పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్
కొత్తకోట: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తకోటలో పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు మద్దలు తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల మాదిరిగా వేతన పెంపు, రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కార్మికులుగా పనిచేస్తున్న వారందరిని కర్ణాటక తరహాలో ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి రూ.5లక్షలు బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికుల అర్ధ్దనగ్న ప్రదర్శన
డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని కార్మికులు చేస్తున్న సమ్మెకు ఐఫ్‌టీయూ జిల్లా నాయకులు ప్రసాద్, సాంబశివుడు సోమవారం మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి అర్దనగ్న ప్రదర్శన చేశారు. బాలకొండన్న, బాలయ్య, గట్టన్న, గాలె న్న, రవికుమార్, సాయన్న, రాములు, వాసు, రాజు, బొజ్జన్న, కర్రెన్న, సుదర్శన్‌రెడ్డి, భాస్కర్, మన్నెమ్మ, ఊషన్న, రాములు, కుర్మయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment