padaharella vayasu
-
నీ కోసం నిరీక్షణ
కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో రీమేక్ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు. సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పంటచేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేతపచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే ॥॥ చరణం : 1 ఆమె: శివ గంగ తిరనాళ్లలో నెలవంక స్నానాలు చెయ్యాలా చిలకమ్మ పిడికిళ్లతో గొరవంక గుడిగంట కొట్టాలా అ: నువ్వు కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా (2) ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా ॥॥ చరణం : 2 ఆ: గోదారి పరవళ్లలో మా పైరు బంగారు పండాలా ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా అ: నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా (2) ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥ చిత్రం : పదహారేళ్ళ వయసు (1978) రచన : వేటూరి సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి