
కొదమ సింహాల్లా కలబడ్డారు
లాస్‌వేగాస్: ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) బాక్సింగ్ యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ఇద్దరు మహాబలులు హోరాహోరీ తలపడుతున్నారు. వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు) జరుగుతున్న పోరులో బ్యాక్సింగ్ కింగ్ లు ఇద్దరూ కొదమ సింహలా కలబడడుతున్నారు.
బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’పాకియో పైచేయి సాధించాడు. ఎటాకింగ్ తో మేవెదర్ ను పాకియో ను బెంబేలెత్తిస్తున్నాడు. మేవెదర్ ఆత్మరక్షణ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే మొదట వెనకబడినట్టు కనబడిన మేవెదర్ తర్వాత పుంజుకున్నాడు.