Pallekele test
-
స్టార్క్ మాయాజాలం.. ఆసీస్ టార్గెట్ 268
ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య శ్రీలంక 353 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులు చేయగా, ఆసీస్ తమ తొలిఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. 282/6తో నాలుగోరోజు బ్యాటింగ్ కు దిగిన లంకను స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు. తొలి సెంచరీతోనే అతిపిన్న వయసులో ఈ ఫీట్ నమోదుచేసి రికార్డు సృష్టించిన కుశాల్ మెండిస్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్)ను త్వరగానే పెవిలియన్ బాట పట్టించాడు. ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి 290 పరుగుల వద్ద ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో హెరాత్(34 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు ) రాణించడంతో లంక 350 మార్క్ చేరుకుంది. హెరాత్ ను హెజెల్‌వుడ్ ఔట్ చేయడంతో లంక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో హెజెల్‌వుడ్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు తీశారు. -
మెండిస్ రికార్డు సెంచరీ.. కోలుకున్న శ్రీలంక
పల్లెకెలె (శ్రీలంక): ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో, 43వ ఓవర్ చివరి బంతిని సిక్స్ బాది కెరీర్ లో తొలి శతకాన్ని నమోదుచేశాడు. అతిపిన్న వయసులో టెస్ట్ సెంచరీ నమోదుచేసిన తొలి లంక ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. 21 ఏళ్ల 177రోజుల వయసులో కుశాల్ సెంచరీ చేయగా, గతంలో కలువితరణ (22 ఏళ్ల 267 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. తొలి టెస్టులో 117 పరుగులకే కుప్పకూలిన లంక, మెండిస్ రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో 48 ఓవర్లలో లంక 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెఫె, లియాన్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెండిస్(156 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) కు తోడుగా చండిమల్(21 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు. -
లంకకు చుక్కలు చూపించిన ఆసీస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక స్వల్ప స్కోరుకు చాపచుట్టేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 34.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటయింది. ఓ దశలో ఆసీస్ పేసర్ల దాటికి 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక లంచ్ సమయానికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అయితే లంచ్ అనంతరం స్పిన్నర్ లియోన్ విజృంభించడంతో లంక్ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. లంక చివరి 5 వికెట్లను 30 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్, లియాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కీఫె చెరో రెండు వికెట్లు తీశారు. లంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే(5) పరుగులు చేసి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అక్కడి నుంచి లంక వికెట్ల పతనం కొనసాగింది. ఆ మరుసటి ఓవర్లో హెజిల్వుడ్ బౌలింగ్ లో ఎదురుదాడికి దిగే యత్నంలో మెండిస్(8) ఔటయ్యాడు. కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్(15), చండిమాల్(15) కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. పేసర్ హెజిల్వుడ్ లంక టాపార్డర్ పతనాన్ని శాసించాడు. లంచ్ తర్వాత లియాన్ మాయాజాలం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్.. లంచ్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన లంక మిడిల్, లోయర్ ఆర్డర్ పనిపట్టాడు. లంచ్ తర్వాతి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 29వ ఓవర్ రెండో బంతికి డిసిల్వా(24), నాలుగో బంతికి దిల్రువన్ పెరీరా(0 )ను పెవిలియన్ బాట పట్టించాడు. తన తర్వాత ఓవర్లో కుశాల్ పెరీరా(20)ను బౌల్డ్ చేసి లంక కష్టాలను మరింత పెంచాడు. ప్రదీప్(0) ను కెఫె ఔట్ చేయడంతో 117 పరుగుల వద్ద లంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. -
ఆసీస్ పేస్‌కు లంక విలవిల
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక టపార్డర్ బ్యాట్స్ మన్ విఫలమయ్యారు. ఆసీస్ పేసర్ల దాటికి 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో చిక్కుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక లంచ్ సమయానికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కరుణరత్నే(5) పరుగులు చేసి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అక్కడి నుంచి లంక వికెట్ల పతనం కొనసాగింది. ఆ మరుసటి ఓవర్లో హెజిల్వుడ్ బౌలింగ్ లో ఎదురుదాడికి దిగే యత్నంలో మెండిస్(8) ఔటయ్యాడు. కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్(15), చండిమాల్(15) కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆసీస్ బౌలర్ హెజిల్వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో స్టార్క్, కీఫె చెరో వికెట్ తీశారు.