pal-v
-
ప్లయింగ్ కారు
నేల మీద కార్ల తరహాలో తిరుగుతూ.. నడవడానికి అసాధ్యమయ్యే ప్రాంతాల్లో పక్షిలా ఎగిరే వాహనాల గురించి సినిమాల్లోనో.. కార్టూన్లలోనో చూసుంటాం. కానీ పీఏఎల్–వి సంస్థ అచ్చం అలాంటి వాహనాలనే తయారు చేసింది. ఇవి నేల మీద ప్రయాణించడంతోపాటు అవసరమైనప్పుడు గాల్లో కూడా ఎగరగలవు. ఈ ఎగిరే కారులోని ప్రత్యేకతలు.. ప్రత్యేక ఫీచర్లు ఇద్దరు కూర్చుని ప్రయాణించే ఈ వాహనాన్ని హైబ్రిడ్ కారు లేదా గైరో ప్లేన్ అంటారు. డచ్‌కు చెందిన పీఏఎల్–వి, యూరోప్ ఎన్వి సంస్థలు ఈ మూడు చక్రాల ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశాయి. ఇది చూడటానికి బైక్ తరహాలో ఉన్నప్పటికీ సౌకర్యం పరంగా కారును పోలి ఉంటుంది. నేల మీద నడవడానికి, గాల్లో ఎగరడానికి అనుకూలంగా ‘టిల్టింగ్’ వ్యవస్థ ఉంటుంది. ఇది నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు గాల్లోకి ఎగరాలంటే విమానం తరహాలో కొద్ది దూరం సమతలం మీద ప్రయాణిస్తే నిర్దిష్ట వేగం పొందిన తర్వాత గాల్లోకి ఎగురుతుంది. అయితే టేకాఫ్ కోసం టచ్ ప్యాడ్ మీదున్న టేకాఫ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లయింగ్ కారులో ఉన్న సింగిల్ రోటార్, ప్రొపెల్లర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే విచ్చుకుంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గాల్లో ఎగరడానికి అనుకూలంగా సిద్ధమవుతుంది. ఈ వాహనం గరిష్టంగా 4000 అడుగుల ఎత్తు వరకు గాల్లో ఎగరగలదు. ఇది ఎయిర్ అన్ కంట్రోల్డ్ (వాయు అనియంత్రిత) విజువల్ ఫ్లైట్ రూల్స్ ట్రాఫిక్ విభాగంలోకి రావడం వల్ల వాణిజ్య విమానం తరహాలో అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందులో ఫ్లైట్ సర్టిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది నేల మీద, వాయు మార్గాల్లో గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆకృతి పరంగా హెలికాఫ్టర్‌ని పోలి ఉన్నప్పటికీ హెలికాఫ్టర్లోని మెయిన్ రోటార్తో పోల్చితే.. ఇందులోని మెయిన్ రోటార్ వేగం తక్కువగా ఉంటుంది. ఇందులో ఇంజన్ ఫెయిలయితే దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇందులోని గైరోప్లేన్ టెక్నాలజీ రోటార్‌ను తిప్పడానికి సహాయపడుతుంది. తద్వారా తక్కువ వేగం వద్ద ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ ప్లయింగ్ కారులో సీసం, మిశ్రమ రహిత పెట్రోల్‌ను వినియోగిస్తారు. ఇది గగన తలంలో ఉన్నప్పుడు లీటర్‌కు 28 కి.మీల మైలేజ్, నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు లీటర్‌కు 12 కి.మీల మైలేజ్ ఇస్తుంది. -
ఎగిరే కార్ల ధర ఎంతో తెలుసా?
