయమెంతంటే.... ముందే కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ ఖాతాలోకి... 40 శాతం పాకియో ఖాతాలోకి వెళ్తుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. అదే జరిగితే మేవెదర్‌కు దాదాపు రూ. 1500 కోట్లు, పాకియోకు దాదాపు రూ. 1000 కోట్లు వస్తాయి. ఈ బౌట్‌కు రిఫరీగా కెన్నీ బేలిస్ వ్యవహరిస్తారు. ఆయనకు 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలు) ఫీజు ఇస్తారు. బాక్సింగ్‌లో ఓ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం. అజేయుడు... ‘అమెచ్యూర్’ బాక్సర్ హోదాలో మేవెదర్ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ఫెదర్ వెయిట్ కేటగిరిలో అమెరికాకు కాంస్య పతకం అందించాడు. అదే ఏడాది అతను ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత మేవెదర్ తన కెరీర్లో పోటీపడిన 47 బౌట్లలోనూ గెలిచి అజేయుడుగా ఉన్నాడు. 38 ఏళ్ల మేవెదర్ తాను సాధించిన 47 విజయాల్లో 26 బౌట్లలో ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడైన మేవెదర్‌కు లక్షల డాలర్లు విలువవేసే అరుదైన ఎనిమిది కార్లు, రెండు ప్రత్యేక జెట్ విమానాలు ఉన్నాయి. పోరాట యోధుడు మేవెదర్ మాదిరిగా పాకియో అజేయుడు కాకపోయినా తన కెరీర్లో పోటీపడిన 64 బౌట్లలో 57 విజయాలు సాధించాడు. ఐదింటిలో ఓడిపోయాడు. మరో రెండు బౌట్లు ‘డ్రా’గా ముగిశాయి. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన 36 ఏళ్ల పాకియోకు ఫిలిప్పీన్స్‌లో విశేష ఆదరణ ఉంది. అతని ‘ఫైట్’ జరుగుతున్న సమయంలో అందరూ టీవీలకు అతుక్కుపోతారని, ఆ సమయంలో దేశంలో ఎలాంటి నేరాలు సంభవించవని అంటుంటారు. కేవలం బాక్సింగ్‌లోనే కాకుండా బాస్కెట్‌బాల్‌లోనూ పాకియోకు ప్రవేశముంది. 2010లో ఫిలిప్పీన్స్ చట్టసభలో ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన పాకియో సినిమాల్లోనూ నటించాడు. తన ఇంట్లోని కుక్కను తండ్రి చంపేసి వంటకం చేయడంతో తీవ్రంగా నొచ్చుకున్న పాకియో 12 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వీధుల్లో మిఠాయిలు అమ్ముతూ జీవనం సాగించిన అతను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారాడు. -
రూ. 1900 కోట్ల 'ఫైట్'
దాదాపు ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి. ఐదేళ్ల నిరీక్షణకు కొన్ని గంటల్లోనే తెరలేవబోతోంది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత 'రిచ్చెస్ట్ గేమ్'గా పరిగణిస్తున్న రింగ్ ఫైట్‌కు నగరంలోని 'ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనా' వేదిక కాబోతోంది. స్టేడియంలోని మొత్తం 16,800 సీట్లకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. 1900 కోట్ల రూపాయల బాక్సింగ్ పోరాటానికి అంతా సిద్ధమైంది. ఇక జూలు విదిలించి కొదమ సింహాల్లా రింగులోకి దూకడానికి జగద్విఖ్యాత బాక్సింగ్ చాంపియన్లు ఫ్లాయిడ్ మేవెథర్ జూనియర్, మన్నీ పేక్వియావో సిద్ధంగా ఉన్నారు. అమెరికాకు చెందిన 38 ఏళ్ల మేవెథర్ ఓటమి ఎరుగని వీరుడు. 14 సార్లు బాక్సింగ్‌లో ఛాంపియన్షిప్ సాధించారు. ఇక ఫిలిప్పీన్స్‌కు చెందిన 36 ఏళ్ల మన్నీ పేక్వియావో కూడా 2007 వరకు ఓటమి ఎరుగని వీరుడే. అందుకే ఆ రోజునే వీరిద్దరి మధ్య ఫైట్‌కు నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. వీరు ఎన్నడూ ముఖాముఖి ఫైట్ చేయలేదు. అందుకే నేడు ప్రపంచంలోని కోట్లాది మంది బాక్సింగ్ అభిమానులు అ క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. మేవెథర్ డిఫెన్స్‌లో దిట్ట, శరీరానికి పెద్ద గాయం తగలకుండా ఆత్మరక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇక పేక్వియావోకు ఎదురుదాడిలో ఎదురు లేదు. అందుకనే ఆయనను ప్యాక్మేన్ అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పుడు వీరిద్దరి పోరాటం ఎలా ఉంటుందన్న అంశంపై బాక్సింగ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. పోరాటం పట్టు తప్పి చప్పగా సాగితే బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు కుప్పకూలుతాయని, ఉత్కంఠతో ప్రేక్షకుల నరాలు తెంపే తీరులో సాగితే భవిష్యత్ బాటంతా బంగారమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -1900 కోట్ల రూపాయల ఈ ఛాంపియన్‌షిప్‌లో విజేతకు ఖరీదైన మూడువేల పచ్చలు (ఎమెరాల్డ్స్) పొదిగిన పట్టాతో సత్కరిస్తారు. 1147 కోట్ల రూపాయలను అందజేస్తారు. -పరాజితుడికి 765 కోట్ల రూపాయలు అందజేస్తారు. -టిక్కెట్ల రూపంలో నిర్వాహకులకు ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయలు వచ్చాయి. టీవీ రైట్స ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి. వాటి వివరాలు వెల్లడి కాలేదు. -2007లో జరిగిన ఓ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించినట్టు అంచనా వేశారు. ఈసారి 30 కోట్లకు పైగానే వీక్షిస్తారని అంచనా. -
పైట్ ఆఫ్‌ది సెంచరీకి బాక్సింగ్ ప్రపంచం రెడీ