padayatra issue
-
కోమటిరెడ్డి పాదయాత్రకు బ్రేక్
సాక్షి, నల్లగొండ: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందిదని.. ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈనెల 26 నుంచి బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర అనుమతి కోసం డీజీపీ, ఎస్పీకి కోమటిరెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ పోలీసులు పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో పాదయాత్రకు బ్రేక్‌పడినట్లైంది. అయితే ప్రాజెక్టు సాధనకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. అనుమతివ్వలేమని నోటీసులు.. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సాధన పాదయాత్రకు సంబంధించి అనుమతి కోసం కోమటిరెడ్డి ఈనెల 19న డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 23న ఎస్పీకి కూడా లేఖ రాశారు. జాతీయ రహదారి వెంట పాదయాత్ర చేస్తున్నందున భద్రత కల్పిస్తూ అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ నోటీసులు జారీ చేశారు. జాతీయ రహదారి అయినందున నిత్యం రద్దీగా ఉంటుందని, గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని పోలీసులంతా బందోబస్తు దృష్ట్యా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని, హైదరాబాద్ నుంచి విగ్రహాలు నల్లగొండ, ఇతర ప్రాంతాలకు వస్తాయని, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని.. జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటోందని, గతంలో రహదారిపై జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం హక్కులను హరిస్తోందన్న కోమటిరెడ్డి ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్తూనే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాదయాత్రను అణచివేయాలని చూడడం సరి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నల్లగొండ జిల్లా ప్రాజెక్టుపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. తాను శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తానని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా అనుమతివ్వకపోవడం స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని.. హైకోర్టు నుండి అనుమతి తీసుకొచ్చి ప్రాజెక్టు సాధన కోసం రైతు పాదయాత్ర చేసి తీరతానని స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం నల్లగొండ క్రైం: ఈనెల 26 నుండి 29 వరకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టే ఉదయ సముద్రం – బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు అనుమతించడం లేదని ఎస్పీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా ప్రజలు పండుగను జరుపుకునేందుకు తగిన బందోబస్తు కల్పించాల్సి ఉంటుందని, జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంటుందని, వినాయక విగ్రహాలను హైదరాబాద్ నుంచి తీసుకెళ్తూ ఉంటారని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. నిత్యం 40వేల వాహనాలు జాతీయ రహదారిపై వెళ్తున్నట్లు టోల్గేట్లో నమోదైన రికార్డు తెలుపుతోందని వెల్లడించారు. ‘పాదయాత్రకు మార్గం సుగమం–ప్రజాపోరుకు సిద్ధం కండి’ అంటూ పోస్టర్‌ను విడుదల చేయడంతో కొందరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినట్లు వివరించారు. ఈనెల 26న అధిక వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 5 నుంచి 10 మందితో పాదయాత్ర చేసేందుకు వినతిపత్రం ఇస్తే సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. కోమటిరెడ్డి గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్లు పోలీస్ రికార్డు ఉందని వెల్లడించారు. 2014లో ఎన్నికల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, 2015లో ఎస్ఎల్బీసీకి అనుమతి లేకుండా బైక్ ర్యాలీ తీశారని, 2018లో వీటీ కాలనీ నుంచి బైక్‌ర్యాలీ, చర్లపల్లి నుంచి క్లాక్ టవర్ వరకు అనుమతి లేకుండా బైక్ ర్యాలీ తీసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఎస్పీ తెలిపారు. -
పాదయాత్రపై ఉత్కంఠ
3 వేల మంది పోలీసుల మోహరింపు కోనసీమ చేరుకుంటున్న అదనపు బలగాలు పది రోజులపాటు కోనసీమ ఖాకీవనం అమలాపురం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూ నే.. మ రో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలి సిందే. జిల్లా పోలీసు యంత్రాంగం తుని విధ్వంసం నేపథ్యంలో ఎటువంటి అంవాఛనీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసులను మోహరిస్తోంది. కీలక ప్రాంతాల్లో పోలీసుల హడావుడి ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా సాధారణ పోలీసులనే కాకుండా ప్రత్యేక పోలీసులు, ఆర్మ్డ్ ఫోర్సు, ఏఎ¯ŒSఎస్‌లకు చెందిన సుమారు 3 వేల మందిని కోనసీమకు రప్పించారు. రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు పాదయాత్రలు చేయడం, ఆ సమయంలో పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం సర్వసాధారణమే గానీ, ఈసారి ఏకంగా మూడు వేల బలగాలను దింపడం ఇదే తొలిసారి. వీరు పది రోజుల పాటు కోనసీమలోనే ఉండనున్నారు. ఖా కీల రాక ప్రారంభం కావడంతో అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం వంటి కీలక ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల వద్ద వారి హడావుడి మొదలైంది. కాపు ఉద్యమపరంగా కోనసీమ సున్నిత ప్రాంతం కావడంతో యాత్ర జరిగే ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం కోనసీమలోని అన్ని ప్రాం తాల్లోనూ అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. కోనసీమతో పాటు ముద్రగడ సొంత ప్రాంతం కిర్లం పూడి, కాపు ఉద్యమ నేతలు చురుగ్గా ఉన్న ప్రాంతాల్లో పోలీసుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. ఉద్యమకారులపై నిఘా తుని ఘటనను దృష్టిలో పెట్టుకుని ఉద్యమకారులపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. నాటి ఘటనలో నిందితులుగా ఉన్నవారిపై ఇప్పటికే ఒక కన్నేసిన పోలీసులు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారిపై స్టేషన్ల వారీగా ఆరా తీస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యే రావులపాలెం పోలీస్ స్టేష¯ŒSకు 1,600 మంది సిబ్బందిని కేటాయించగా, ఇప్పటికే 302 మంది చేరుకున్నాంటే మోహరింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ , జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్, అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తదితర పోలీస్ ఉన్నతాధికారులు రావులపాలెం పోలీస్‌స్టేçÙ¯ŒSలో పరిస్థితిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత ప్రాంతం కావడంతో అమలాపురంలో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ మోహరింపే కాకుండా పాదయాత్ర రూట్ పొడవునా బందోబస్తు ఎక్కువగా ఉంచనున్నారు. రూట్ మ్యాప్ పరిశీలించిన పోలీసులు ఆయా గ్రామాల్లోని నాలుగు రోడ్ల కూడళ్లలో బందోబస్తు పెంచేందుకు నిర్ణయించారు. ఎంపిక చేసిన ముఖ్యకూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రకు వెనుక, ముందు మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. బలగాలతోపాటు ఆందోళనకారులను చెదరగొట్టే వాటర్క్యా¯ŒS వాహనాన్ని సైతం సిద్ధం చేశారు. దీన్ని అనంతపురం నుంచి రావులపాలానికి ప్రత్యేకంగా రప్పించారు. కోర్టులో పిటిష¯ŒS కాపు ఉద్యమకారుల పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున దీన్ని నిలుపుదల చేయాలంటూ రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది మేడా శ్రీనివాసరావు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. యాత్ర వల్ల వర్గవైషమ్యాలు తలెత్తుతాయి కాబట్టి యాత్రను అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఇదే సమయంలో పోలీసులు సైతం పాదయాత్రకు తమ నుంచి అనుమతి తీసుకోలేదని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.