లండన్ : హెలీకాప్టర్, విమానాల్లో కాకుండా కార్లలోనే ఆకాశంలోకి ఎంచక్కా ఎగిరేయోచ్చు. హెలీప్యాడ్, ఎయిర్‌పోర్టుల అవసరం లేకుండానే కార్లలో కూర్చోనే ఆకాశంలో విహరించొచ్చు. .ట్రాఫిక్ జాముల్లో గంటలకొద్ది ఎదురు చూడాల్సిన పని లేకుండా ఆకాశంలోంచే కార్లలో ఎంచక్కా గమ్యస్థానాలకు చేరుకోవొచ్చు. అవునండీ మీరు విన్నది నిజమే. ఈ కల త్వరలో సాకారం కాబోతుంది. డచ్ కంపెనీ పాల్-V గాల్లో చక్కర్లు కొట్టే కారు లిబర్టీని రూపొందించింది. కారు, హెలీకాప్టర్లను పోలి ఉండే ఎగిరే కారు లిబర్టీని 2018లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత యూకే మార్కెట్లలో ఈ వాణిజ్య కార్లను విడుదల చేయనున్నారు. ఎయిర్, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా లిబర్టీని తయారు చేస్తున్నామని పాల్-V తెలిపింది. లిబర్టీ ఓ గైరో ప్లేన్...చూడ్డానికి హెలీకాప్టర్‌కు ఉన్నట్టుగానే దీనికి పైభాగంలో బ్లేడ్లు ఉంటాయి. 100 హార్స్ పవర్ ఉండే రెండు ఇంజిన్లను ఈ లిబర్టీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అత్యవసర సమయాల్లో వినియోగించడానికి మరో ఇంజిన్ కూడా ఇందులో ఉంటుంది. గాల్లో లిబర్టీ 177 కిలో/గంట వేగంతో విహరించగలదు. అదే రోడ్డు పైన గరిష్ఠంగా 160 కిలో/గంట వేగంతో దూసుకు పోగలదు. డ్రైవింగ్ మోడ్ నుంచి ఫ్లైయింగ్ మోడ్‌లోకి మారడానికి పదినిమిషాల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించగలదు. ఇందులో పైలెట్‌తో పాటూ మరో వ్యక్తి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. అయితే త్వరలోనే కొత్త టెక్నాలజీతో కుటుంబసభ్యులు అందరూ కలిసి ప్రయాణించేలా మరో మోడల్‌ను కూడా రూపొందించే యోచనలో సంస్థ ఉంది. పర్వతాలు, నదులు, సరస్సులు, ట్రాఫిక్ జామ్‌లను దాటుకుంటూ లిబర్టీలో చక్కర్లు కొడుతుంటే ఓ కొత్త అనుభూతి కలుగుతుందని పాల్-V యాజమాన్యం తెలిపింది. ఈ వాహనంలో చక్కర్లు కొట్టాలంటే మాత్రం ముందస్తుగా శిక్షణ తీసుకోవాల్సిందే. రోడ్డు, గాల్లో ఈ వాహనాన్ని నడపాలంటే ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ ఉండాలి. లిబర్టీ తొలి మోడల్ ధర దాదాపు రూ. 3.8 కోట్లుగా నిర్ణయించారు. -
నాలుగు కోట్లకు ‘ఫ్లైయింగ్ కారు’
న్యూఢిల్లీ:నెదర్లాండ్స్ చెందిన ‘పాల్-వి యూరప్ ఎన్వీ’అనే కంపెనీ ఫ్లైయింగ్ కారుకు భారత్‌లో పేటెంట్ హక్కులు పొందింది. రోడ్డుపైనా పరుగులు తీయడంతోపాటు గాల్లో హెలికాప్టర్లా ప్రయాణించే ఈ కారును ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ యూరప్ మార్కెట్లో విడుదల చేయనుంది. విమానయాన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున భారతీయ మార్కెట్లో దీన్ని విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పర్సనల్ ల్యాండ్ అండ్ ఎయిర్ వెహికిల్ (పీఏఎల్-వి)గా పిలిచే ఈ ఫ్లైయింగ్ కారు రోడ్డుపైనా గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని, ఇంధనం లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అదే ఆకాశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, గంటకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే సౌకర్యం గల ఈ ఫ్లైయింగ్ కారు ధరను 3.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లైయింగ్ కార్లను తయారు చేయాలనే ఆలోచన అమెరికా ఏవియేషన్ అథారిటీ 1917లోనే ఆలోచన చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్లొవేకియాకు చెందిన ఎరోమొబైల్ కంపెనీ 2015లోనే రెక్కలుగల ప్లైయింగ్ కారు ప్రొటోటైప్‌ను తయారు చేసింది. అయితే అది ట్రయల్ రన్లో క్రాష్ అయింది. ఆ తర్వాత రెక్కలుగల ప్లైయింగ్ కార్లను తయారు చేస్తున్నామని ఎన్నో కంపెనీలు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ పాల్-వీ ఫ్లైయింగ్ కారుకు రెక్కలకు బదులుగా హెలికాప్టర్లలా రోటర్‌ను ఏర్పాటు చేశారు.