ఆసీస్ పేస్కు లంక విలవిల | australia pace bowlers take lanka top order wickets | Sakshi
Sakshi News home page

ఆసీస్ పేస్కు లంక విలవిల

Published Tue, Jul 26 2016 12:58 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

ఆసీస్ పేస్కు లంక విలవిల - Sakshi

ఆసీస్ పేస్కు లంక విలవిల

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక టపార్డర్ బ్యాట్స్ మన్ విఫలమయ్యారు. ఆసీస్ పేసర్ల దాటికి 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో చిక్కుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక లంచ్ సమయానికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కరుణరత్నే(5) పరుగులు చేసి ఇన్నింగ్స్ 5వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ లో వికెట్లు ముందు దొరికిపోయి తొలి వికెట్ గా వెనుదిరిగాడు.

అక్కడి నుంచి లంక వికెట్ల పతనం కొనసాగింది. ఆ మరుసటి ఓవర్లో హెజిల్వుడ్ బౌలింగ్ లో ఎదురుదాడికి దిగే యత్నంలో మెండిస్(8) ఔటయ్యాడు. కెప్టెన్ ఎంజిలో మాథ్యూస్(15), చండిమాల్(15) కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆసీస్ బౌలర్ హెజిల్వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో స్టార్క్, కీఫె చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement