panchayathi labours
-
పంచాయతీ కార్మికులకు పది వేల జీతం ఇస్తాం
సారంగాపూర్(జగిత్యాల): కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచుతామని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సారంగాపూర్ మండల కేంద్రంలో సారంగాపూర్, బీర్పూర్ మండలాల పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తెలిపారు. ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగియడంతో, ప్రత్యేకాధికారులు భాధ్యతలు చేపట్టి, పారిశుధ్యం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమింపజేయడానికి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ్మెపై అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ పంచాయతీ కార్మికులు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించే ఆత్మగౌరవ సభలో వేతనం పెంపు హామీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా ప్రకటింపజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్య సరళ, వైస్ ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, మండల కోఅప్షన్ సభ్యుడు ఎండీ.ఇబ్రహీం, పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్, మాజీ సర్పంచ్ న్యారబోయిన గంగాధర్, పార్టీ సీనియర్ నాయకులు వురుమల్ల లక్ష్మారెడ్డి, కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణరెడ్డి, ఎదులాపురం లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి
కొత్తకోట: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తకోటలో పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు మద్దలు తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల మాదిరిగా వేతన పెంపు, రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కార్మికులుగా పనిచేస్తున్న వారందరిని కర్ణాటక తరహాలో ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి రూ.5లక్షలు బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల అర్ధ్దనగ్న ప్రదర్శన డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని కార్మికులు చేస్తున్న సమ్మెకు ఐఫ్టీయూ జిల్లా నాయకులు ప్రసాద్, సాంబశివుడు సోమవారం మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి అర్దనగ్న ప్రదర్శన చేశారు. బాలకొండన్న, బాలయ్య, గట్టన్న, గాలె న్న, రవికుమార్, సాయన్న, రాములు, వాసు, రాజు, బొజ్జన్న, కర్రెన్న, సుదర్శన్‌రెడ్డి, భాస్కర్, మన్నెమ్మ, ఊషన్న, రాములు, కుర్మయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. గురువారం మంత్రి కేటీఆర్‌తో కార్మికులు సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు నెలల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని అన్నారు. గ్రామజ్యోతి పథకంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.