ఎమ్మెల్సీ పదవికి తుమ్మల రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తుమ్మల తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్కు పంపగా, ఆయన ఆమోదించారు. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున తుమ్మల రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
గత శాసనసభ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరిన తుమ్మలకు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇటీవల పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల ఆ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ తరపున బరిలో దిగి నియోజకవర్గ మెజార్టీతో విజయం సాధించారు.