Padmawati
-
తమ్ముడు ఇన్...అన్న అవుట్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి గొల్పుతున్నాయి. అనూహ్య విజయాలు, పరాజయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్రవేసుకున్న కోమటిరెడ్డి సోదరులు ఒకేసారి అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. నల్లగొండనుంచి అయిదో విజయం కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలుకాగా, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో తమ్ముడు ఇన్.. అన్న అవుట్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని చెబుతుంటారు. 2009 ఎన్నికల్లో గురుశిష్యులు ఒకే సారి అసెంబ్లీకి వెళ్లారు. కానీ, ఈ ఎన్నికల్లో శిష్యుడు లింగయ్య విజయం సాధించగా, వెంకట్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నేతల్లో ఈసారి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మరో వైపు నల్లగొండ జిల్లాలో పలువురు నేతలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రికార్డును రాజగోపాల్‌రెడ్డి బ్రేక్ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడి పదవి రించింది. రామన్నపేట మాజీ ఎమ్మె ల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేశారు. కాగా, ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. అదేమాదిరిగా, గురు శిష్యుల సంబంధం ఉన్న కె.జానారెడ్డి ఓడిపోగా, ఆయన శిష్యుడిగా పేరున్న ఎన్.భాస్కర్‌రావు మిర్యాలగూడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా> గెలిచారు. పతి గెలుపు... సతి ఓటమి రాష్ట్ర రాజకీయాల్లో ఒకేసారి శాసన సభకు ఎన్నికైన దంపతుల జాబితాలో చేరిన మూడో జంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. 2014 ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి గెలిచారు. గతంలో ఇలా.. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలా దేవి, ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి టీడీపీ పార్టీ తరఫున దయాకర్‌రెడ్డి, ఆయన భార్య సీతాదయాకర్‌రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, రెండో సారి కూడా గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలనుకున్న ఉత్తమ్ దంపతులకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసినా, టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. -
దటీజ్ ఫైనార్ట్స్..
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో బహుశా ఏ యూనివర్సిటీలో లేని విచిత్ర పరిస్థితి ఫైనార్ట్స్ యూనివర్సిటీలో ఏర్పడింది. ఒక్క యూనివర్సిటీకి ఇద్దరు ఇంచార్జీ వీసీలు ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించవేమో. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు ఇంచార్జీ వీసీల పాలన సాగుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలోని విచిత్ర పరిస్థితిపై వర్సిటీ ఉద్యోగులు బిత్తరపోతున్నారు. ఇక్కడ నెలకొన్న పరిణామాలపై ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోకపోవడంతో సిబ్బంది పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా మారింది. జేఎన్ఏఎఫ్ఏయూ ఇంచార్జి వీసీగా ఉన్న ప్రొఫెసర్ పద్మావతిని తొల గించి..ఆ బాధ్యతలను విదేశీ పర్యటనలో ఉన్న జేఎన్టీయూహెచ్ వీసీకి అప్పగించడం, ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రొ.పద్మావతికి కోర్టు నుంచి స్టేఆర్డర్స్ లభించిన సంగతి తెలిసిందే. వర్సిటీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపడుతున్న దాఖలాలు ఇప్పట్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. వర్సిటీలో వర్గపోరు: న్యాయస్థానం నుంచి స్టేఆర్టర్స్ మేరకు ప్రొ.పద్మావతి ఈనెల 11నుంచి ఇంచార్జి వీసీగా తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. అయితే.. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు జేఎన్టీయూహెచ్ వీసీ రామేశ్వరరావు ఈనెల 13న జేఎన్ఏఎఫ్ఏయూ ఇంచార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. వీసీ నియామకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది రెండువర్గాలు చీలిపోయారు. న్యాయస్థానం నుంచి స్టేఆర్డర్ తమకు చేరనందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామేశ్వరరావు బాధ్యతలు స్వీకరించినట్లు వర్సిటీలో ఓ వర్గం వాదిస్తుండగా..రామేశ్వరరావు విదేశీ పర్యటన నుంచి రాకమునుపే ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయస్థానం స్టేఆర్డర్స్ ఇచ్చిందని, వీసీగా కొనసాగే అర్హత పద్మావతికే ఉందని మరోవర్గం అంటోంది. కదలని ఫైళ్లు : వర్సిటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో అనేక ఫైళ్లు పేరుకుపోతున్నాయి.న్యాయస్థానం ఆదేశాల మేరకు వీసీ కుర్చీలో కూర్చున్న పద్మావతి చాంబర్కి గానీ, జేఎన్టీయూహెచ్ వీసీకి గానీ వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫైళ్లు వెళ్లడం లేదని సమాచారం. ఫైళ్లు కదలకపోవడంతో పరి పాలనలో ప్రతిష్టంభన ఏర్పడింది. వర్సిటీలో నెలకొన్న పరి ణామాలపై రిజిస్ట్రార్ కవితా దరియానిని ‘సాక్షి’ వివరణ కోరగా..ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని, ఇంతకు మిం చి తానేమీ చెప్పలేనన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించి విశ్వవిద్యాలయానికి ఇంచార్జి ‘వీసీ ఎవరు’ అన్న అంశాన్ని త్వరగా తేల్చాలని అధ్యాపకులు,సిబ్బంది కోరుతున్నారు.